యువత ఈ మాట వినగానే 16 సంవత్సరాల వాడి దగ్గరి నుండి 30 సంవత్సరాల వాడి వరకు ఉప్పొంగిపోతాడు నేను యూత్ అని ఫీల్ అవుతూ.ఒక సినిమాలో అన్నట్లు నువ్వు యూత్ ఎంట్రా అని. నిజమే యువత అంటే 18 నుండి 25 yrs వాళ్ళు మాత్రమె అని అర్ధం కాదు, 90 సంవత్సరాల వయసులో కూడా యూత్ ఉన్నారని నేను నమ్ముతా.యూత్ అంటే ఉరకలేసే ఉత్సాహం ఏదన్నా సాదించాలనే కసి,దానికోసం ఎంతయినా కష్టపడే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు యువత కిందకే వస్తారు వయసుతో సంబంధం లేకుండా.మన దేశ భవిష్యత్తు మన యువత మీద ఆదారపడి ఉంది అంటుంటారు కదా…!
బద్ధకం అనే దెయ్యం పట్టుకుని పీడిస్తున్న ఈ యువత(అదేనండి మనం ఫీల్ అవుతున్న ఈ యూత్) వల్ల దేశ భవిష్యత్తు ఏమవుతుందో……? నేను కూడా మనం ఫీల్ అయ్యే యూత్ లోకి వస్తున్న కొద్ది సేపు…. ఒకప్పుడు యూత్ అంటే 18 to 25yrs. ఈ ఏజ్ లోనే కొంటె పనులు, చిలిపి పనులు చిన్న చిన్న తప్పులు చేస్తాం. కాని మన యూత్ ఏజ్ ఇప్పుడు జెనరేషన్ లో 12 to 13yrs నుండే స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎంత ఎదిగిపోయామో కదా.12 , 13 సంవత్సరాల నుండే మందు,సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే మనం యూత్ ఏజ్ ని అప్పుడే స్టార్ట్ చేసామన్నమాట.ఇంటర్మీడియట్ వయసులోనే మన యూత్ లో 70% ఉహించనంత బయంకరమయిన అలవాట్లకు బానిసలవుతున్నారు అంటే కాదని అనగలరా….? ఇది సిగరెట్ పెట్ట మీద రాసిన "smoking is injurious to health " అన్నంత నిజం.అంటే మన భవిష్యత్తు యువత చేతిలో ఉంది అని భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మన యువత ఇప్పుడే మన దేశ చరిత్రను,సంస్కృతి ని మార్చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటె మనకు మార్పు అంటే ఇష్టం కదా…….!
ఒక చిన్న మొక్క రోడ్ పక్కన ఉంది,ఒక రోజు పెద్ద వర్షం వచ్చి దానికింద కొంచెం మట్టి కొట్టుకుపోయింది,అది బాలన్స్ అవుట్ అయి కొద్దిగా వంగింది.అలా అలా అది వంకరగా పెరుగుతూ వచ్చింది, అప్పుడు దాన్ని ఎవరు పట్టిచ్చుకోలే అలా అలా పెరుగుతూ పెద్దదయింది.చిన్నప్పట్నుండి కాస్త వంకరగా పెరగటం వల్ల అది వంగి రోడ్ కి అడ్డంగా రావడం మొదలు పెట్టింది,దాని వల్ల రోడ్ మీద వెళ్ళే వాహనాలకు ఆటంకం గా తయారయింది.ఇప్పుడు దాన్ని పక్కకు వంచుదామన్న కుదిరే పని కాదు అని తెల్సి R&B వాళ్ళు దాన్ని నరికి పడేసారు.ఇక్కడ చిన్న మొక్క అనేది మన యూత్,వర్షం అనేది యూత్ లైఫ్ లో మనకు ఎదురయ్యే సంగటనలు. రోడ్ అనేది సమాజం,వాహనాలు సమాజం లోని వ్యక్తులు. ఇలా ఆ మొక్కని మొక్కగా ఉండగానే సరిగా పెంచకపోవడం వల్ల మానుగా మారి దాని జీవనం సమాజం లో ఉన్న అందరికి ఆటంకంగా తయారయింది.
యూత్ ఎవరన్న ఏదన్నా మంచి విషయాలు చెప్తే తొక్కలో సోది ఈ వయసులో కాకపొతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం అని ఫీల్ అవుతాం. అస్సలు ఎంజాయ్ అంటే ఏంటి…….? మన వలన ఎదుటి వాడు బాధ పడకుండా మనం హ్యాపీ గా ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీ గా ఉంచడమే.ఎంతమంది కనీస బాద్యత లేకుండా ఇంట్లోవాళ్ళని బాధపెడుతూ, క్రమశిక్షణ లేకుండా గురువులను బాధపెడుతూ, పయిసాచకం గా తోటి వారిని హింసిస్తూ,ఇలా ఎంజాయ్ అనే ముసుగులో కొట్టుకుంటూ బ్రతికేస్తున్నారు.నిజమే ఇందులో వారి తప్పేమీ లేదు మొక్కని మనం చిన్నపుడు వంచకపోతే అది అలానే పెరుగుతుంది అందుకు ఆ తప్పు మొక్కది కాదు దాన్ని వంచని ఈ వ్యవస్తది.
మన ఈ ప్రభుత్వాలు ఏడాదికి వంద రెండొందల కాలేజీ లు పెంచుతూ ఏదో మన యువతకు ఉపాది కల్పిస్తున్నాం అని ఫీల్ అవుతూ కార్పోరేట్ సమత్సలకు మన సొమ్మును మన భవిష్యత్తును అమ్ముకుంటున్నారు.ఎన్ని కాలేజీ లు ఉన్నాయన్నది కాదన్నయ్యా ఏమి చెప్తున్నారన్నదే ముక్యం…..(మహేష్ బాబు అన్నట్లు).ఉన్న కాలేజీ లలోనే మన చదువులు మన మనుగడకి,మన భవిష్యత్తుకి,క్రమశిక్షనకి ఉపయోగ పడుతున్నాయా లేదా అని ఆలోచించడం లేదు.వెలుగుతున్న అగ్గిపుల్లని ఆర్పడానికి కనీసం చుక్క నీరు కూడా అవసరం లేదు,చేత్తో అర్పెయోచ్చు. అదే నిప్పును మనం పట్టిచుకోవడం మానేస్తే దాన్ని ఆర్పడానికి కొన్ని ఫైర్ ఇంజన్ లు వచ్చినా సరిపోదు.అంటే మన యూత్ నడిచే దారిని ఇప్పుడే మనం బాగుచేయకపోతే దాని వల్ల జరిగే ఈ విష పరిణామాలను ఆపడం అది ఎవరి తరం కాదు అని నా అభిప్రాయం.ప్రభుత్వాలు కనీసం ఇండియా లో ఉన్న ఒక్క బాచ్ ని అన్నా 10th క్లాసు నుండి డిగ్రీ అయ్యే వరకు జాగర్త గా అన్నీ విలువలతో క్రమసిక్షనగా బయటికి వచ్చేలా చేస్తే మన దేశం 100 సంవత్సరాల ముందుకి వెళ్తుంది అని నా అభిప్రాయం……..
యువర్'s.................................సతీష్.
మీ ఆక్రోశం అర్ధవంతమైనది
ReplyDeletegood satish but it is very late no one gonna think. but well tried......................
ReplyDeleteraghu
Thanx.. But we should think about our ftr right.
ReplyDeleteకొంచెం మానవత్వం గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!
ReplyDeleteహారం
Thanx n wish u the same.
ReplyDelete