Raoగారి ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు,వాళ్లకి ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది,అబ్బాయి 10th క్లాసు చదువుతున్నారు.Rao గారి నేటివ్ ప్లేస్ రాజముండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు.సమ్మర్ స్టార్ట్ అయింది పిల్లలికి సమ్మర్ హాలిడేస్ వచ్చాయ్.ఒకరోజు పొద్దున్నే 8am కి(హైదరాబాద్ లో ఇది చాలా ఎఅర్లీ మార్నింగ్ లే) Rao గారి ఇంట్లో సెల్ మోగింది ఆ ఇంట్లో మొత్తం 6 r 7 సెల్ల్స్ ఉన్నాయ్(పనిమనిషి సెల్ కాకుండా) ఎవరి ఫోన్ మొగిందో అర్దమఎలోపు ఫోన్ రింగ్ ఆగిపోఇంది.చూస్తే Rao గారి పర్సనల్ సెల్(ఆఫీసు కాంటాక్ట్స్ కోసం ఇంకో సెల్ ఉందిలే) లో మిస్సేడ్ కాల్ ఉంది అది వాళ్ళ నాన్న గారి దగ్గరనుండి,సరే మళ్లీ Rao గారు కాల్ చేసారు అవతల వాళ్ళ నాన్న గారు ఊరినుండి."బాబు ఎలా ఉన్నావురా(ప్రేమతో)", "ఆ బాగున్నాం నాన్న(హడావుడి గా)"."బాబు ఈ వేసవి సెలవులకు పిల్లల్ని తీసుకుని రా ఒకసారి ఉరికి"అని చెప్పి పెట్టాసారు.Rao గారు వాళ్ళ పిల్లలితో ఈ సమ్మర్ హాలిడేస్ కి మనం తాత గారి ఉరికి వెళ్తున్నాము అనగానే,వాళ్ళ అమ్మాయి "నో డాడ్"అంది,వెంటనే యందుకు అంటే అక్కడ "M TV రాదు, పవర్ కట్ ఉంటుంది and ఇంటర్నెట్ అస్సలే ఉండదు బోర్ డాడ్ నేను రాను"అంది.
ఒక్కసారి ఆలోచించండి TV లేకుండా,ఇంటర్నెట్ లేకుండాఎంతమంది బ్రతకట్లేదు.ఒక మేధావి ఎన్నో సంవత్సరాలు కష్టపడి విజ్ఞానం కోసం TV ని కనిపెడితే ఇప్పుడు దానిముందు కొన్ని లక్షల మంది కాలీ గ కూర్చుని అవిజ్ఞానం సంపాదిస్తున్నారు,ముందే ఆ మేధావి ఇలా జరుగుతుందని ఉహించి ఉంటె పాపం TV అనే దాన్నికనిపెట్టేవాడు కాదేమో.యంతో మంది మేధావులు భవిష్యతు తరాలకు విజ్ఞానాన్ని అందించడానికి యంతో శ్రమించి మనకి ఈ టెక్నాలజీ ని అందిస్తే మనం ఆ టెక్నాలజీ ని మంచికి ఉపయోగించుకోవాల్సింది పోయి దాన్నిమనం దుర్వినియోగం చేస్తున్నాము.అణువు పరమాణువు ల మీద మన వాళ్ళు రీసెర్చ్ చేసింది అణు బాంబు తయారు చేసుకుని మనల్ని మనం చంపుకోవడానికా..?గూగుల్ సెర్చ్ తెలియని స్టూడెంట్ ఈ గూగుల్ యర్త్ మీదనే ఉండడేమో కదా.అలాంటి గూగుల్ సెర్చ్ ని కనిపెట్టిన వాళ్ళు చాలా మేధావులు,అందులో మనకు ఎన్నో తెలియని,తెలుసుకోవాల్సిన విషయాలను పొందుపరిచారు,2yrs బ్యాక్ రీసెర్చ్ లో తెల్సిన ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ ని ఎక్కువ యూస్ చేస్తుంది 16 to 20yrs ఏజ్ లోపు వాళ్ళంతా(వాళ్ళు ఏ (అ)విజ్ఞానం కోసం) యూస్ చేస్తున్నారో అందరికి తెల్సు.
ఇది వాళ్ళ తప్పా అంటే కాదు,మనందరి తప్పు అంతెందుకు మా పక్కింటి వాళ్ళ బాబు వాడు 7th క్లాస్,ప్రతి క్రికెటర్ పేరు టక్కున చెప్తాడు,ప్రతి బాలీవుడ్ హీరో హీరోయిన్ పేరు వాళ్ళ అఫ్ఫైర్స్ చెప్తాడు అది చూసి మా వాడికి యంత తెలివో అని మురిసిపొతాము.కాలేజ్ లో ఒక స్టూడెంట్ కి లేటెస్ట్ అఫ్ఫైర్స్,లేటెస్ట్ ఇంగ్లీష్ ఆల్బుమ్స్ పేర్లు తెలీదంటే వాడికి ఏమి చేతకాదు అన్నట్లు చూస్తారు.ఎంతమంది స్టూడెంట్స్ కి ఒక గాంధి,ఒక భగత్ సింగ్(వాళ్ళ విగ్రహాలు రోడ్ మీద ఉంటాయి కాబట్టి)తప్ప మన దేశ నాయకులు తెల్సో అడగండి.అంతెందుకు మొన్న ఎలక్షన్స్ ముందు సికింద్రాబాద్ సర్వే లో జయసుధ గారి ఫోటో చూపించి ఎవరు ఈమె అంటే 60% పీపుల్ కి తెలీదు అన్నారట కాని ఆమె అక్కడ MLA గ గెలిచారు అంటే మనం మన దగ్గర పోటి చేసే అబ్యర్ది ఎవరో కూడా తెల్సుకోకుండా వోట్ వేస్తున్నామనమాట.మనకి మన పిల్లలికి దేశ నాయకుల గురించి కాని మన రాజకీయ నాయకుల పరిస్తితి కాని తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాము.చాలా మంది స్టూడెంట్స్(డిగ్రీ స్టేజి లో ఉన్న)కి వాళ్ళ వాళ్ళ నియోజక వర్గ MLA ఎవరో అడగండి ఎంతమందికి తెలుసో....?
మనల్ని విజ్ఞానవంతుల్ని చేయడానికి మీడియా అనేది ఉంది.ఒకప్పుడు స్వాతంత్ర సమరం లో కూడా మీడియా నే ప్రజలందర్నీఉత్తేజపర్చింది,అటువంటి మీడియా ఇప్పుడెల ఉందంటే.మొన్న ఒక ఆర్టికల్ చూసాను ఎక్కడో చెన్నై లో ఒక స్వామి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు అని చాలా బాగుంది.
ప్రజల్ని మేల్కోలిపేలా ఉంది,కాని దానికిన్దనే ఆ స్వామి వ్యభిచార video ని ఈ site లో చూడండి అని ఒక site ని పెట్టారు.ఎంత దారుణం ఇది నాకు ఆస్వామికన్నా వీళ్ళే
వ్యభిచారులు ల కనిపిచ్చారు,ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లల తో కలిసి కనీసం న్యూస్ చూడాలన్న భయం గ ఉంది.మన TV వాళ్లకి ఒక పాపులర్ హీరో,హీరోయిన్ ప్రొద్దున లేచి నైట్ పడుకునే దాక ఏమి చేస్తారు,ఇలాంటి వాటి మీద ఉన్న ఇంటరెస్ట్ ప్రజల్ని విజ్ఞానవంతుల్ని చేయడంలో లేదు,నేను వినోదం వద్దు అనట్లేదుకాని వినోదం కోసం సెపరేట్ చానల్స్ ఉన్నాయ్ కదా మళ్లీ న్యూస్ చానల్స్ లో కూడా ఇలాంటి మాటేర్స్ ఎందుకు.
టెక్నాలజీ ని యూస్ చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు మన భవిష్యతు తరాలకు ఆ టెక్నాలజీ ని అవిజ్ఞానం గ అందించొద్దు అని నా అబిప్రాయం.
YOUR's......................సతీష్.
superbly told, but this is life boss! oka medhaavi TV kanipettina kaalamlo kooda pakkana chaala mandi kaaligaane unde vaallu.
ReplyDeletetime pass ki tech use cheyochu kaani daanne priority anukokudadu.
Baadha padaku raa rao gaari kooturu engg aypoyi job chestundi kadaa, appudu eppudeppudu taatayya vaalla ureldaama ani eduru choostundi.
Hhahahah Correct ga cheppav ra bt thanu job join ayina taruvata veldaamanukunna kudardu paapam.....
ReplyDeletedeeniki karanam evarantav present generation da leka parents da
ReplyDeletePresent generation lo parents di.
ReplyDelete