Pages

Wednesday, March 31, 2010

అల్లారామ్

 "కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం,రెప్ప పాటు ప్రయాణమే ఈ జీవితం"
అన్నాడొక మహా కవి.మరి ఈ రెప్ప పాటు ప్రయాణం ఎందుకింత నరకం అనుకున్నాడు ఒక పాతబస్తీ అమాయక జీవి.
హైదరాబాద్ లో అల్లర్లు అని పేపర్ లో హెడ్డింగ్ చూసాడు ఒక పొలిటికల్ లీడర్,వెంటనే వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్స్ అందరికి కాల్ చేసి ఇంటికి రప్పించాడు,ఎందుకంటె అల్లర్లను ఆపటానికి మాత్రం కాదు,ఆ అల్లర్లను తమ పార్టీ కి ఉపయోగపడే లా ఎలా మలుచుకోవాలి,సామాన్యులను ఎలా రెచ్చ కొట్టాలి అని ఆలోచించడానికి.
ఇదే హెడ్డింగ్ చుసిన ఒక  సామాన్యుడికి మాత్రం గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయ్,ఎందుకంటె "ఉరుము ఉరిమి ఎక్కడో పడ్డట్టు",ఎప్పుడు మత గర్షణలు వచ్చినా బలి అయ్యేది సామాన్యులే కదా.
మనుషుల్లో హిందూ ముస్లిం అని మనం పెట్టుకుని మన ఈ రెప్ప పాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం.పాపం మూగ జీవులకి కులాలు మతాలూ లేవు కదా,ఎవరో కొంత మంది స్వార్ధపరులు గోశాల మీద పడి మూగ జీవులను తగలపెట్టారు.ఇలాంటి విషయం లో మాత్రం బ్లూ క్రాస్ వారు కాని రెడ్ క్రాస్ వాళ్ళు కాని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు,ఎందుకంటె అవి హిందువులవి అని ముస్లిమ్స్,తగుల పెట్టింది ముస్లిమ్స్ అని హిందువులు కొట్టుకు చస్తుంటే ఆ గొడవల్లోకి వెళ్తే మనమెక్కడ నలిగిపోతామేమో అని ఈ  బ్లూ క్రాస్ వాళ్లకి భయం పాపం.
ఎందుకు మన రాష్ట్రం లో హైదరాబాద్ లోనే మత గర్షణలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడా అన్ని మతాల వాళ్ళు కలిసి లేరా మరెందుకు ఇక్కడ మాత్రమె మత గర్షణలు జరుగుతున్నాయి.ఎందుకంటె దేశం లో ఎక్కడ లేని కుళ్ళు రాజకీయాలకు కేంద్రం మన హైదరాబాద్ కాబట్టే.హిందువుల వోట్లు పడకుండా ముస్లిం MLA గెలుస్తున్నాడా,ముస్లిమ్స్ వోట్లు పడకుండా హిందూ MLA గెలుస్తున్నాడా.ఒక్కసారి ఎందుకు ఈ పిచ్చి ఆవేసపరులు అర్ధం చేసుకోరు,ఎవరో స్వార్ధపరులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం చేసే పనులకు మతం అనే మహమ్మారిని తగిలిస్తుంటే అందులో ఆవేశం తప్ప ఆలోచన లేని పిచ్చి వాళ్ళ చేష్టలకు ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు.అంతెందుకు గోకుల్ చాట్ లో బాంబు పెట్టి వెళ్ళిన వాడికి అక్కడికి హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు అని  తెలియదా,కాని వాడు ఎవరి గురించి ఆలోచించలేదు,అంటే మారణ కాండ కి మతం తో సంబంధం లేదు,ఈ రాజకీయ నాయకులందరూ మన మంచి కోరే వారే అయ్యుంటే వీళ్ళకి ఎటువంటి స్వార్ధపూరిత ఆలోచనలు లేకుంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు నాయకులు A /C రూం లను  వదిలి బయటికి వచ్చి కలిసి కట్టుగా ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ పిచ్చి ఆవేసపరులు కంట్రోల్ అవ్వరా,పైకి అర్మి,పోలీసు అంటూ బలగాలను దించి సామాన్యుడ్ని చితక కొట్టడం,నాయకులు మాత్రం A/C రూం లలో కూర్చుని ఎవరి మతాల వాళ్ళను వారు రెచ్చ కొట్టడం  ఎందుకు.
ప్రపంచం లో ఎక్కడ లేని అటువంటి అన్ని మతాలూ కలిసి కట్టుగా ఉన్న గొప్ప గణతంత్ర దేశం మనది అని గొప్పగా చెప్పుకునే రోజులు ఎప్పుడో పోయాయి,రాష్ట్రం లో ఒక ప్రబుత్వం ఇంకొకళ్ళకి నచ్చలేదంటే ఆ ప్రబుత్వాన్ని కూల్చడానికి కూడా మత గర్షణలు లేపుతారని చరిత్ర సాక్షాల్లో ఉంది.నిన్నటి వరకు ప్రాంతీయ అభిమానం అని  కొట్టుకు చచ్చాము,అది సర్డుమనిగింది కదా అని సామాన్యుడు అనుకునే లోపు మత గర్షణలు స్టార్ట్ అయ్యాయి, ఇవి సర్డుమనిగితే ఇంకోటి.ఇదేనా రెప్పపాటు జీవితం కనీసం సామాన్యుడు ప్రశాంతం గ రెప్ప కూడా ముయాలన్న బయం గ ఉంది.మనం ముస్లిం హిందూ అని ఆలోచించే ముందు మనం మనుషుల్లా ఆలోచించం ఎందుకని,మతాలూ కులాలు అనేవి మనకి మనం కల్పించుకున్నవి,మనం సృష్టించిన వాటిని మనం  శాసించాలి కాని అవి మనల్ని శాసించ కూడదు,ఏ మతం చెప్పిన అవతలి వారికి మంచి చేయమనే చెప్తుంది కాని అన్యాయం చేయమని ఏ మతం లోను లేదు.
మనకీ మన దేశానికి ఆదర్శ వ్యక్తి అబ్దుల్ కలాం గారు,జన్మించింది ఒక ముస్లిం ఫ్యామిలీ లో,ఆయన పుట్టింది రామేశ్వరం లోని శివాలయం వీధి లో,వారి నాన్న గారు జైనులబ్దీన్ ఆ వీధిలో హిందు ముస్లిం అనే తేడా లేకుండా  అభిమానించే వాళ్ళు ఆయన్ను,అదే వీధిలో శివాలయం ప్రధాన అర్చకులు పేరు లక్ష్మణ శాస్త్రి గారు,వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు,వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కూర్చుని(వారి వారి సాంప్రదాయ దుస్తుల్లో)ఇద్దరి మతాలలోని మంచిని పంచుకునే వాళ్ళు.కలాం గారు ముస్లిం వారు అని కాని,మిగిలిన వాళ్ళు హిందువులని కాని  ఎప్పుడు కనీసం మాట కూడా జారిన రోజులు లేవు,కలాం గారికి భారత రత్న అవార్డు వచ్చిందంటే ముస్లిం క హిందూ క అని  ఎవరు ఫీల్ అవ్వలే ఒక భారత మాత ముద్దు బిడ్డ కి వచ్చిందని గర్వపడ్డాము.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప వాళ్లకు దేశానికి ఎంతో మంచి చేసిన వాళ్లకి ఎటువంటి దురుద్దేశం,మతం అనే పిచ్చి లేనప్పుడు ఏమి సాదించని మనం  కనీసం ఇంట్లో వాళ్లకి కూడా ఉపయోగ పడని మనకెందుకు ఇంత మత పిచ్చి.
రాజుల పరిపాలనలో కూడా ఏ ముస్లిం రాజు తన ప్రజలను తన మతం లోకి మారమని,ఏ హిందు రాజు ముస్లింలను హిందువుల గ మారమని గొడవలు లేపలేదు,శాసించ లేదు.మరెందుకు గొప్ప గొప్ప వాళ్ళు రచించిన రాజ్యాంగం,ప్రజా స్వామ్యం లో ఇలా జరుగుతుంది మనం ప్రజా పరిపాలనలో ఉన్నామా,పూటకి ఒక మాట మార్చే పాపాత్ముల పరిపాలనలో ఉన్నామా.....మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ మీద తిరగపడ్డ మన వాళ్ళు ఏ మతం ఏ కులం అని ఆలోచించ లేదు కలిసి కట్టుగా పోరాడారు,వాళ్ళు కష్టపడి మనకు సంపాదించి పెట్టిన దాన్ని తినేటప్పుడు మాత్రం మనం మతం కులం అని కుక్కల్లా కొట్టుకు చస్తున్నాం.

అల్లా ఎదుటి వాడ్ని నరక మన్నాడా....? రాముడు నీ పక్క వాడ్ని పొడవామన్నాడా....? "ఆలోచన ఆయుధం లాంటిది,ఆయుధాన్ని సాన పెట్టాలి,ఆలోచనని ఆచరణలో పెట్టాలి".ఒక్క సారి ఆలోచించండి,మనమేమి అన్యాయం  మీద పోరాడట్లేదు,అన్నాదమ్ముల లా కలిసి మెలిసి ఉండాల్సిన మనం స్వార్ధపరుల మాటలు విని మనల్ని మనం సర్వ నాశనం చేసుకుంటూ మన దేశాన్ని నాశనం చేస్తున్నామేమో అని నా అభిప్రాయం......

Your 's....................................సతీష్

Saturday, March 27, 2010

లోపం ఎవరిలో ఉంది

రాష్ట్రం లో యాక్షన్ సినిమా రిలీస్ అయింది,ఇందులో హీరో లేడు 294 ఆర్టిస్ట్స్ మాత్రమె.యాక్షన్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు నచ్చే వాళ్లకి ఈ సినిమా చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు(ఇది A సెర్ట్టిఫఎడ్ సినిమా).దీనికి ప్రొడ్యూసర్ ఒక్కరు ఇద్దరు కాదు 7 కోట్ల ఆంధ్రప్రదేశ్ అమాయక ప్రజలు మాత్రమె.ఈ సినిమాకి బడ్జెట్ సామాన్యుడి అంచనాలకు అందనంత.ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా ఆడేది హైదరాబాద్ లో ఒక్క దియటర్ లో మాత్రమె.ఇందులో నటించే ప్రతి పాత్ర కి ఒక గనమయన చరిత్ర ఉంటుంది.ఈ
 సినిమాని మనం బుల్లి తెర లో మాత్రమె చూడగలం..ఇంతకీ అంత గొప్ప సినిమా పేరు చెప్పలేదు కదా... అదే “అసెంబ్లీ సమావేశాలు”.
మొట్ట మొదటి సారి నేను హైదరాబాద్ మహానగరం లో అడుగు పెట్టినప్పుడు,బస్స్ లో విండో పక్కన కూర్చొని సిటీ ని చూస్తున్నాను.బస్స్ కోటి దాటింది నాకు విండో లో నుండి ఒక పెద్ద అందమయిన భవనం దాని ముందు గాంది గారి మౌనం కనిపిచ్చాయి.అదే అసెంబ్లీ అని ఎవరో పక్కనున్న వ్యక్తి చెప్తే కనుచూపు మేర దాన్నే తొంగి చూస్తూ ఉన్నాను.ఎంత ప్రశాంతం గ అందం గ  ఉంది(లోపల ఎంత బయంకరం గ ఉంటుందో తెలీదు కదా అప్పటికి),అక్కడికి మన రాష్ట్ర నాయకులందరూ వస్తారు మన భవిష్యత్తు కు బంగారు బాట వేసేందుకు అక్కడే చర్చిస్తారు అనుకున్నాను.కాని తరువాత తెల్సింది మన భవిష్యత్తు లో ఉన్న  బంగారు అవకాశాలను ఎలా దోచుకోవాలి,దోచుకున్న వాటిని కాపాడుకోవడానికి ఎలా గొడవలు పెట్టుకోవాలి అని  ఆలోచించడానికి వస్తారు అని.
మా ఊరి MLA గారు ఊరి నుండి అసెంబ్లీ సమావేశాలని 10 రోజుల ముందు హైదరాబాద్ కి వచ్చారు(మా నియోజక వర్గ ప్రజలు  మన సమస్యల మీద ఏదో చర్చిస్తారు అనే చిన్న ఆశ తో ఉన్నారనుకోండి),PA తో ఈ రోజు షెడ్యూల్ ఏంటి అనగానే PA“సర్ ఈ  రోజు మీరు అసెంబ్లీ కి వెళ్ళాలి”అన్నాడు,వెంటనే  MLA గారు అవసరమంటావా అన్నారు.PA "చాలా రోజులయింది సర్ మీరు వెళ్లి బాగోదు ఒక్కసారి వెళ్ళండి అన్నాడు.సరే వెళ్దాం అని బయల్దేరాడు.తనకి హైదరాబాద్ లో ఒక క్వార్టర్స్,తిరగడానికి 2 r 3 A/C కార్ లు రోజుకి ఎకష్త్ర కర్చులకి డబ్బులు అండ్ సెక్యురిటి ఇన్ని ఇస్తే అసెంబ్లీ కి వెళ్ళడానికి బద్ధకం.ఇక మన MLA గారు  లోపటికి ఎంటర్ అయ్యారు మొదటి గంట టీ లు,మిగిలిన MLAs తో జోక్స్ సరిపోయాయి,సభ లోకి వెళ్లారు వెనక బెంచ్ లో  గోడకి ఆనుకునే ఒక సీట్ లో కూర్చున్నారు(ఒక కునుకు తీయాలి గ మరి).ఈ లోపు మన MLA గారి వంతు వచ్చింది మాట్లాడమని,వెంటనే లేచి “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్నాను,నేను సభ ను బయికాట్ చేస్తున్నాను అని” పనికి రాణి 2 ఫైల్స్ మడిచి పట్టుకుని బయటకు వచ్చేసారు మన MLA గారు.బయట 10 మైకులు 4 కెమరా లు పట్టుకుని ఉన్న  మీడియా దగ్గరకు వెళ్లి మళ్లీ “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్న”(దేన్నీ కండిస్తున్నారో తనకి తెలీదు,అడిగిన మీడియా కి తెలీదు, చూస్తున్న మనకి తెలీదు)అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి A/C కార్ లో తన క్వార్టర్స్ కి వెళ్ళిపోయారు.మనం సిగ్గుతో తలవంచు కోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు 5yrs లో ఒక్క సారి కూడా మైక్ పట్టుకుని మాట్లాడని MLA లు,అసెంబ్లీ కి  వెళ్ళకుండా ఎగ్గొట్టే MLA లు ఉన్నారంటే మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్న మనం ఎలా  ఉన్నామో.
ఏ ఒక్క MLA అన్న తన నియోజక వర్గం గురించి కాని తన నియోజక వర్గ సమస్యలను కాని అసెంబ్లీ లో లేవనేత్తుతున్నాడా …?ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని మీరెందుకు సరిగా పని చేయలేదు అంటే,మీరు అధికారం లో ఉన్నప్పుడు చేసారా అని అడుగుతారు,అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేయరా.ప్రభుత్వం ప్రతిపక్షం మీ ఇద్దరేనా ఉంది,బయట అమాయకులయిన మా లాంటి వాళ్ళు కూడా ఉన్నాం.మా గురించి ఆలోచించ ర..?అస్సలు అసెంబ్లీ సమావేశాలు అయిపొఇన తరువాత రిసల్ట్ ఏంటి ఏమి సాదిన్చారో మన నాయకులకే తెలియాలి వాళ్ళని ఫాల్లో అవుతున్న మీడియా కే తెలియాలి కాని ఏ సామాన్యుడికి ఇప్పటి వరకు తెలీదు.
ఇలాంటి వాళ్ళ కోసమా సమావేశాలని లక్షల్లో ప్రజా ధనాన్ని కర్చు పెట్టడం అవసరమా,రాష్ట్రం లో ఎన్ని జిల్లాలలో కనీసం తినడానికి తిండి దొరక్క ఆకలి చావులు జరుగుతున్నాయి,ఏ దిక్కు లేని దీవులలో నో ఇలా జరుగుతుంది.ప్రభుత్వం నాయకులు ఉండి కూడా ఇంకా ఆకలి చావులు ఉన్నాయంటే అది సిగ్గు చేటు కాదా.లక్షల కోట్ల బడ్జెట్ లు ఎందుకు వేస్తున్నారు మీరు మీరు పంచుకోవడానిక ఆ డబ్బంతా ఎటు పోతుంది మళ్లీ దానిమీద చర్చలు ఏమి సాదిన్చారని.విదేశాల లో వాళ్ళ బడ్జెట్ లో మినిముం 9% ఆరోగ్యానికి స్పెండ్ చేస్తే మనం కనీసం 0.9% కూడా కేటాయిన్చాట్లేదు.CM పోస్ట్ అంటే ప్రజలకు సేవ చేసే ఒక అధికారం,మన నాయకులు పాపం ఎంతో సేవ  చేయటానికన్నట్లు ఆ సీట్ కోసం కొట్టుకు చస్తున్నారు,మన మినిస్టర్ ల లో ఒక్క రోజు CM అయిన చాలు అని గుంట దగ్గరి నక్క ల లా కాచుకునే వాళ్ళు ఎంతమంది లేరు,అదంతా ప్రజలికి సేవ చెయడానిక,కాదు ఒక్క రోజు CM పోస్ట్ లో  సంపాదించే డబ్బు ఒక తరానికి సరిపోతుంది అని వాళ్ళ ఆశ.
మరెందుకు మనం తెల్సి కూడా ఇలాంటి వాళ్ళను అలాంటి పవిత్రమయిన ప్లేస్ కి వెళ్ళేలా మనం అవకాశం ఇస్తున్నాం.నా ఉద్దేస ప్రకారం “మోసం చేసే వాడికన్నా మోసపోయే వాడిదే తప్పు”.ప్రతీ సారి మనం మన నాయకుల పనితీరు చూస్తూనే ఉంటాం,తిరిగి మళ్లీ వాళ్ళనే ఎన్నుకుంటాం.మన లో చాలా మంది అనుకుంటారు పోలిటిక్స్ మనకెందుకు ఎవడికో ఒకడికి ఓటు వేస్తె అయిపోద్దిలే అని ఆలోచిస్తాం.మనం మన కెరీర్ కోసం ఏ కోర్సు అయితే మంచిదో అని వంద సార్లు అలోచించి ఎనుకున్టామో,అంతకన్నా ముక్యంయింది మనం మన నాయకుడ్ని ఎన్నుకోవడం.ఈ విషయం మనకు అర్ధమయిన రోజు అసెంబ్లీ లో మైక్స్ విరగడం కాని మనం బూతులు వినడం కాని జరగదు.సజీవం గ ఉన్న మనమే ఏమి చేయలేనప్పుడు అసెంబ్లీ ముందు మౌనం గ కూర్చున్న గాంధీ గారు మాత్రం ఏమి చేయగలరు.
వేరే రాష్ట్రాల నాయకులు వాళ్ళ అసెంబ్లీ లో చెప్పులు,మైక్స్ లతో కొట్టుకుంటున్నారు,ఇంకా మన నాయకులు బూతుల తోనే సరిపెడుతున్నారు అని సంతోశిద్దామా లేక మన భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారని బాధపడదామా…?



”నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని….అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని…మారదు లోకం….(సిరివెన్నెల…గాయం)”

ఒక్కసారి ఆలోచిద్దాం లోపం ఎవరిలో ఉందొ............ 



మీ.................................సతీష్

Saturday, March 20, 2010

సరిదిద్దుకోలేని రోజు


ఆ రోజు సండే అందరికి హాలిడే,తొలి ఏకాదశి అందరం తెల్లవారుజామునే లేచి తల స్నానాలు చేసి గుడికి వేల్లోచ్చాము, అందరం బాచలర్స్ మా రూం కింద Bhagat వాళ్ళ ఫ్యామిలీ ఉండేది(రూం లో ఎవరి మద్య అయిన గొడవ జరిగి ఉండొచ్చేమో కాని,భగత్ తో గొడవ పడ్డవాళ్ళు ఒక్కరు కూడా లేరు)అందరం ఒకే ఫ్యామిలీ లా చాలా హ్యాపీ గ ఉండే వాళ్ళం. సండే  అందరు రూం లోనే ఉన్నారు,ఫస్ట్ టైం రూం లో టైం పాస్ కి కార్డ్స్ స్టార్ట్ చేసాం,అంతలో కిరణ్ అన్న సెల్ కి కాల్ వచ్చింది,కిరణ్ అన్న టెన్షన్ తో ఏమి మాట్లాడాలో అర్ధం కాక నాకు ఫోన్ ఇచ్చాడు,అవతలి వ్యక్తీ హిందీ లో BHAGAT అంటే మీ వాడేనా అన్నాడు(Bhagat ఆ రోజు మార్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు కి వెళ్ళాడు,కిరణ్ అన్నవాళ్ళ తమ్ముడు Age23(Msc completed)).అవను మా వాడే అన్నాను,"మీ వాడికి యాక్సిడెంట్ అయింది త్వరగా రండి అన్నాడు"అవతలి వ్యక్తీ,
వెంటనే ఆ షాక్ లో నుండి కొంచెం తేరుకొని మా వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడిగాను కొంచెం డౌట్ గ,లేదు మీ వాడు మాట్లాడలేడు మీరు అర్జెంటు గ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ కి రండి అన్నాడు(Bhagat రోజు ట్రైన్ లోనే క్లాస్ కి  వెళ్ళేవాడు).మాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ట్రైన్ ఆక్సిడెంట్ ఏమో అనుకున్నాం.వెంటనే Bhagat నెంబర్ కి  కాల్ చేసాను “అన్న నేను మాట్లాడలేక పోతున్న త్వరగా రండి”అని ఫోన్ పెట్టేసాడు Bhagat,మాట్లాడగానే  కొంచెం ధైర్యం వచ్చింది.వెంటనే ఏమి ఆలోచించకుండా నేను కిరణ్ అన్న ఒక బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాం.కొద్ది దూరం వెళ్ళగానే మళ్లీ ఫోన్  వచ్చింది ఈ సారి 108 నుండి "మీ వాడ్ని హాస్పిటల్(మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి తిసుకేల్తున్నాము మీరు అక్కడికి వచ్చేయండి"అని,మేమిద్దరం కొంచెం ఉపిరి పిల్చుకున్నాము హాస్పిటల్ కి వెళ్తున్నారంటే.చందానగర్ నుండి సికింద్రాబాద్  వెళ్ళే లోపు మా ఇద్దరి మద్య ఏవేవో ఆలోచనలు హైదరాబాద్ లో జరిగే ఆక్సిడెంట్ ల గురించి,లోపల ఏదో చిన్న బయముంది కాని మా వాడికి ఏమి కాదు అని ఇద్దరం అనుకుంటూ వెళ్తున్నాం,ఈ లోపు మేము హాస్పిటల్ (మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి చేరుకున్నాం అక్కడ వందల మంది జననాలు హడావుడి గ ఉంది మేము మా వాడికోసం వెతుకుతున్నాం,ఈ లోపు పక్కన ఒక మూలకి విరిగిపోఇన ఒక బల్ల మీద మా వాడ్ని పడుకోపెట్టారు(పడుకో  పెట్టారు అనడం కన్నా పడేసారు అనాలి).
వెంటనే నేను వెళ్లి స్ట్రెచర్ కోసం వెదికితే ఒక్కటి కూడా లేదు,అక్కడ వార్డ్ బాయ్ ని అడిగితె ఆ పక్క మార్చురీ దగ్గర ఉంటాయేమో తెచ్చుకో అని రెక్లస్ గ(అసలు ఆ డ్యూటీ వాడిది)చెప్పాడు వెంటనే ఒక స్ట్రెచర్ తీసుకొచ్చి దానిమీద పడుకోపెట్టి అంతా చూసాం ఒక్క దెబ్బ కూడా లేదు బ్లడ్ మార్క్ కూడా లేదు,హమ్మయ అని ఉపిరి పిల్చుకున్నం(అదే మమ్మల్ని ఏమి కాదులే అనే నిర్లక్ష్యం లోకి నెట్టింది),డాక్టర్ ౩౦నిముషముల తరువాత చూసి X-ray తీపిచ్చండి అన్నారు,X-Ray రూం కి వెళ్తే ఎంతో కొంత చేతిలో పెడితే కాని X-ray తియమన్నారు,వాడికి డబ్బులిచ్చి X-ray రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తే డాక్టర్ లేరు అక్కడున్న మెడికో స్టూడెంట్ X-ray ని పయికి కిందకు చూస్తుంది(మిగత స్టూడెంట్స్ మా వాడి మీద మెడికల్ ప్రాక్టిస్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్ గురించి ఆలోచించకుండా),వెంటనే ఇంకో డాక్టర్ వచ్చి మీరు X-Ray రివర్స్ పెట్టి చూస్తున్నారు అని తను చూసి రిబ్స్ 2 r 3 బ్రేక్ అయ్యాయి ప్రాబ్లెం ఏమి లేదు(వాళ్లకి ఉన్న ప్రాబ్లెం ని లేదు అని  చెప్పడానికి 2 గంటలు పట్టింది)అడ్మిట్ చేయండి 1 r2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు,మేము హమ్మయ ఓకే ఏదన్నా ఆర్దోపెదిక్ దగ్గరకు తిసుకేల్దాం రేపు ఈ రోజు సండే కదా అనుకున్నాం,ఈ లోపు మా వాడు నొప్పి తట్టుకోలేక పోతున్న అని  బాధ పడుతున్నాడు,మళ్లీ డాక్టర్ ఒకసారి స్టమక్ స్కాన్ చేపిచ్చండి అన్నారు వెంటనే స్కాన్ చేపిచ్చాం ఆ రిపోర్ట్ లో కొద్దిగా స్టమక్ లో  బ్లీడింగ్ అవుతుంది అన్నారు వెంటనే ప్రయివేట్ హాస్పిటల్ కి కాల్ చేసి అక్కడికి తీసుకు వెళ్దామని బయల్దేరాము(ఈ హాస్పిటల్ (మహాత్ముడి పేరు పెట్టుకున్న)నిర్లక్ష్యం అప్పటికి అర్ధమయింది మాకు),అక్కడికి 15నిముశాలలొ చేరుకున్నాం,అక్కడికి  వెళ్ళగానే మహాత్ముడి పేరుపెట్టుకున్న హాస్పిటల్ లో మా వాడ్ని కనీసం 5mins పట్టుకుని టెస్ట్ చేసిన డాక్టర్ లేడు,కాని ఇక్కడ 5mins కూడా మా వాడ్ని వదిలేసి లేరు డాక్టర్స్,15mins లో అన్ని టెస్ట్లు చేసారు…చాలా కర్చు అవుతుందని చెప్పారు మా జేబులో అప్పుడు మని లెకపొఇన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్.ఎంత కర్చు అయిన పర్లేదని చెప్పాం,30 మినిట్స్ అయింది.తనకి ఏవేవో ట్యుబ్స్ పెట్టారు ఏవేవో చేస్తున్నారు మాకేమి అర్ధం కాక అలానే నిలబడి చూస్తున్నాం,ఈ లోపు వాళ్ళ అమ్మ నాన్న,మా రూం వాళ్ళు హాస్పిటల్ కి వచ్చారు,డాక్టర్ వచ్చి నన్ను రూం లోకి తీసుకెళ్ళి ఒక ఫాం ఇచ్చి దాని మీద  సైన్ చేయమని చెప్పారు దేనికి అని అడిగాను అప్పుడు టైం 6:30pm,తను చనిపోయాడు 6:20pm కి అని చెప్పారు,నాకు  కొద్దిసేపు ఏమి అర్ధం కాలేదు,కళ్ళన్నీ నీళ్ళతో నిండిపోయాయి రూం బయట వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు,మమ్మల్ని సొంత వాళ్లలా చూసుకునే వాళ్ళు.బయటికి వెళ్లి వాళ్లకు ఏమి చెప్పాలో మాకు అర్ధం కాలేదు.అలానే బాధపడుతూ ఆ పేపర్ మీద సైన్ చేసాను.
ఒక్కసారి వాళ్ళ బాద ని ఉహించె ధైర్యం కూడా మాలో ఎవరికి లేదు,పెద్దమ్మ మా దగ్గరికి ఒచ్చి ఇంతమంది ఉండి కూడా వాడ్ని  కాపడుకోలేకపోయామురా అంటే మాకు ఏమి చెప్పాలో కూడా అర్ధం కాలేదు,అప్పుడు అర్ధం అయింది మాకు మా చదువులు కాని  మా దగ్గరున్న క్రెడిట్ కార్డ్స్ కాని తనని కాపాడడానికి ఉపయోగపడలేక పోయాయే అని.
ఒక్కరోజులోనే చేతికందిన ఎంతో తెలివి,భవిష్యతు ఉన్న కొడుకుని పోగుట్టుకున్న ఆ ఫ్యామిలీ కి ఏమి చెప్పి ఒదార్చగలం.తను చనిపొఇన్ది ఎలానో తెల్సా ఒక ఆటో వాడు,ఒక బస్సు వాడు చేసిన చిన్న తప్పుకి ఆ రెండిటి మద్య తన భవిష్యతు నలిగిపొఇన్ది.రోజుకి ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ లో మినిముం ముగ్గురు చనిపోతున్నారు,అంటే రోజుకి  మూడు ఫామిలీస్ బలి అవుతున్నాయి,ఎంత దారుణం కదా మనం 5 నిముషాలు ముందు వెళ్ళాలి అనే కంగారులో మన జీవితాన్నో లేక ఎదుటి వాళ్ళ జీవితాన్నో నాశనం చేస్తున్నాం,ఒక్కసారి ఆలోచించండి,కాస్త ఆలోచించి నడుచుకుంటే ఎన్నో ఆక్సిడెంట్ ల ని కంట్రోల్ చేయొచ్చు,ఎన్నో జీవితాలను కాపాడొచ్చు,ఈ సారి ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నపుడు అలోచించి డ్రైవ్ చేస్తారని మన మీద వేరే వాళ్ళు ఆదారపడి ఉన్నారని ఆలోచించండి.
ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్(మహాత్ముడి పేరు పెట్టుకున్న)కి వెళ్తే చావు ద్వారాలకు దగ్గరిగా వేల్తున్నట్లే అని ప్రజల్లో ఒక గట్టి నమ్మకం,ఇది నిజమే అని నా అనుభవం తో చెప్తున్నాను.కాని ప్రతి సామాన్యుడు ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్ళే స్థోమత ఉండదు కదా,నేను ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్ ని మా వాడ్ని చూడండి అని అడిగితె రోజుకి వందల కేసులు వస్తాయి మాకు అన్నారు(మరి మీకు జీతాలు ఇస్తుంది ఆ కేసులను చూడటానికే కదా),మీ పేపర్ మీద అవి కేసు ల లానే కనిపిచ్చొచ్చు కాని అది ఒక జీవితం,మీరు లేట్ చేసే ప్రతి నిముషం ఒకరు ప్రాణాన్ని కోల్పోతున్నారు,దాన్ని మళ్లీ మీరు తిరిగి తీసుకు రాగలర,మీరు మీ నిర్లక్ష్యం తో అధికారికం గ ఒక  మర్డర్ చేస్తున్నారు,చనిపొఇన వ్యక్తీ బాడీ ని బయటికి తెచ్చుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇవ్వాలి,వాళ్ళ బందువులు ఏడుస్తూ ఉంటె మీకు వెళ్లి డబ్బులు అడిగే మనసు ఎలా వస్తుంది.....?అటువంటి డబ్బు తో ఏమి చేద్దామని,పేషంట్ కి  ట్రీట్మెంట్,సర్వీసు చేసి తనకి క్యూర్ అయిన తరువాత వాళ్ళు ఆనందం గ ఇచ్చే వాటిని తీసుకోండి,ఒక జీవితాన్ని కాపాడండి.మహాత్ముడు ఎంతోమందికి సేవ చేసాడు కనీసం మీరు ఆ పేరు పెట్టుకున్న హాస్పిటల్ లో వర్క్   చేస్తున్నారు. సాలరీ తిసుకున్తున్నందుకు సేవ కాకపోఇన కనీసం మీ డ్యూటీ మీరు సవ్యం గ చేయండి ప్లీస్.
Bhagat చనిపోవడానికి ఎవరి తప్పూ అని తెల్సుకోవడం వల్ల ఏ ఉపయోగం లెకపొఇన….ఈ వ్యవస్థ లో ఉన్న లోపాల వలన మేము ఒక తమ్ముడి లాంటి మంచి స్నేహితుడిని,వాళ్ళ ఫ్యామిలీ ఎంతో భవిష్యతు ఉన్న ఒక కొడుకుని  కోల్పోయి ఇప్పటికి బాదపడుతునే ఉంది.(DOB -8th May 1985...DOD -13th July 2008 )  


ఎప్పటికి Bhagat మా మనస్సులో తీపి గుర్తు గ మిగిలే ఉంటాడని…………..సతీష్.

Saturday, March 13, 2010

(అ)విజ్ఞానం

                                                                                   

 Raoగారి ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు,వాళ్లకి ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది,అబ్బాయి 10th క్లాసు చదువుతున్నారు.Rao గారి నేటివ్ ప్లేస్ రాజముండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు.సమ్మర్ స్టార్ట్ అయింది పిల్లలికి సమ్మర్ హాలిడేస్ వచ్చాయ్.ఒకరోజు పొద్దున్నే 8am కి(హైదరాబాద్ లో ఇది చాలా ఎఅర్లీ మార్నింగ్ లే) Rao గారి ఇంట్లో సెల్ మోగింది ఆ ఇంట్లో మొత్తం 6 r 7 సెల్ల్స్ ఉన్నాయ్(పనిమనిషి సెల్ కాకుండా) ఎవరి ఫోన్ మొగిందో అర్దమఎలోపు ఫోన్ రింగ్ ఆగిపోఇంది.చూస్తే Rao గారి పర్సనల్ సెల్(ఆఫీసు కాంటాక్ట్స్ కోసం ఇంకో సెల్ ఉందిలే) లో మిస్సేడ్ కాల్ ఉంది అది వాళ్ళ నాన్న గారి దగ్గరనుండి,సరే మళ్లీ Rao గారు కాల్ చేసారు అవతల వాళ్ళ నాన్న గారు ఊరినుండి."బాబు ఎలా ఉన్నావురా(ప్రేమతో)", "ఆ బాగున్నాం నాన్న(హడావుడి గా)"."బాబు ఈ వేసవి సెలవులకు పిల్లల్ని తీసుకుని రా  ఒకసారి ఉరికి"అని చెప్పి పెట్టాసారు.Rao గారు వాళ్ళ పిల్లలితో ఈ సమ్మర్ హాలిడేస్ కి మనం తాత గారి ఉరికి వెళ్తున్నాము అనగానే,వాళ్ళ అమ్మాయి "నో డాడ్"అంది,వెంటనే యందుకు అంటే అక్కడ "M TV రాదు, పవర్ కట్ ఉంటుంది and ఇంటర్నెట్ అస్సలే ఉండదు బోర్ డాడ్ నేను రాను"అంది.
   ఒక్కసారి ఆలోచించండి TV లేకుండా,ఇంటర్నెట్ లేకుండాఎంతమంది బ్రతకట్లేదు.ఒక మేధావి ఎన్నో సంవత్సరాలు కష్టపడి విజ్ఞానం కోసం TV ని కనిపెడితే ఇప్పుడు దానిముందు కొన్ని లక్షల మంది కాలీ గ కూర్చుని అవిజ్ఞానం సంపాదిస్తున్నారు,ముందే ఆ మేధావి ఇలా జరుగుతుందని ఉహించి ఉంటె పాపం TV అనే దాన్నికనిపెట్టేవాడు కాదేమో.యంతో మంది మేధావులు భవిష్యతు తరాలకు విజ్ఞానాన్ని అందించడానికి యంతో శ్రమించి మనకి ఈ  టెక్నాలజీ ని అందిస్తే మనం ఆ టెక్నాలజీ ని మంచికి ఉపయోగించుకోవాల్సింది పోయి దాన్నిమనం దుర్వినియోగం చేస్తున్నాము.అణువు పరమాణువు ల మీద మన వాళ్ళు రీసెర్చ్ చేసింది అణు బాంబు తయారు చేసుకుని మనల్ని మనం చంపుకోవడానికా..?గూగుల్ సెర్చ్ తెలియని స్టూడెంట్ ఈ గూగుల్ యర్త్ మీదనే ఉండడేమో కదా.అలాంటి గూగుల్ సెర్చ్ ని కనిపెట్టిన వాళ్ళు చాలా మేధావులు,అందులో మనకు ఎన్నో తెలియని,తెలుసుకోవాల్సిన విషయాలను పొందుపరిచారు,2yrs బ్యాక్ రీసెర్చ్ లో తెల్సిన ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ ని ఎక్కువ యూస్ చేస్తుంది 16 to 20yrs ఏజ్ లోపు వాళ్ళంతా(వాళ్ళు ఏ (అ)విజ్ఞానం కోసం) యూస్ చేస్తున్నారో అందరికి తెల్సు.
                                       ఇది వాళ్ళ తప్పా అంటే కాదు,మనందరి తప్పు అంతెందుకు మా పక్కింటి వాళ్ళ బాబు వాడు 7th క్లాస్,ప్రతి క్రికెటర్ పేరు టక్కున చెప్తాడు,ప్రతి బాలీవుడ్ హీరో హీరోయిన్ పేరు వాళ్ళ అఫ్ఫైర్స్ చెప్తాడు అది చూసి మా వాడికి  యంత తెలివో అని మురిసిపొతాము.కాలేజ్ లో ఒక స్టూడెంట్ కి లేటెస్ట్ అఫ్ఫైర్స్,లేటెస్ట్ ఇంగ్లీష్ ఆల్బుమ్స్ పేర్లు తెలీదంటే వాడికి ఏమి చేతకాదు అన్నట్లు చూస్తారు.ఎంతమంది స్టూడెంట్స్ కి ఒక గాంధి,ఒక భగత్ సింగ్(వాళ్ళ విగ్రహాలు రోడ్ మీద ఉంటాయి కాబట్టి)తప్ప మన దేశ నాయకులు తెల్సో అడగండి.అంతెందుకు మొన్న ఎలక్షన్స్ ముందు సికింద్రాబాద్ సర్వే లో జయసుధ గారి ఫోటో చూపించి ఎవరు ఈమె అంటే 60% పీపుల్ కి తెలీదు అన్నారట కాని ఆమె అక్కడ MLA గ గెలిచారు అంటే  మనం మన దగ్గర పోటి చేసే అబ్యర్ది ఎవరో కూడా తెల్సుకోకుండా వోట్ వేస్తున్నామనమాట.మనకి మన పిల్లలికి దేశ నాయకుల గురించి కాని మన రాజకీయ నాయకుల పరిస్తితి కాని తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాము.చాలా మంది స్టూడెంట్స్(డిగ్రీ స్టేజి లో ఉన్న)కి వాళ్ళ వాళ్ళ నియోజక వర్గ MLA ఎవరో అడగండి ఎంతమందికి తెలుసో....?
                 మనల్ని విజ్ఞానవంతుల్ని చేయడానికి మీడియా అనేది ఉంది.ఒకప్పుడు స్వాతంత్ర సమరం లో కూడా మీడియా నే ప్రజలందర్నీఉత్తేజపర్చింది,అటువంటి మీడియా ఇప్పుడెల ఉందంటే.మొన్న ఒక ఆర్టికల్ చూసాను ఎక్కడో చెన్నై లో ఒక  స్వామి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు అని చాలా బాగుంది.
ప్రజల్ని మేల్కోలిపేలా ఉంది,కాని దానికిన్దనే ఆ స్వామి  వ్యభిచార video ని ఈ site లో చూడండి అని ఒక site ని పెట్టారు.ఎంత దారుణం ఇది నాకు ఆస్వామికన్నా వీళ్ళే
వ్యభిచారులు ల కనిపిచ్చారు,ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లల తో కలిసి కనీసం న్యూస్ చూడాలన్న భయం గ ఉంది.మన TV వాళ్లకి ఒక పాపులర్ హీరో,హీరోయిన్ ప్రొద్దున లేచి నైట్ పడుకునే దాక ఏమి చేస్తారు,ఇలాంటి వాటి మీద ఉన్న ఇంటరెస్ట్ ప్రజల్ని విజ్ఞానవంతుల్ని చేయడంలో లేదు,నేను వినోదం వద్దు అనట్లేదుకాని వినోదం కోసం సెపరేట్ చానల్స్ ఉన్నాయ్ కదా మళ్లీ న్యూస్  చానల్స్ లో కూడా ఇలాంటి మాటేర్స్ ఎందుకు.
                           టెక్నాలజీ ని యూస్ చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు మన భవిష్యతు తరాలకు ఆ టెక్నాలజీ ని  అవిజ్ఞానం గ అందించొద్దు అని నా అబిప్రాయం.






YOUR's......................సతీష్.

Thursday, March 4, 2010

అభిమాని


"Nothing bad can happen to us if we're on a plane in India with Sachin Tendulkar on it."
- Hashim Amla, the South African batsman, reassures himself as he boards a flight.

"Sometimes you get so engrossed in watching batsmen like Rahul Dravid and Sachin Tendulkar that you lose focus on your job."
- Yaseer Hameed in pakistani newspaper.

"To Sachin, the man we all want to be"
- Andrew Symonds wrote on an aussie t-shirt he autographed specially for Sachin.

“Beneath the helmet, under that unruly curly hair, inside the cranium, there is something we don't know, something beyond scientific measure. Something that allows him to soar, to roam a territory of sport that, forget us, even those who are gifted enough to play alongside him cannot even fathom. When he goes out to bat, people switch on their TV sets and switch off their lives."
- BBC on Sachin

"Tuzhe pata hai tune kiska catch chhoda hai?"
- Wasim Akram to Abdul Razzaq when the latter dropped Sachin's catch in 2003 WC.

Sachin is a genius. I'm a mere mortal.
- Brian Charles Lara

"We did not lose to a team called India...we lost to a man called Sachin."
- Mark Taylor, during the test match in Chennai (1997)

"The more I see of him the more confused I'm getting to which is his best knock."
- M. L. Jaisimha

"The joy he brings to the millions of his countrymen, the grace with which he handles all the adulation and the expectations and his innate humility - all make for a one-in-a-billion individual,"
- Glen McGrath

"I can be hundred per cent sure that Sachin will not play for a minute longer when he is not enjoying himself. He is still so eager to go out there and play. He will play as long as he feels he can play,"
- Anjali Tendulkar

"Even my father's name is Sachin Tendulkar."
- Tendulkar's daughter, Sara, tells her class her father's name after the teacher informs them of a restaurant of the same name in Mumbai.

Question: Who do you think as most important celebrity ?
Shah Rukh Khan: There was a big party where stars from bollywood and cricket were invited. Suddenly, there was a big noise, all wanted to see approaching Amitabh Bachhan. Then Sachin entered the hall and Amitabh was leading the queue to get a grab of the GENIUS!!
- Shah Rukh Khan in an interview.

“India me aap PrimeMinister ko ek Baar Katghare me khada kar sakte hain..Par Sachin Tendulkar par Ungli nahi utha Sakte.. “
- Navjot Singh Sidhu on TV

He can play that leg glance with a walking stick also.
- Waqar Younis

'I Will See God When I Die But Till Then I Will See Sachin'
- A banner in Sharjah

Sachin Tendulkar has often reminded me of a veteran army colonel who has many medals on his chest to show how he has conquered bowlers all over the world. I was bowling to Sachin and he hit me for two fours in a row. One from point and the other in between point and gully. That was the last two balls of the over and the over after that we (SA) took a wicket and during the group meeting i told Jonty (Rhodes) to be alert and i know a way to pin Sachin. And i delivered the first ball of my next over and it was a fuller length delevery outside offstump. And i shouted catch. To my astonishment the ball was hit to the cover boundary. Such was the brilliance of Sachin. His reflex time is the best i have ever seen. Its like 1/20th of a sec. To get his wicket better not prepare. Atleast u wont regret if he hits you for boundaries.
- Allan Donald

On a train from Shimla to Delhi, there was a halt in one of the stations. The train stopped by for few minutes as usual. Sachin was nearing century, batting on 98. The passengers, railway officials, everyone on the train waited for Sachin to complete the century. This Genius can stop time in India!!
- Peter Rebouck - Aussie journalist

"Sachin cannot cheat. He is to cricket what (Mahatma) Gandhiji was to politics. It's clear discrimination. "
- NKP Salve, former Union Minister when Sachin was accused of ball tempering

There are 2 kind of batsmen in the world. One Sachin Tendulkar. Two all the others.
- Andy Flower

"I have seen god, he bats at no.4 for India"
- Mathew Hayden

"Commit all your sins when Sachin is batting. They will go unnoticed coz even the GOD is watching"
- A hoarding in England


సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెల్పుతూ .................
Your's.......సతీష్