ఆ రోజు సండే అందరికి హాలిడే,తొలి ఏకాదశి అందరం తెల్లవారుజామునే లేచి తల స్నానాలు చేసి గుడికి వేల్లోచ్చాము, అందరం బాచలర్స్ మా రూం కింద Bhagat వాళ్ళ ఫ్యామిలీ ఉండేది(రూం లో ఎవరి మద్య అయిన గొడవ జరిగి ఉండొచ్చేమో కాని,భగత్ తో గొడవ పడ్డవాళ్ళు ఒక్కరు కూడా లేరు)అందరం ఒకే ఫ్యామిలీ లా చాలా హ్యాపీ గ ఉండే వాళ్ళం. సండే అందరు రూం లోనే ఉన్నారు,ఫస్ట్ టైం రూం లో టైం పాస్ కి కార్డ్స్ స్టార్ట్ చేసాం,అంతలో కిరణ్ అన్న సెల్ కి కాల్ వచ్చింది,కిరణ్ అన్న టెన్షన్ తో ఏమి మాట్లాడాలో అర్ధం కాక నాకు ఫోన్ ఇచ్చాడు,అవతలి వ్యక్తీ హిందీ లో BHAGAT అంటే మీ వాడేనా అన్నాడు(Bhagat ఆ రోజు మార్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు కి వెళ్ళాడు,కిరణ్ అన్నవాళ్ళ తమ్ముడు Age23(Msc completed)).అవను మా వాడే అన్నాను,"మీ వాడికి యాక్సిడెంట్ అయింది త్వరగా రండి అన్నాడు"అవతలి వ్యక్తీ,
వెంటనే ఆ షాక్ లో నుండి కొంచెం తేరుకొని మా వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడిగాను కొంచెం డౌట్ గ,లేదు మీ వాడు మాట్లాడలేడు మీరు అర్జెంటు గ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ కి రండి అన్నాడు(Bhagat రోజు ట్రైన్ లోనే క్లాస్ కి వెళ్ళేవాడు).మాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ట్రైన్ ఆక్సిడెంట్ ఏమో అనుకున్నాం.వెంటనే Bhagat నెంబర్ కి కాల్ చేసాను “అన్న నేను మాట్లాడలేక పోతున్న త్వరగా రండి”అని ఫోన్ పెట్టేసాడు Bhagat,మాట్లాడగానే కొంచెం ధైర్యం వచ్చింది.వెంటనే ఏమి ఆలోచించకుండా నేను కిరణ్ అన్న ఒక బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాం.కొద్ది దూరం వెళ్ళగానే మళ్లీ ఫోన్ వచ్చింది ఈ సారి 108 నుండి "మీ వాడ్ని హాస్పిటల్(మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి తిసుకేల్తున్నాము మీరు అక్కడికి వచ్చేయండి"అని,మేమిద్దరం కొంచెం ఉపిరి పిల్చుకున్నాము హాస్పిటల్ కి వెళ్తున్నారంటే.చందానగర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే లోపు మా ఇద్దరి మద్య ఏవేవో ఆలోచనలు హైదరాబాద్ లో జరిగే ఆక్సిడెంట్ ల గురించి,లోపల ఏదో చిన్న బయముంది కాని మా వాడికి ఏమి కాదు అని ఇద్దరం అనుకుంటూ వెళ్తున్నాం,ఈ లోపు మేము హాస్పిటల్ (మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి చేరుకున్నాం అక్కడ వందల మంది జననాలు హడావుడి గ ఉంది మేము మా వాడికోసం వెతుకుతున్నాం,ఈ లోపు పక్కన ఒక మూలకి విరిగిపోఇన ఒక బల్ల మీద మా వాడ్ని పడుకోపెట్టారు(పడుకో పెట్టారు అనడం కన్నా పడేసారు అనాలి).
వెంటనే నేను వెళ్లి స్ట్రెచర్ కోసం వెదికితే ఒక్కటి కూడా లేదు,అక్కడ వార్డ్ బాయ్ ని అడిగితె ఆ పక్క మార్చురీ దగ్గర ఉంటాయేమో తెచ్చుకో అని రెక్లస్ గ(అసలు ఆ డ్యూటీ వాడిది)చెప్పాడు వెంటనే ఒక స్ట్రెచర్ తీసుకొచ్చి దానిమీద పడుకోపెట్టి అంతా చూసాం ఒక్క దెబ్బ కూడా లేదు బ్లడ్ మార్క్ కూడా లేదు,హమ్మయ అని ఉపిరి పిల్చుకున్నం(అదే మమ్మల్ని ఏమి కాదులే అనే నిర్లక్ష్యం లోకి నెట్టింది),డాక్టర్ ౩౦నిముషముల తరువాత చూసి X-ray తీపిచ్చండి అన్నారు,X-Ray రూం కి వెళ్తే ఎంతో కొంత చేతిలో పెడితే కాని X-ray తియమన్నారు,వాడికి డబ్బులిచ్చి X-ray రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తే డాక్టర్ లేరు అక్కడున్న మెడికో స్టూడెంట్ X-ray ని పయికి కిందకు చూస్తుంది(మిగత స్టూడెంట్స్ మా వాడి మీద మెడికల్ ప్రాక్టిస్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్ గురించి ఆలోచించకుండా),వెంటనే ఇంకో డాక్టర్ వచ్చి మీరు X-Ray రివర్స్ పెట్టి చూస్తున్నారు అని తను చూసి రిబ్స్ 2 r 3 బ్రేక్ అయ్యాయి ప్రాబ్లెం ఏమి లేదు(వాళ్లకి ఉన్న ప్రాబ్లెం ని లేదు అని చెప్పడానికి 2 గంటలు పట్టింది)అడ్మిట్ చేయండి 1 r2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు,మేము హమ్మయ ఓకే ఏదన్నా ఆర్దోపెదిక్ దగ్గరకు తిసుకేల్దాం రేపు ఈ రోజు సండే కదా అనుకున్నాం,ఈ లోపు మా వాడు నొప్పి తట్టుకోలేక పోతున్న అని బాధ పడుతున్నాడు,మళ్లీ డాక్టర్ ఒకసారి స్టమక్ స్కాన్ చేపిచ్చండి అన్నారు వెంటనే స్కాన్ చేపిచ్చాం ఆ రిపోర్ట్ లో కొద్దిగా స్టమక్ లో బ్లీడింగ్ అవుతుంది అన్నారు వెంటనే ప్రయివేట్ హాస్పిటల్ కి కాల్ చేసి అక్కడికి తీసుకు వెళ్దామని బయల్దేరాము(ఈ హాస్పిటల్ (మహాత్ముడి పేరు పెట్టుకున్న)నిర్లక్ష్యం అప్పటికి అర్ధమయింది మాకు),అక్కడికి 15నిముశాలలొ చేరుకున్నాం,అక్కడికి వెళ్ళగానే మహాత్ముడి పేరుపెట్టుకున్న హాస్పిటల్ లో మా వాడ్ని కనీసం 5mins పట్టుకుని టెస్ట్ చేసిన డాక్టర్ లేడు,కాని ఇక్కడ 5mins కూడా మా వాడ్ని వదిలేసి లేరు డాక్టర్స్,15mins లో అన్ని టెస్ట్లు చేసారు…చాలా కర్చు అవుతుందని చెప్పారు మా జేబులో అప్పుడు మని లెకపొఇన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్.ఎంత కర్చు అయిన పర్లేదని చెప్పాం,30 మినిట్స్ అయింది.తనకి ఏవేవో ట్యుబ్స్ పెట్టారు ఏవేవో చేస్తున్నారు మాకేమి అర్ధం కాక అలానే నిలబడి చూస్తున్నాం,ఈ లోపు వాళ్ళ అమ్మ నాన్న,మా రూం వాళ్ళు హాస్పిటల్ కి వచ్చారు,డాక్టర్ వచ్చి నన్ను రూం లోకి తీసుకెళ్ళి ఒక ఫాం ఇచ్చి దాని మీద సైన్ చేయమని చెప్పారు దేనికి అని అడిగాను అప్పుడు టైం 6:30pm,తను చనిపోయాడు 6:20pm కి అని చెప్పారు,నాకు కొద్దిసేపు ఏమి అర్ధం కాలేదు,కళ్ళన్నీ నీళ్ళతో నిండిపోయాయి రూం బయట వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు,మమ్మల్ని సొంత వాళ్లలా చూసుకునే వాళ్ళు.బయటికి వెళ్లి వాళ్లకు ఏమి చెప్పాలో మాకు అర్ధం కాలేదు.అలానే బాధపడుతూ ఆ పేపర్ మీద సైన్ చేసాను.ఒక్కసారి వాళ్ళ బాద ని ఉహించె ధైర్యం కూడా మాలో ఎవరికి లేదు,పెద్దమ్మ మా దగ్గరికి ఒచ్చి ఇంతమంది ఉండి కూడా వాడ్ని కాపడుకోలేకపోయామురా అంటే మాకు ఏమి చెప్పాలో కూడా అర్ధం కాలేదు,అప్పుడు అర్ధం అయింది మాకు మా చదువులు కాని మా దగ్గరున్న క్రెడిట్ కార్డ్స్ కాని తనని కాపాడడానికి ఉపయోగపడలేక పోయాయే అని.
ఒక్కరోజులోనే చేతికందిన ఎంతో తెలివి,భవిష్యతు ఉన్న కొడుకుని పోగుట్టుకున్న ఆ ఫ్యామిలీ కి ఏమి చెప్పి ఒదార్చగలం.తను చనిపొఇన్ది ఎలానో తెల్సా ఒక ఆటో వాడు,ఒక బస్సు వాడు చేసిన చిన్న తప్పుకి ఆ రెండిటి మద్య తన భవిష్యతు నలిగిపొఇన్ది.రోజుకి ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ లో మినిముం ముగ్గురు చనిపోతున్నారు,అంటే రోజుకి మూడు ఫామిలీస్ బలి అవుతున్నాయి,ఎంత దారుణం కదా మనం 5 నిముషాలు ముందు వెళ్ళాలి అనే కంగారులో మన జీవితాన్నో లేక ఎదుటి వాళ్ళ జీవితాన్నో నాశనం చేస్తున్నాం,ఒక్కసారి ఆలోచించండి,కాస్త ఆలోచించి నడుచుకుంటే ఎన్నో ఆక్సిడెంట్ ల ని కంట్రోల్ చేయొచ్చు,ఎన్నో జీవితాలను కాపాడొచ్చు,ఈ సారి ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నపుడు అలోచించి డ్రైవ్ చేస్తారని మన మీద వేరే వాళ్ళు ఆదారపడి ఉన్నారని ఆలోచించండి.
ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్(మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి వెళ్తే చావు ద్వారాలకు దగ్గరిగా వేల్తున్నట్లే అని ప్రజల్లో ఒక గట్టి నమ్మకం,ఇది నిజమే అని నా అనుభవం తో చెప్తున్నాను.కాని ప్రతి సామాన్యుడు ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్ళే స్థోమత ఉండదు కదా,నేను ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్ ని మా వాడ్ని చూడండి అని అడిగితె రోజుకి వందల కేసులు వస్తాయి మాకు అన్నారు(మరి మీకు జీతాలు ఇస్తుంది ఆ కేసులను చూడటానికే కదా),మీ పేపర్ మీద అవి కేసు ల లానే కనిపిచ్చొచ్చు కాని అది ఒక జీవితం,మీరు లేట్ చేసే ప్రతి నిముషం ఒకరు ప్రాణాన్ని కోల్పోతున్నారు,దాన్ని మళ్లీ మీరు తిరిగి తీసుకు రాగలర,మీరు మీ నిర్లక్ష్యం తో అధికారికం గ ఒక మర్డర్ చేస్తున్నారు,చనిపొఇన వ్యక్తీ బాడీ ని బయటికి తెచ్చుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇవ్వాలి,వాళ్ళ బందువులు ఏడుస్తూ ఉంటె మీకు వెళ్లి డబ్బులు అడిగే మనసు ఎలా వస్తుంది.....?అటువంటి డబ్బు తో ఏమి చేద్దామని,పేషంట్ కి ట్రీట్మెంట్,సర్వీసు చేసి తనకి క్యూర్ అయిన తరువాత వాళ్ళు ఆనందం గ ఇచ్చే వాటిని తీసుకోండి,ఒక జీవితాన్ని కాపాడండి.మహాత్ముడు ఎంతోమందికి సేవ చేసాడు కనీసం మీరు ఆ పేరు పెట్టుకున్న హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు. సాలరీ తిసుకున్తున్నందుకు సేవ కాకపోఇన కనీసం మీ డ్యూటీ మీరు సవ్యం గ చేయండి ప్లీస్.
Bhagat చనిపోవడానికి ఎవరి తప్పూ అని తెల్సుకోవడం వల్ల ఏ ఉపయోగం లెకపొఇన….ఈ వ్యవస్థ లో ఉన్న లోపాల వలన మేము ఒక తమ్ముడి లాంటి మంచి స్నేహితుడిని,వాళ్ళ ఫ్యామిలీ ఎంతో భవిష్యతు ఉన్న ఒక కొడుకుని కోల్పోయి ఇప్పటికి బాదపడుతునే ఉంది.(DOB -8th May 1985...DOD -13th July 2008 )
ఎప్పటికి Bhagat మా మనస్సులో తీపి గుర్తు గ మిగిలే ఉంటాడని…………..సతీష్.
heart moving
ReplyDeleteits a very goood messsage
i sincerely appreciate ur efforts to reform this society