Pages

Saturday, November 20, 2010

భవిష్యత్తుకి భయం

భయం....


స్టూడెంట్ కి భయం..........ఎగ్జాం పోస్ట్ పోన్ అయిద్దేమో అని.


షాప్ వాడికి భయం..............బందు ఎక్కడ చేస్తారేమో అని.


వరుణ్ మోటర్స్ కి భయం......బందు లో కార్లు పగలకొడతారని.


RTC కి భయం................బస్సులు తగల పడతాయో అని.


అమాయకుడికి భయం......ఎక్కడ తగలపెడతారేమో అని.


గొడవలో ముందున్న వాడికి భయం................లాటి తో తల ఎప్పుడు పగిలిద్దో అని.


పోలీసు కి భయం.................రాయి ఎక్కడ తగిలిద్దో అని.


జనాలకు భయం..........ట్రాఫిక్ జామ్ అయితదేమో అని.


ప్రభుత్వానికి కి భయం...............ఏ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలో అని.


దేవుడికి భయం................ఇది రాక్షస యుద్ధమని.


మీడియా కి భయం.................గొడవ చల్లారి పోద్దేమో అని.


                                     గొడవ ఇదేదో తెలుగు సినిమా పేరు లా ఉంది కదా............ ఆ సినిమా  ఫ్లాప్ అయినా మన రాజకీయ నాయకులు ఆడించే ఈ సినిమా మాత్రం మన  రాష్ట్రం లో సూపర్ డుపెర్  హిట్ అవుతుంది మీడియా వారి సహకారం తో. రాత్రి TV ముందు కూర్చుంటే న్యూస్ ఛానల్ లో స్టూడెంట్స్ రోడ్ల మీదకు వచ్చి ఆస్తులు ద్వంసం చేస్తూ గొడవలు చేస్తున్నారు అని వస్తుంది. మా పెద్దమ్మ అప్పుడు నాతొ ఏంట్రా వాళ్ళు స్టూడెంట్స్ యేనా ఎప్పుడూ చూసిన ఈ మద్య రోడ్ల మీద గొడవలు చేస్తూ కనిపిస్తున్నారు, మరి ఎప్పుడు చదువుకుంటారు అని అడిగింది. నిజమే కదా ఈ ప్రశ్నకు జవాబు ఏమి చెప్పాలో అర్ధం కాక ఛానల్ మార్చేసాను.

ఓ... అమాయక విద్యార్ది నువ్వెందుకు రోడ్ ఎక్కుతున్నావో నాకు అర్ధం కావట్లేదు, ఎలెక్షన్ లో వోట్ అనే ఆయుధాన్ని నువ్ తప్పుగా ఉపయోగించినప్పుడే ని భవిష్యత్తును రోడ్ కి ఈడ్చేలా చేసుకున్నావ్, అది చాలదు అన్నట్లు నీ చదువును కూడా వదిలేసి నీ బ్రతుకుని నువ్వే నడి రోడ్ లో బలి చేసుకుంటున్నావ్. ఎందుకు నువ్వు చద్దామనా లేక నీకు లాంటి ఇంకో అమాయక పిచ్చోడ్ని చంపుదామనా.....? . గీత లో  శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు "చంపేది ఎవరు... చచ్చేది ఎవరు" నువ్వే కదా. ఒకసారి నువ్వు  ని వోట్ తో ఒక నాయకుడ్ని ఎన్నుకున్నావంటే వాడే నీ తరుపున నీ సమస్యల మీద పోరాడాలి కాని వాడ్ని A/C రూముల్లో పెట్టి నువ్వెందుకురా వాడికోసం రోడ్ ఎక్కుతావు....? నిన్న తెలంగాణా వాళ్ళు ఈ రోజు సీమఆంద్ర వాళ్ళు ఎవరయితే ఏంటి వీళ్ళందరూ మన దేశ భవిఒస్యత్తు ని తీర్చి దిద్దాల్సిన వాళ్ళే కదా . ఏ నాయకుడయినా వీళ్ళకోసం పోరాడుతున్నాడా.. ఏ నాయకుడయిన పోలీసు లాటిలను ఎదుర్కుని నీకోసం పోరాడుతున్నడా... ? మరెందుకు అలాంటి చేత గాని వాళ్ళ కోసం నువ్ గుడ్డలు చిమ్పుకున్టావ్....? వాడు ఎలెక్షన్ లో నిలబడ్డప్పుడు ఏమయింది నీ పిచ్చి ఆవేశం. మన దేశ సంపదను లక్ష ల  వేల కొట్లలో దోచుకున్తున్నప్పుడు  ఏమయింది నీ కోపం. అప్పుడు రాలేదా నీకు ఆవేశం....లేక అవన్నీ మనకు సంబందించినవి కావు అనుకుని వదిలేసావా లేక మనకి ఒరిగేదేన్టిలె అనుకున్నావా......? ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీకెందుకింత ఆత్రమో. నాయకుల వలలో పడి నీ భవిష్యత్తును తీరని కలగా మార్చుకోకు.

అని ఆసిస్తూ...............................................................




యువర్'స ........................................................................................సతీష్.
                                                                    

Tuesday, October 19, 2010

మార్పు కష్టమా...

                                                                 
లాస్ట్ వీక్ సాక్షి టీవీ లో ఒక మంచి కార్యక్రమం చూసాను చాలా రోజుల తరువాత. ఆ ప్రోగ్రాం పేరు "ఆమ్యామ్యా", టైటిల్ కామిడి గా ఉన్న ప్రోగ్రాం మాత్రం చాలా బాగుంది. కరప్షన్ మీద జయప్రకాశ్ నారాయణ గారు అండ్ మాజీ DGP పెర్వళం రాములు గారు చాలా బాగా మాట్లాడారు. ఒక ఐఏఎస్ కేడర్ వ్యక్తి జయప్రకాశ్ నారాయణ గారు "మన టెలికాం మినిస్టర్' రాజ' ని అతి పెద్ద లంచగొండి గా ఒక లైవ్ ప్రోగ్రాం లో చెప్పారు", అది ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలా లేక అంత ధైర్యం గా చెప్పినా కూడా ఆ మినిస్టర్ ని ఏమి చేయలేని మన అసమర్ద ప్రభుత్వాల ను చూసి బాధ పడాలో నాకు అర్ధం కాలేదు.


"మామ చిరంజీవి మూవీ టాగూర్ రిలీస్ అయింది రా ఈ సారి రికార్డ్స్ అన్ని తిరగ రాస్తుంది,శివాజీ లో రజని ఇరగ తీసాడట" ఇది మన ప్రేక్షకుల విశ్లేషణ.ఎవరండి చెప్పింది సినిమాలు చూసి పబ్లిక్ చెడిపోతున్నారు అని.సినిమాలు చూసి పాడయి పోయిన అదే పబ్లిక్ మంచి సినిమాలు చూసి బాగు పడాలి కదా ఎవరన్న బాగు పడ్డారా......?టాగూర్ సినిమా లో హీరో రికార్డ్స్ బద్దలు కొట్టాడు,శివాజీ లో హీరొయిన్ చాలా బాగుంది ఇదే మనం చూడాలి కాని ఆ మూవీ లో డైరెక్టర్ "మనం ఎంత కరప్షన్ లో కురుకుపోయాం"అని చూపిస్తున్నాడో ఎవడికి కావాలండి.మనం పుట్టిన హాస్పిటల్ దగ్గర నుండి చనిపోయిన తరువాత వెళ్ళే స్మశానం వరకు ఒకటి లేకపోతె ఏ పని అవ్వదు అదే లంచం.ప్రపంచ దేశాలలో కరప్షన్ లిస్టు లో మనది 7th ప్లేస్.కంగారుపడకండి T20 లో మనం లాస్ట్ ప్లేస్ కి వెళ్ళిన రేపో మాపో కరప్షన్ లో మనం ఫర్స్ట్ ప్లేస్ కి వచ్చేస్తాం లే.


రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ M.జగన్మోహన్ ఇంటిపయి ACB దాడి కోట్లల్లో అక్రమ ఆస్తులు లభ్యం.కొన్ని నెలల క్రితం ఇది ఒక హాట్ న్యూస్ ఇప్పుడు ఆ కేసు ఏమయిందో పట్టిచుకునే వాడే లేడు అనుకోండి,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో మొట్టమొదటి సారి IAS రేంజ్ ఆఫీసర్ మీద ACB దాడి అంటే ఇది మనం గర్వించదగ్గ విషయం కాదు,ఒక IAS రేంజ్ ఆఫీసర్ మీద దాడి చేయడానికి మనకి 50 సంవత్సరాలు పడితే,ఇక MLA మీద,మంత్రుల మీద దాడి చేయటానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది మన ACB వాళ్లకి.మా ఊరి MLA గారు ఎన్నికల ముందు తన సొంత TVS లో పెట్రోల్ కూడా పార్టీ ఫండ్ తో నే పోఇంచుకునే వాళ్ళు,MLA అయిన మొదటి సంవత్సరమే కొత్త కార్,కొత్త బంగ్లా.ఈయన ఎన్నికలలో గెలిచాడని ప్రబుత్వమేమన్న గిఫ్ట్ ఇచ్చిందా......?ఇది ఒక సామాన్య వెనకబడ్డ ప్రాంతం లో MLA పరిస్తితి.ఇక డెవలప్ అయిన ఏరియాస్ లో MLA ల మంత్రుల పరిస్తితి చెప్పే పనేలేదు వాళ్ళ ఆస్తులు లెక్క వారికే తెలియదు.ఏ రాజకీయ పార్టీ అయిన రాజకీయ నాయకుడయిన వోట్ల కోసం ఆ బిల్లు పెట్టండి ఈ బిల్లు పెట్టండి అని అసెంబ్లీ లో అడ్డమయిన రాజకీయం చేస్తారు తప్ప కరప్షన్ మీద బిల్లు పెట్టండి అని ఎప్పుడన్నా ఎవరన్న అడిగారా,లేదు ఎందుకంటె ఏ ఒక్క నాయకుడు కరెక్ట్ గా ఆస్తులు సంపాదించ లేదు కనుక.


కరప్షన్ అనేదేమీ రాజకీయ నాయకుల లోనే లేదు ప్రతి ఒక్కడి లో ఉంది.ఆగష్టు 15th రోజునో లేక ఏదన్నా స్టేజి మీదనో,ఏదన్నా ఆలోచించదగ్గ మూవీ చూసిన తరువాతనో మన యూత్ తెగ స్పీచెస్ ఇచ్చేస్తాం "మన దేశం మారాలి,మార్చడానికి మా వంతు కృషి చేస్తాం"అని.స్టేజి దిగ గానే ఎవడి దారి వాడిది(DOG TAIL BEND).కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే డొనేషన్ కట్టి జాయిన్ అవుతాము,విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఆఫీసు ల లో ముడుపులు చెల్లిస్తాము,విదేశాలలో సంపాదించి ఇక్కడ ఆస్తులు(భూములు)కొనడానికి ప్రభుత్వ ఆఫీసు ల లో లంచాలు పెడతాము,మన పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేయడానికి మళ్లీ డొనేషన్.ఇలా ఈ లైఫ్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది లంచం చుట్టూ తప్ప ఎక్కడా ఆగదు ఎవరు ఆ సైకిల్ ని ఆపుదామని కూడా ఆలోచించరు.ఎవరన్న మారుద్దాం అని అనుకున్నా మనమే వాడ్ని "నేటి గాంధి దిగోచ్చాడని లేక ఇంకేదో "అని ఫూల్ చేస్తాం తప్ప వాడితో కల్సి మనం కూడా ఏదన్నా చేద్దామని ఆలోచించం,అవును మనకెందుకు ఇవ్వన్ని మన పని అవుతుందా లేదా అది కావాలి కాని ఇవన్నిఎందుకు.


ఏ మార్పు అయినా ముందు మన నుంచే మొదలవ్వాలి అలా మొదలయి అందరితో పుర్తవ్వాలి,ఎవరికి వాళ్ళం మనకెందుకులే అనుకుంటే మనదేశం ముందుకేల్తుంది కాని అది అభివృద్దిలో కాదు కరప్షన్ లిస్టు లో మొట్ట మొదటి స్తానానికి. తెలుగులో ఒక గొప్ప సామెత ఉంది “వెయ్యి మైళ్ళ ప్రయానం అయినా ఒక్క అడుగుతో నే ప్రారంబం అవుతుంది“అని,ఏ పని చేసేటప్పుడు అయినా ఒక్కసారి ఆలోచిద్దాం అది మన దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది అని.






వ్యవస్థ ని మార్చలేక పోయినా వ్యక్తిగా మనం మారుదాం అని ఆసిస్తూ........................................










Your’s…………………………………………….సతీష్.

Wednesday, September 29, 2010

ఈనాడు వార్త కి ఆంధ్రజ్యోతి సాక్షి

టైం ఉదయం ఆరు అవుతుంది అప్పుడే లేచి హాల్ లోకి వస్తున్న నాకు ఇంట్లో ఏదో గొడవ అవుతున్న గోల వినిపిస్తుంది.ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని కాస్త కంగారుగా హాల్ లోకి వెళ్లి చూస్తే, ఇంకెవరు మన టీవీ న్యూస్ చానెల్ వాళ్ళు. పని పాట లేని వో నలుగురు నాయకులు వాళ్లకి తోడు నారద ముని లాంటి(ఆ నారద ముని లోక కళ్యాణం కోసం చేస్తే వీలు మాత్రం TRP రేటింగ్స్ కోసం) ఒక యాంకర్ కల్సి కొద్దిగా కూడా ఉపయోగం లేని ఒక మేటర్ గురించి చర్చా కార్యక్రమం అంట. దాన్ని చర్చ అనడం కన్నాపనీ పాట లేని ఉప్పర మీటింగ్ అనడం కరక్టేమూ.
సరేలే అని వేరే చానెల్ మారిస్తే అక్కడ ఇదే తంతు బట్ కారక్టేర్స్ డిఫరెంట్ అనమాట.పొద్దున్నే కాకి గోల తప్ప ఆ గొడవలో లాస్ట్ కి వీళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పేలోపే మన TV యాంకర్ గారు టైం అయిపాయింది చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి నిరంతరవాని మా చావుకి భాని అన్నట్లు చర్చకి వచ్చిన నాయకులని బఫ్ఫూన్ ల లా వదిలేసి ఒక యాడ్ వేసుకుంటారు, అయినా మన నాయకులు సిగ్గు ఎగ్గు లేదు అన్నట్లు పిలిచినోడే పాపం అన్నట్లు మళ్లీ వేరే చానెల్ వాడు పిలిస్తే మళ్లీ ఉరుకుతారు.

మన నాయకులే కరెక్టుగా ఉంటె ఈ గోలంతా TV వాల్లకెందుకు ఈ చావు గోల పొద్దు పొద్దున్నే మన ఇళ్ళల్లో ఎందుకు చెప్పండి. ఒకప్పుడు ఇన్-డైరక్టుగా నాయకుల పేర్లు చెప్పి కార్టూన్ బొమ్మల ద్వారా కామెంట్ చేసే TV వాళ్ళు ఇప్పుడు నాయకుల పేర్లు డైరెక్ట్ గా పెట్టి వారి ఫేస్లను మాస్క్ ల లా ధరించి డైరెక్ట్ గా ఒకర్ని ఒకళ్ళు మామూలు బాషలో కాకుండా చెవులకు చిల్లులు పడే బూతులలో తిట్టుకునే ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఏ నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నించే హక్కు లేక "ఎవడిగోల వాడిది" అని వదిలేస్తున్నారంటే వీళ్ళెంత నీతిమంతులో అర్ధమవుతుంది మనకు.ప్రతి పార్టీ ఒక న్యూస్ చానెల్ పెట్టుకోవడం,ఒక పది మందితో ఎదుటి పార్టీలను తిట్టించడం చూస్తుంటే భావితరాల వారిని పోలిటిక్స్ నేర్చుకోవడానికి కాలేజెస్ కి పంపకుండా TV ల ముందు కుర్చోపెడితే చాలేమో అనిపిస్తుంది.

అయోధ్య తీర్పుని నాలుగు అయదు రెచ్చకొట్టే క్లిప్పింగ్స్,రెచ్చకొట్టే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వేసి ఒక గంట ప్రోగ్రాం పెట్టి అమాయక జనాలను రెచ్చకోట్టడం, డ్రగ్స్ మాఫియా అని ఒక న్యూస్ స్టార్ట్ చేయడం మా దగ్గర అందరి లిస్టు ఉంది అని బ్లాకు మెయిల్ చేయడం డబ్బులు దొబ్బడం లాస్ట్ కి జనాల్ని పిచ్చి వాళ్ళని చేయడం(ఆ లిస్టు లో ఉన్న పెద్ద వాళ్ళ పేర్లను ఫస్ట్ లోనే బయట పెట్టొచ్చుగా),ఒక అమ్మాయి మీద దాడి జరిగితే ఆ అబ్బైని పెద్ద స్టార్ ని చేయడం తరువాత కాం అవడం,ఏ TV వాడు వాళ్ళ నాయకుడి వివరాలు తప్ప సమాజం లో ఏమి అన్యాయం జరిగినా మనకి అనవసరం అనుకోవడం,తెలంగాణా లో విద్యార్దులను ఇక్కడ, ఆంధ్రాలో విద్యార్దులను అక్కడ రెచ్చ కొట్టి న్యూస్ క్రియేట్ చేసుకోవడం,అవసరమయితే హత్యను ఆత్మ హత్య గా,ఆత్మ హత్యను హత్యగా క్రియేట్ చేయగలడం,ధనం తప్ప జనం గురించి ఆలోచించకపోవడం.ఇలాంటి ఎన్నో అర్హతలు ఉంటేనే ఈ కాలం లో పోటీని తట్టుకుని TRP రేటింగ్స్ తెచ్చుకోగలరు.

200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఇప్పుడు CEO ఒక ఇండియన్ అయ్యాడు,30 సంవత్సరాల వయసు ఉన్న ప్రణవ్ అనే వ్యక్తి మన బాడీ నే కంప్యూటర్ గా డిజైన్ చేసాడు,ఇలాంటివి మన ఛానల్ వాలకి న్యూస్ ల కనిపిచదేమో,కనీసం మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి చూపిచ్చే టైం మాత్రం మన న్యూస్ చానెల్స్ కి, పేపర్స్ కి ఉండదు కాని,రాంగోపాల్ వర్మ కి విజయవాడ లో ఉన్న ఒక నాయకుడికి మద్య గొడవ లేపడం దాన్ని 24/7 చుపిచడానికి మాత్రం విసుగురాదు. ప్రతీ న్యూస్ చానెల్ ప్రజల సమస్యలను చూపిచ్చి కాష్ చేసుకుంటుంది కాని ఏ ఒక్క న్యూస్ చానెల్ ప్రజల సమస్యతీరే వరకు వారికి తోడుగా నిలవడం లేదు అన్నది జగమెరిగిన సత్యం.



మీడియా నే మన సమాజానికి నాలుగో పాదం అంటారు,నాలుగో పాదం లెకపొఇన మనం కుంటుకుంటూ గడపగలం కాని ఆ నాలుగో పాదమే మిగిలిన మూడు పాదాలను నాశనం చేస్తుంటే ఎలా.రోజు TV లో ఆ చర్చ గోష్టి చూసి బోర్ కొట్టి నేను నా ఆవేదనను రాయట్లేదు,మన సమాజానికి సమాజం లో ఉండే వ్యక్తులకి అవి ఎంత చేటు చేస్తున్నాయో ప్రత్యక్షంగా చూసి బాధపడుతూ రాస్తున్నాను, పార్టీల వారి మద్య తగాదాలు పెట్టి ఆయా పార్టీలను అభిమానించే సామాన్యుల మీద ఈ ప్రభావం పడి వారు మానవత సంబందాలు మానేసి ఏదో సొంత కక్షలులా వారి మనస్సులో పాతుకుపోయేలా ప్రేరేపిస్తున్నారని నా అభిప్రాయం, ఎలాగు మన నాయకులు,వారి న్యూస్ చానెల్లు మారే ఛాన్స్ లేదు కాని దయచేసి అదీ చూసి మనం మాత్రం మారవద్దు అని ఆసిస్తూ………










Your’s…………………………………….సతీష్.                                                               

Tuesday, September 7, 2010

మొక్కయి వంగనిది మానయి వంగునా...?

యువత ఈ మాట వినగానే 16 సంవత్సరాల వాడి దగ్గరి నుండి 30 సంవత్సరాల వాడి వరకు ఉప్పొంగిపోతాడు నేను యూత్ అని ఫీల్ అవుతూ.ఒక సినిమాలో అన్నట్లు నువ్వు యూత్ ఎంట్రా అని. నిజమే యువత అంటే 18 నుండి 25 yrs వాళ్ళు మాత్రమె అని అర్ధం కాదు, 90 సంవత్సరాల వయసులో కూడా యూత్ ఉన్నారని నేను నమ్ముతా.యూత్ అంటే ఉరకలేసే ఉత్సాహం ఏదన్నా సాదించాలనే కసి,దానికోసం ఎంతయినా కష్టపడే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు యువత కిందకే వస్తారు వయసుతో సంబంధం లేకుండా.మన దేశ భవిష్యత్తు మన యువత మీద ఆదారపడి ఉంది అంటుంటారు కదా…!
బద్ధకం అనే దెయ్యం పట్టుకుని పీడిస్తున్న ఈ యువత(అదేనండి మనం ఫీల్ అవుతున్న ఈ యూత్) వల్ల దేశ భవిష్యత్తు ఏమవుతుందో……?
 
నేను కూడా మనం ఫీల్ అయ్యే యూత్ లోకి వస్తున్న కొద్ది సేపు…. ఒకప్పుడు యూత్ అంటే 18 to 25yrs. ఈ ఏజ్ లోనే కొంటె పనులు, చిలిపి పనులు చిన్న చిన్న తప్పులు చేస్తాం. కాని మన యూత్ ఏజ్ ఇప్పుడు జెనరేషన్ లో 12 to 13yrs నుండే స్టార్ట్ అవుతుంది అంటే  మనం ఎంత ఎదిగిపోయామో కదా.12 , 13 సంవత్సరాల నుండే మందు,సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే మనం యూత్ ఏజ్ ని అప్పుడే స్టార్ట్ చేసామన్నమాట.ఇంటర్మీడియట్ వయసులోనే మన యూత్ లో 70% ఉహించనంత  బయంకరమయిన అలవాట్లకు బానిసలవుతున్నారు అంటే కాదని అనగలరా….? ఇది సిగరెట్ పెట్ట మీద రాసిన "smoking is injurious to health " అన్నంత నిజం.అంటే మన భవిష్యత్తు యువత చేతిలో ఉంది అని భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మన యువత ఇప్పుడే మన దేశ చరిత్రను,సంస్కృతి ని మార్చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటె మనకు మార్పు అంటే ఇష్టం కదా…….!
 
ఒక చిన్న మొక్క రోడ్ పక్కన ఉంది,ఒక రోజు పెద్ద వర్షం వచ్చి దానికింద కొంచెం మట్టి కొట్టుకుపోయింది,అది బాలన్స్ అవుట్ అయి కొద్దిగా వంగింది.అలా అలా అది వంకరగా పెరుగుతూ వచ్చింది, అప్పుడు దాన్ని ఎవరు పట్టిచ్చుకోలే అలా అలా పెరుగుతూ పెద్దదయింది.చిన్నప్పట్నుండి కాస్త వంకరగా పెరగటం వల్ల అది వంగి రోడ్ కి అడ్డంగా రావడం మొదలు పెట్టింది,దాని వల్ల రోడ్ మీద వెళ్ళే వాహనాలకు ఆటంకం గా తయారయింది.ఇప్పుడు దాన్ని పక్కకు వంచుదామన్న కుదిరే పని కాదు అని తెల్సి R&B వాళ్ళు దాన్ని నరికి పడేసారు.ఇక్కడ చిన్న మొక్క అనేది మన యూత్,వర్షం అనేది యూత్ లైఫ్ లో మనకు ఎదురయ్యే సంగటనలు. రోడ్ అనేది సమాజం,వాహనాలు సమాజం లోని వ్యక్తులు. ఇలా ఆ మొక్కని మొక్కగా ఉండగానే సరిగా పెంచకపోవడం వల్ల మానుగా మారి దాని జీవనం సమాజం లో ఉన్న అందరికి ఆటంకంగా తయారయింది.
 
యూత్ ఎవరన్న ఏదన్నా మంచి విషయాలు చెప్తే తొక్కలో సోది ఈ వయసులో కాకపొతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం అని ఫీల్ అవుతాం. అస్సలు ఎంజాయ్ అంటే ఏంటి…….? మన వలన ఎదుటి వాడు బాధ పడకుండా మనం హ్యాపీ గా ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీ గా ఉంచడమే.ఎంతమంది కనీస బాద్యత లేకుండా ఇంట్లోవాళ్ళని బాధపెడుతూ, క్రమశిక్షణ లేకుండా గురువులను బాధపెడుతూ, పయిసాచకం గా తోటి వారిని హింసిస్తూ,ఇలా ఎంజాయ్ అనే ముసుగులో కొట్టుకుంటూ బ్రతికేస్తున్నారు.నిజమే ఇందులో వారి తప్పేమీ లేదు మొక్కని మనం చిన్నపుడు వంచకపోతే అది అలానే పెరుగుతుంది అందుకు ఆ తప్పు మొక్కది కాదు దాన్ని వంచని ఈ వ్యవస్తది.
 
మన ఈ ప్రభుత్వాలు ఏడాదికి వంద రెండొందల కాలేజీ లు పెంచుతూ ఏదో మన యువతకు ఉపాది కల్పిస్తున్నాం అని ఫీల్ అవుతూ కార్పోరేట్ సమత్సలకు మన సొమ్మును మన భవిష్యత్తును అమ్ముకుంటున్నారు.ఎన్ని కాలేజీ లు ఉన్నాయన్నది కాదన్నయ్యా ఏమి చెప్తున్నారన్నదే ముక్యం…..(మహేష్ బాబు అన్నట్లు).ఉన్న కాలేజీ లలోనే మన చదువులు మన మనుగడకి,మన భవిష్యత్తుకి,క్రమశిక్షనకి ఉపయోగ పడుతున్నాయా లేదా అని ఆలోచించడం లేదు.వెలుగుతున్న అగ్గిపుల్లని ఆర్పడానికి కనీసం చుక్క నీరు కూడా అవసరం లేదు,చేత్తో అర్పెయోచ్చు. అదే నిప్పును మనం పట్టిచుకోవడం మానేస్తే దాన్ని ఆర్పడానికి కొన్ని ఫైర్ ఇంజన్ లు వచ్చినా సరిపోదు.అంటే మన యూత్ నడిచే దారిని ఇప్పుడే మనం బాగుచేయకపోతే దాని వల్ల జరిగే ఈ విష పరిణామాలను ఆపడం అది ఎవరి తరం కాదు అని నా అభిప్రాయం.ప్రభుత్వాలు కనీసం ఇండియా లో ఉన్న ఒక్క బాచ్ ని అన్నా 10th క్లాసు నుండి డిగ్రీ అయ్యే వరకు జాగర్త గా అన్నీ విలువలతో క్రమసిక్షనగా బయటికి వచ్చేలా చేస్తే మన దేశం 100 సంవత్సరాల ముందుకి వెళ్తుంది అని నా అభిప్రాయం……..   
 
 
 
యువర్'s.................................సతీష్.                                               

Friday, July 16, 2010

మానవుడేమహనీయుడు

                            ఒక  వయిపు  ఉప  ఎన్నికలు,ఒక వయిపు బందులు మరో వయిపు యాత్రలు,ఇలా మన రాష్ట్ర నాయకులు ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నారు కాని మన సమస్యల ను పట్టిచుకునే తీరిక మాత్రం ఎవరికి  లేదు బంధుల వల్ల మనకి ఒక్కరోజుకే 13 వేల కోట్లు నష్టం తప్ప మనకి ఒరిగిందేమీ జరగలేదు రేట్లు ఏమన్నా తగ్గిచ్చారా?.ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే వీళ్ళని ఎవరు రాజీనామా చేయమన్నారు మళ్లీ ఎవరు పోటి చేయమన్నారు మనమేమన్న బ్రతిమిలాడామా? ఈ ఉప ఎన్నికల వలన కొన్ని కోట్ల ఖర్చు ప్రభుత్వానికి(అంటే మనకే కదా).ఇక కొంతమంది మంత్రులకి,MLA ల కి అసెంబ్లీ కన్నా పర్సనల్ యాత్రలే ముఖ్యమట ఇంత ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలలో మనగురించేదో చిన్చుతారంటే వారు యాత్రకే వెళ్తాం అసెంబ్లీ కి రాము అంటున్నారు వీళ్ళంతా ఒక నాయకుడికి జీతగాల్లా, మనం ఎన్నుకున్న ప్రజా నాయకులా?ఇన్ని కోట్ల డబ్బు ఇలా వృధా చేస్తున్నారు వీళ్ళు ఈ డబ్బంతా వీళ్ళ వీళ్ళ జేబుల్లో నుండి పెడుతున్నారా,లేదు కదా మన డబ్బే కదా.కాని మనం మాత్రం ఇదేదో పెద్ద వినోదం లా ఇళ్ళల్లో TV ల ముందు ఈ బాగోతాన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం.
ఇదంతా ఎందుకు జరుగుతుంది....యదా ప్రజా తదా రాజా అన్నారు.మనం అసమర్డులగా ఉన్నన్ని రోజులు ఈ స్వార్ద రాజకీయ నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు.మా హీరో ని వేరే హీరో ఫాన్స్ తిట్టారు అంటూ ఎక్కడలేని పౌరషం వస్తుంది(దాని వల్ల వీడికి కాని వీడి ఇంట్లో వాడికి కాని ఉపయోగం లేదు),కాని మనల్ని మన నాయకులు ఇలా దోచుకుంటున్నారని ఏ ఒక్కడికి పౌరషం రాదు.ఎందుకంటె ఆ నాయకులు ఇచ్చే వంద,వేయిలకు కక్కుర్తి పడతామే తప్ప మన జేబుల్లోనుండి తీసి అందులో ఒక శాతం బిక్ష మనకి వేస్తున్నారని అర్ధం చేసుకోము మనం.అస్సలు రాజకీయ నాయకులని అనే ముందు మనకి మనం ఆలోచించాలి,ఎంత మంది మనలో మనిషి గా బ్రతుకుతున్నారు….?ఆలోచించండి మనకే తెలుస్తుంది.
ఇప్పుడు మేము మనుషుల లానే ఉన్నాం గా అనిపిస్తుందా…? మనిషిగా బ్రతకడం అంటే మన స్వార్ధం మనం ఆలోచించడం,మన పొట్ట నిండితే చాలు అవతలి వాడు ఏమయితే మనకేంటి అనుకోవడం కాదు.మనం పుట్టే ముందు అందరు సంతోషిస్తారు,కాని మనం పోయాక మనస్పూర్తి గా బాధ పడే వాళ్ళు ఎంత మంది ఉంటారు మన రక్తసంబందీకులు కాకుండా…? చాలా మంది నేను చాలా గొప్ప పనులు చేశా అని చెప్పుకుంటుంటారు మదర్ తెరీసా చెప్పినట్లు “గొప్ప పనులంటూ ఏమి ఉండవు మనం ప్రేమ తో చేసే ప్రతి చిన్న పని కూడా గొప్ప పనే”.మనం మన పక్క వాడితోనే ప్రేమ గా ఉండనప్పుడు ఎవడో మనల్ని ప్రేమతో ఎలా పరిపాలిస్తాడు.
మనం అంతరిక్షం లో అడుగు పెడుతున్నాం,సముద్ర గర్బాలలోకి ఈదుకుంటూ వెళ్తున్నాం,ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తున్నాం.కాని ప్రేమతో ఎదుటి వారి మనసులో స్తానం సంపాదించ లేకపోతున్నాం  ఇదేనా మన అభివృద్ధి మనిషిని మనిషే దోచుకు తినడమా…? అభివృద్ధి పేరుతొ మనుషుల్ని మనుషులే కాల్చుకు చావడమా.సోంపల్లి లో చనిపోయిన ఆ అభాగ్యుల ప్రాణాలు ఏ అభివృద్ధి తీసుకు వస్తుందో చెప్పండి.“పంచే కొద్ది తరిగేది సంపద,కాని పంచే కొద్ది పెరిగేది ప్రేమ మాత్రమె”. ఇది గుర్తు పెట్టుకున్న్న ప్రతి వాడు మహనీయుడు అవుతాడు అందరికి మహాత్ముడవుతాడు అని ఆసిస్తూ..........
Your 's................................సతీష్..
 

Saturday, June 19, 2010

తెలుగు జాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది



హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర గొడవ జరుగుతుంది మేటర్ ఏంటంటే తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సెపరేట్ కావాలి అని కొట్టుకుంటున్నారు, ఈ లోపు ఇద్దరి నాయకులు(ఒకడు from తెలంగాణా,ఇంకొకడు from ఆంధ్ర) అలిసిపొఇ రోడ్ పక్కనే ఉన్నఒక చిన్నషాప్ దగ్గర(షాప్ వాడు తెలంగాణానో ఆంధ్రనో తెలీదు) కుర్చుని డ్రింక్ తాగుతున్నారు.ఇంతలో షాప్ వాడు పేపర్ చదువుతున్నాడు పైకి వినపడేలా "Australia లో తెలుగు విద్యర్డులపయిన దాడి"అని,వెంటనే ఇద్దరి నాయకుల్లో ఒక నాయకుడి కొడుకు Australia లో చదువుతున్నాడు,వాడికి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కుని జాగర్త నాన్న అని చెప్పి ఫోన్ పెట్టాసాడు,ఇంతలో ఇంకో నాయకుడు పర్లేదా మీ వాడు సేఫ్ కదా అన్నాడు k అన్నాడు,ఏంటండి ఇంత దారుణం మనవాల్లేదో చదువుకున్దాము అని అంత దూరం వెళ్తే వాళ్లకు ఏమయింది ఇలా చేస్తున్నారు అన్నాడు ఒక నాయకుడు,ఇంకో నాయకుడు అవునండి మన ప్రబుత్వం కూడా పట్టించుకోవట్లేదు దారుణం అన్నాడు, వెంటనే షాప్ వాడు "ఏదండి దారుణం



ఎక్కడో Australia అది మన దేశం కాదు మన బాష అంతకన్న్నకాదు,అక్కడి మేటర్ పక్కన పెడితే మన కళ్ళ ముందు మీరు చేస్తున్దేంటి,మనందరం తెలుగు వాళ్ళం,ఇందులోనే మా ఏరియా కి నువ్వు రాకు అంటే మా ఏరియా కి నువ్వు రాకు అని తలలు పగల కొట్టుకు చస్తున్నాము,ఒకే బాష ఒకే రాష్ట్రం ఒకే దేశం వాళ్ళం మనమే ఇలా ఉంటె,ఎవడో వేరే దేశం వాడు మన వాళ్ళను కొట్టడం లో వింత ఏముంది సర్" అన గానే ఇద్దరి నాయకులు ఒకరి పేస్ లోకి ఇంకొకరు తెల్ల మొహమేసి చూసుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు మెల్లగా….

ఇది నిజమే కదా,మన దేశం లోనే ప్రతి రాష్ట్రం లో ఒక గొడవ,మన దగ్గర తెలంగాణా ఆంధ్ర అని మనం కొట్టుకుంటాం, మహారాష్ట్ర లో మరాఠీ నే మాట్లాడాలి వేరే వాళ్ళు ఉండకూడదు అని అక్కడ శివసేన.ఇలా ప్రతి రాష్ట్రం ఇలా కొట్టుకుంటూ పొతే ఇక మిగిలేది ఎవరు,ఒకప్పుడు మన map లో AP కి ఎంతో విలువుండేది,ఇప్పుడు మన రాష్ట్రం అంటేనే బయం వేస్తుంది బయటి వాళ్ళకి,ఈ 6 నెలల బీబత్సానికే మనం 6yrs వెనక పడ్డాం అబివ్రుద్దిలో,ఒక్కసారి ఆలోచించండి మన ప్రబుత్వ ఆస్తులకి ఎన్ని కోట్ల నష్టమో అవన్నీ మనవి కాదా,ఎప్పుడు గవర్నమెంట్ ఆస్తులు నష్టం అయిన దానికి రాజకీయ నాయకులో లేక రౌడి లో కారణం,కాని ఈ సారి చాలా bad ఏంటంటే,ఈ సారి గొడవలకి students కారణం,ఇప్పటికే ఎంతో విలువయిన half year వేస్ట్ చేసుకున్నారు.అమాయకులయిన స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాని ఏ ఒక్క రాజకీయ నాయకుడయిన చెసుకున్నాడా......

ఒక్కొక ఏరియా నాయకుడు తమ తమ ఏరియా లో 10 r 15 yrs నుండి MLA’s గ ఉంటారు,మళ్లీ "మా ఏరియా వెనకబడ్డది"అంటారు అంటే ఈ 10 సంవత్సరాలనుండి మీరు ముందుకి వెళ్తూ(ప్రజల సొమ్ము ని దండుకుంటూ) మీ ఏరియా ని వెనక్కి నెడుతున్నారు,మీ ఏరియా వెనకబడుతుంటే మీ ఆస్తులెలా పెరుగుతున్నాయో ప్రజలకు అర్ధం కావట్లే....చైనా లో ఒక మంచి సామెత ఉంది.“ఒక వ్యక్తికి ఒక్కరోజు కడుపు నింపడానికి చేపల కూర పెడితే సరిపోదు అదే వ్యక్తికి ఒక వల(నెట్) ని ఇస్తే వాడి జీవితాంతం జీవనోపాది కల్పించిన వాడివవుతావ్"అని.కాని మన నాయకుల దగ్గర elections వచ్చినప్పుడు మన జనాలు ఓటు కి 100 తో త్రుప్తి పడే అంత కాలం మనం మన ఏరియా వెనక పడుతూనే ఉంటుంది.

నాకు తెలంగాణా ఆంధ్ర కలిసి ఉండాలా విడిపోతే మంచిదా అని మాట్లాడే అంత knowledge లేదు. కాని ఏది మంచిదో మేధావులు అందరు కలసి కూర్చుని సామరస్యం గ తేల్చుకోవచ్చు కదా ఇంత గొడవలు చేసి సాదిచిన్దేముంది,మన ఆస్తుల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప,పూర్వం ముర్ఖం గ రాజులు యుద్హాలు చేసి సాదించింది ఏముంది,ప్రజాస్వామ్య దేశం మనది.బుర్ర తో తేల్చుకోవాల్సిన విషయాన్ని కర్రతో తేల్చుకుందాం అనుకుంటున్నారేమో అని నా ఫీలింగ్…ఏ ఏరియా వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ...కొంతమంది స్వార్ధం కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకోవద్దని నా ఉద్దేశం.










Your's..........సతీష్

Saturday, June 12, 2010

పారాహుషార్...పారాహుషార్

మన రాష్ట్రం లో మినరల్ వాటర్ బాటిల్ దొరకని ఊరు ఉందేమో కాని క్వార్టర్ బాటిల్ దొరకని ఊరంటు లేదు.మూతి మీద మీసం మొలవని వాడి దగ్గరి నుండి కాటికి కాలు చాచిన వాడి దాకా ఒకటే మత్తు,మద్యం అనే చిత్తు లో మునిగి తేలుతున్నారు.మన పురాణాల నుండి మొదలు ఈ మద్యం అనే మహమ్మారి మనల్ని వదిలేలా లేదు.రాజులు మారారు రాజ్యాలు మారాయి,ప్రభుత్వాలు మారాయి ప్రణాలికలు మారాయి కాని మనమీద ఈ  మందు ప్రభావం మాత్రం మారలేదు.ఒకప్పుడు మద్యం అనేది కొంతమంది జీవితాన్ని మాత్రమె శాసించేది అదే వారి జీవితాన్ని నాశనం చేసేది.కాని ఇప్పుడు అదే మద్యం మన ప్రభుత్వానికి కామధేనువు లా తయారయింది,రాష్ట్ర ఖజానాని నింపే ముఖ్యమయిన వనరు లా మారింది.ఖజానాని నింపడం లో తప్పు లేదు,కాని ఆ ఖజానా లో ఉన్న ధనం ఎవరికోసం...? ప్రజల అభివృద్ధి కోసమే కదా.మరి మన ప్రజల ఆరోగ్యం నాశనం చేసి సంపాదించి మళ్లీ ప్రజలకే పెట్టడం అనేది ఎక్కడి న్యాయమో అర్ధం కావట్లే.
మన నాయకులను ఎవరడిగారండి అన్నీ ఫ్రీ(పతకాలు)అని చెప్పి ఖజానని కాలీ చేయమని ఎవరు చెప్పారు.అన్నీ ప్రభుత్వాలు వోట్ల కోసం అన్నీ ఫ్రీ అని చెప్పి అధికారం లోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే ఆర్ధిక వ్యవస్తను అతలాకుతలం చేయడం,ఇప్పుడు ఆర్దిక వ్యవస్తను దారిలో పెట్టడానికి మన ప్రజల్ని అడ్డ దార్లో నడిపి వాళ్ళ వ్యసనాల మీద ప్రభుత్వాలు సంపాదించే ఆధునిక సూత్రం లో నడుస్తున్నాయి.లాస్ట్ ఇయర్ మద్యం టెండర లలో ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లు ఈ సంవత్సరం అది 6 వేల కోట్లు దాటింది అని TV లలో పేపర్ లలో చాలా గొప్ప గా చెప్పుకుంటూ పోతుంది మన ప్రభుత్వం.అంటే ప్రతి సంవత్సరం మందు అమ్మే వాళ్ళ సంఖ్య దాన్ని తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతున్దనమాట సారీ మన ప్రభుత్వమే దగ్గరుండి మరీ పెంచుతున్దనమాట.గొప్ప గొప్ప నాయకులందరూ మద్యాన్ని నిషేదించండి పేద వాళ్ళ కుటుంబాలను కాపాడండి అని వాదిస్తుంటే మన ప్రభుత్వాలు మాత్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాయి.మన రాజకీయ నాయకులకు చిన్న లాజిక్ అర్ధం కావట్లేదు.ప్రభుత్వం ఖజానాని నింపడానికి విచ్చల విడిగా మద్యం టెండర్స్ వేసి ప్రజల సొమ్ము ని ధన్డుకుంటుంది కాని అదే ప్రజలు మద్యం అనే విషాన్ని తాగి మళ్లీ హాస్పిటల్స్ లలో చేరి(ఆరోగ్య శ్రీ)ఫ్రీ పథకాల ద్వారా మళ్లీ ప్రభుత్వ ఖజానానే కాలీ చేస్తారు కదా!!!.ఎందుకిలా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.మన పురాణాల లోనే ఉంది మద్యం మత్తులో అసురులు (రాక్షసులు)మహా విష్ణువు చేతిలో ఎలా మోసపోయి అమృతాన్ని చేజార్చుకున్నారో.మనిషి తయారు చేసిన పానీయం మనిషి జీవితాన్నే ఆడుకున్టుందంటే ఎంత వింత గా ఉంది కదా.మన ప్రభుత్వం సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ కి 10 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తుంది ఎందుకో తెల్సా?మందు బాబులను మానిపిచ్చడానికి,కొత్తగా ఎవరు దానికి అలవాటు పడకుండా ఉండటానికి TV లు పేపర్ ల ద్వారా యాడ్స్ ఇచ్చి ప్రజల్ని చైతన్యులని చేయడానికి ఆ బడ్జెట్ ని యూస్ చేయాలి కాని ఆ విషయాలను పక్కకు నెట్టి మన ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎలా పెంచాలి,మద్యాన్ని ఎక్కువగా ప్రజలు తాగేలా ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది.
మందు బాటిల్ మీద“మద్యం ఆరోగ్యానికి హానికరం”అని ఒక చిన్న లైన్ రాసి మరీ అమ్మే దౌర్బాగ్య సంస్కృతిలో మనం ఉన్నాం.రాక్షసులు విజ్ఞానం అంటే తెలియని కాలం లో మత్తులో మునిగి అన్నీ కోల్పోయారు,కాని అన్నీ తెల్సి అభివృద్ధి అనే ముసుగులో మనం మన జీవితాలను కోల్పోతున్నాం అని నా అభిప్రాయం.
ఆల్కహాల్ వల్ల జరిగే అనర్దాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Your's ..........................................సతీష్

Saturday, June 5, 2010

రేపటి పౌరులు


ఈ రోజు ఆఫీసు లో చాలా లేట్ అయింది(సమయం 12PM 03/JUNE/2010 Johannesburg (SA)),క్యాబ్ కోసం కాల్ చేసాను 15mins లో క్యాబ్ వచ్చింది,అప్పటికే చాలా అలసటగా నా కళ్ళు మూసుకుపోతున్నై.క్యాబ్లో ఎక్కి కూర్చోగానే నా కళ్ళు మత్తుగా వాలిపోయాయి సడెన్గా బ్రేక్,మెలుకువ వచ్చి చూడగానే కార్ ఆగి ఉంది.చూస్తె ట్రాఫ్ఫిక్ సిగ్నల్ రెడ్.రాత్రి 12 అవుతుంది రోడ్ మీద ఒక్క వెహికిల్ కూడా లేదు ఇక్కడ మాములుగానే 8PM దాటితే రోడ్ మీద ట్రాఫ్ఫిక్ ఉండదు,కాని క్యాబ్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ పడగానే కార్ ఆపి మళ్లీ గ్రీన్ లైట్ ఆన్ అవగానే మూవ్ అయ్యాడు.చూస్తే ఆ క్యాబ్ డ్రైవర్ అంత పెద్దగా చదువుకున్న వాడిలా కూడా లేడు,కాని ట్రాఫ్ఫిక్ రూల్స్ ఎంత చక్కగా పాటిస్తున్నాడు.నాకు వెంటనే మన హైదరాబాద్ JNTU సర్కిల్ అక్కడి ట్రాఫ్ఫిక్ మన వాళ్ళ నిబద్దత గుర్తొచ్చి నవ్వుకున్నాను.JNTU ట్రాఫ్ఫిక్ సిగ్నల్ చూస్తే అర్ధమవుతుంది అక్కడ నివసించే వాళ్ళు ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళు అందరు 90% చదువుకున్నవాళ్ళు అన్ని రూల్స్ తెల్సిన వాళ్ళే  ఎందుకంటె అక్కడ JNTU యునివెర్సిటీ దగ్గరిలో హైటెక్ సిటీ ఉన్నాయ్.సిగ్నల్ కి 10 అడుగుల దూరం లో JNTU పోలిస్ స్టేషన్ ఉన్నా కాని అక్కడ ఏ వ్యక్తి సిగ్నల్ రూల్స్ పాటించరు అక్కడ రోడ్ కూడా సరిపోదన్నట్లు పక్కన బండలు కొండల మీదనుండి కూడా వాహనాలను పోనిస్తారు(కొంత కాలం కిందట ఆ వ్యక్తుల్లో నేను ఒకడ్ని). ఇది ఒక JNTU లోనే కాదు మన దేశం లో ప్రతి సిటీ లో ఇలానే ఉంది.
ఇక్కడ ప్రజలకు(సౌత్ ఆఫ్రికా)స్వాతంత్ర్యం వచ్చి 10 సంవత్సరాలు మాత్రమె అయింది.మనకు స్వాతంత్ర్యమొచ్చి 60 ఏళ్ళు దాటింది.ఇక్కడ మనం ఈ దేశం కన్నా వెనక పడి ఉన్నాం అని నేను చెప్పదల్చుకోలేదు.ప్రపంచ పటం లో మనం సౌత్ ఆఫ్రికా కంటే  ఎన్నో అడుగుల ఎత్తులో (అభివృద్ధి లో)ఉన్నాం,కాని మన వ్యవహార శైలిలో మాత్రం వెనకబడే ఉన్నాం అని నా వ్యక్తిగత అభిప్రాయం.ఈ దేశం లో ఒక వ్యక్తి ఆదాయం నెలకు సగటుగా 3 వేలు కూడా లేదు,అక్షరాస్యత లో చాలా వెనకబడి ఉన్న దేశం కాని వ్యవహార శైలి లో ఎంతో ఉన్నత దేశం.మరి మనమెందుకు మన  వ్యక్తిగత అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నాం మన వ్యవస్థ గురించెందుకు ఆలోచించడం లేదు.
ఇలా ఆలోచించే లోపు నా అపార్ట్మెంట్ వచ్చింది క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇచ్చి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లోకి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి తన ముక్కు మొహం నాకు తెలీదు చాలా మర్యాదపూర్వకం గా విష్ చేసాడు,మనం కనీసం ముఖ పరిచయం ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చినా ముందు వాడు నవ్వి పలకరించే దాకా మనం పలకరించం(మనకి ఈగో కొంచెం ఎక్కువ కదా).ఇక్కడి వ్యక్తులు అందరు మంచి వాళ్ళు మన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కాదు.ప్రతీ దేశం లో ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి.మన దేశం అన్నా,మన ప్రజలు అన్నా,మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మన నాయకులు అన్నా బయటి ప్రపంచానికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది,ఆ అభిప్రాయాన్ని మనం పాడుచేస్తున్నామేమో అని నా అభిప్రాయం.ఇక్కడి(సౌత్ ఆఫ్రికా) ప్రజలకు స్వేచ్చ పోరాటం అంటే ఏంటో నేర్పిందే మన గాంధీ గారు,ఆ గాంధీ గారి భావాలను మనలో చాలా మంది ఎప్పుడో మర్చిపోయారు కాని ఇక్కడ వ్యక్తుల్లో చాలా  మంది ఇప్పటికి వాటిని పాటిస్తున్నారు.మన పోలిస్ లు కేసుల కి బయపడి తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు.ఒక్కసారి హైదరాబాద్ సిగ్నల్స్ లో ఒక్క ట్రాఫ్ఫిక్ పోలిస్ లేకుండా ఒక గంట చూడండి మన వాళ్ళ నిబద్దత ఎంతుందో అప్పుడే అర్ధమవుతుంది.ఎందుకు బయటి కంట్రీస్ లో ట్రాఫ్ఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక పోలిస్ కూడా కనిపిచ్చడు,మరి మనదగ్గరెందుకు సిగ్నల్స్ సరిగా పని చేస్తున్నా కాని ఇద్దరు ముగ్గురు పోలిస్ లు ఉంటారు.
"అవకాశం లేనప్పుడు తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు అవకాశం ఉండి కూడా తప్పు చేయని వాడు గొప్ప వాడు".నేను ఈ దేశం(సౌత్ ఆఫ్రికా)వచ్చే ముందు అందరు బయపెట్టారు అక్కడ Indians మీద ఎటాక్స్ బాగా జరుగుతాయి జాగర్త అని,నిజమే ఇక్కడ ఎటాక్స్ జరుగుతాయి కాని అది ఈ దేశ ప్రజలు చేస్తున్నవి కావు వేరే దేశం నుండి వలస వచ్చి ఏ పని లేక కాలీగా ఉండే వాళ్ళు చేస్తున్న పని ఇది అని ఇక్కడికి వచ్చాక తెల్సింది,వాళ్ళు చేసే ఈ పని వలన ఈ దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది.అలానే మనం చేసే తప్పుల వలన మన దేశానికి చెడ్డ పేరు రావోద్దనే నా అభిప్రాయం.జూన్ 5th ఈ రోజు నాకు ఈ దేశం లో చివరి రోజు మళ్లీ నేను ఈ దేశానికి వస్తానో లేదో తెలీదు,కాని జీవితాంతం నాతొ మిగిలి ఉండే ఎన్నో తీపి గుర్తులను మాత్రం తీసుకు వెళ్తున్నాను,కాని శాంతికి మారు రూపమయిన నెల్సన్ మండేలా గార్ని ప్రత్యక్షం గా చూడాలి అన్న నా చిన్ని కోరిక తీరకుండానే నా దేశానికి తిరిగి వెళ్తున్న అనే చిన్న బాద తో ఉన్నాను.
చిన్నప్పటి నుండి వింటున్నా మన నాయకులు చెప్తుంటారు "నేటి బాలలే రేపటి పౌరులు వారే మన దేశ భవిష్యత్తు కి బంగారు బాటలు" అని,ఆ బాలలు పెరుగుతూనే ఉన్నారు వారు కూడా మన రాజకీయ నాయకుల బాటలోనే నడుస్తున్నారు తప్ప ఎటువంటి మార్పు లేదు.నేటి బాలలు రేపటి పౌరులవుతారు నిజమే కాని వారు మన దేశ భవిష్యత్తు కి బంగారు బాట కావాలంటే ముందు మనం సరయిన బాటలో నడవాలి వాళ్ళని సరయిన బాట లో ప్రయాణించేలా చేయాలి అని ఆసిస్తూ………………………………


ఎప్పుడు మనదేశం లో అడుగుపెడతానా అనే ఆనందంతో ఊగుతూ……..






Your’s……………………………………సతీష్.


Sunday, May 30, 2010

వేణువయి వచ్చాను భువనానికి

పిచ్చోడి చేతిలో రాయి అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు,అదే రాయి ఒక కార్మికుడి చేతిలో పడితే ఒక గొప్ప కట్టడం లా తయారవుతుంది,ఒక శిల్పి చేతిలో పడితే అందమయిన శిల్పం లా మారుతుంది.అదే రాయి మన వేటూరి గారి కలం లో పడితే సుందరమయిన పాటలా మారుతుంది.వేటూరి సుందర రామమూర్తి ఆ మొదటి అక్షరం 'వే' లోనే ఉంది వేణువు.సుందరమయిన వేణువు లాంటి వారు ఆయన.వేణువుని ఎంత సుందరం గా పలికిస్తే అంత అందం గా పలుకుతుంది, దాన్ని వాయించే వాళ్ళని పట్టి ఉంటుంది దాని గానం.అలానే ఎవరికి ఎలాంటి పాట కావాలంటే అలాంటి పాటను అందించకల్గిన ఒకే ఒక వ్యక్తి వేటూరి గారు.రౌద్రం(ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో,మూవీ: "ప్రతిఘటన"),విషాదం(ఆకాశాన సూర్యుడుండడు సందేవేలకే,మూవీ:"సుందరకాండ"),జానపదం(జాణవులే నెర జాణవులే,మూవీ :"ఆదిత్య 369"),మెలోడి (వెన్నెలవే వెన్నెలవే,మూవీ :“మెరుపు కళలు”,మాస్(ఆ అంటే అమలాపురం,మూవీ :“ఆర్య” ),ఇలా నవరసాలను తన పాటలలో చొప్పించి మనకు అందించిన మహానుబావుడు వేటూరి సుందర రామ మూర్తి.
వేటూరి గారి పాటల కోసం ఇక్కడ  క్లిక్  చేయండి 
"అందరూ పుడతారు కొంతమంది కోసం కాని కొందరే పుడతారు అందరికోసం".వేటూరి గారు 29th January 1936 లో కొల్లూరు (తెనాలి) లో జన్మించారు,తను కలం పట్టిన దగ్గరినుండి తన పాటల ప్రవాహం తను కన్ను మూసే వరకు ఆగలేదు.తను ఆకరిగా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా మన ప్రభుత్వం(ప్రజా పథం) కోసం ఒక పాట రాసారు,కాని తనకు ఏ ప్రభుత్వం కాని,తను నమ్మిన సినిమా ఫీల్డ్ కాని తనకి ఉండటానికి ఒక సొంత ఇల్లు ని కూడా కల్పించలేకపోయారు.కాని తను చనిపొఇన తరువాత పెద్ద పెద్ద సభలు ఉపన్యాసాలు ఇచ్చారు మన వాళ్ళు."పోఇన వారు పుణ్యాత్ములు ఉన్నవారు వారి తీపి గుర్తులు" కాని వేటూరి గారి విషయం లో "పోయిన వారు పుణ్యాత్ములు మిగిలి ఉన్న ఆయన పాటలు మనకు ఎప్పటికి తీపి గుర్తులు".ఒకప్పుడు హీరో ని చూసో హీరొయిన్ ని చూసో సినిమా కి వెళ్ళే వాళ్ళు కాని కేవలం ఆత్రేయ గారి పాటల వల్లనే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయంటే అది అతిశయోక్తి కాదేమో.మాతృదేవోభవ ఈ సినిమా పాటలు విని కళ్ళు చెమర్చని వారంటూ ఉండరేమో.
ధనం కోసమే కలం పట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్న ఈ కాలం లో కుడా పయిస కూడా ఆశించకుండా ఎంతోమందికి పాటలు రాసిన గొప్ప వ్యక్తి.అలాంటి మహానుభావుడ్ని మన ప్రభుత్వం కాని సిని ఫీల్డ్ కాని ఒకింత తక్కువ చేసి చూసిందనే నా అభిప్రాయం.శారీరకం గా ఆయన మనకుదూరమయినా కాని,పాట బ్రతికి ఉన్నంత కాలం వేటూరి గారు చిరంజీవి గానే ఉంటారు.ఎలాగూ వారు ఉన్నప్పుడు వారి సొంత ఇంటి కలని నెరవెర్చలేకపోయినా కనీసం వారి ఆత్మ శాంతించే లా వారి కుటుంబ సబ్యులకన్నా ఆ అవకాశాన్ని కల్గిస్తారని, ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ఇన్ని రోజులు లేట్ అయినందుకు నన్ను నా బిజీ లైఫ్ ని దూషించుకుంటూ మనస్పూర్తి గా "వేటూరి సుందర రామ మూర్తి" గారికి నివాళులు అర్పిస్తూ………
వేటూరి గారి గురించి ఈ వీడియో ని క్లిక్ చేయండి.


.
Your’s……………………………….సతీష్. 

Saturday, May 22, 2010

గమ్యం

ఆఫీసు సీట్ లో వెనక్కి వాలి దీర్గం గా ఆలోచిస్తున్నా అర్ధం కాని ప్రోగ్రాం ని చూస్తూ.ఇంతలో ఫోన్ రింగ్ అయింది చుస్తే మా ఇంటిదగ్గర నుండి నాన్న ఫోన్ చేసారు,నాన్న “అరేయ్ మన పక్కింటి నాగేశ్వర రావు అంకుల్ మాట్లాడతారట అని ఆయనకు ఫోన్ ఇచ్చారు.అంకుల్: “బాబు బాగున్నావా",నేను : "అంకుల్ బాగున్న మీరెలా ఉన్నారు చెప్పండి అన్నాను",అదే మన రవి ఉన్నాడు కదా(అంకుల్ వాళ్ళ అబ్బాయి),వాడు ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు,వాడు హైదరాబాద్ వెళ్త అంటున్నాడు దాని గురించే నీతో ఒకసారి మాట్లాడుదామని,అదే నానా మీ కంపెనీ లో ఏమన్నా జాబ్ వాడికి కాస్త చూస్తావని".నేను:"సరే అంకుల్ చూద్దాం రమ్మనండి అని మాట్లాడి ఫోన్ పెట్టేసాను".ఒక్కసారి మళ్లీ నా సీట్ లో వెనక్కి వాలి 3years బ్యాక్(ఫ్లాష్ బ్యాక్)కి వెళ్ళాను.ఫ్లాష్ బ్యాక్ లో రవి ప్లేస్ లో నేను నా ప్లేస్ లో మా బావ.అప్పుడే కొత్తగా డిగ్రి కంప్లీట్ అయి ఊర్లో కాలిగా తిరుగుతున్న రోజులు,మా మామయ్యా వాళ్ళ అబ్బాయి(బావ)హైదరాబాద్ లో ఏదో పెద్ద జాబ్ చేస్తున్నాడు,తనకి మా పెదనాన ఫోన్ చేసి "అరేయి మన వాడు హైదరాబాద్ వస్తా అంటున్నాడు ఏదన్నా జాబ్ చూసుకోవడానికి"అని మా బావ కి కాల్ చేసాడు.అలా హైదరాబాద్ చేరాను బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను,మనసులో బావ నాకేదో జాబ్ చూసి ఉంటాడు వెళ్లి జాయిన్ అవ్వడమే ఇంటర్వ్యూ లేకుండా(మనకి ఇంటర్వ్యు అంటే భయం కదా) అనుకున్నాను..బావ నా స్టేడి డిటైల్స్ అన్ని అడిగి తెల్సుకున్నారు.
ఆ రోజు తను నాకు చెప్పిన మాటలు“నువ్వు ని కెరీర్ ని ఒక గ్రాఫ్ గిసుకో ఎవ్రీ మంత్ ఆ గ్రాఫ్ చూసుకో గ్రౌథ్ లోకి వెళ్తుందా డౌన్ అవుతుందో చూసుకో,డౌన్ అయితే ఎక్కడ ప్రాబ్లం ఉందొ చూసుకో,గ్రౌథ్ లోకి వెళ్తే ఇంకా పయికి రావడానికి ఏమి చేయాలో ఆలోచించు,నేను నీకోసం ఏదో ఒక జాబ్ ట్రై చేస్తా బట్ నీకు నువ్వు ట్రై చేస్తుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి,ఒక జాబ్ చేస్తున్న వాడికి ఆ జాబ్ గురించి మాత్రమె తెలుస్తుంది అదే జాబ్ ట్రయల్స్ వేసే వాడికి అన్ని ఆపర్చునిటీస్ గురించి తెలుస్తుంది”అని చెప్పాడు.అవి ఎంత గొప్ప మాటలో నేను మార్కెట్ లోకి ఎంటర్ అయినా తరువాత తెల్సింది.నేను ఒన్ వీక్ లో ఓన్ గా ఒక చిన్న కంపెనీ లో జాబ్ కొట్టాను,బావ కి కాల్ చేసి చెప్పాను,తను వెంటనే ఏ కంపెని పెద్దదా,చిన్నద అని ఆలోచించకుండా "గ్రేట్ అది ఇది అని నన్ను చాలా ఎంకరేజ్ చేసాడు".అప్పుడు తెల్సింది నాకు ఓన్ గా చిన్నది సాదిన్చినా దాంట్లో ఉండే ఆనందం ఎంతో.
“కోట్ల విలువ చేసే కార్ ల కంటైనేర్ ఒకటి వేరే స్టేట్ నుండి హైదరాబాద్ వెళ్తుంది దాని డ్రైవర్ ఏమి చదువుకొని వాడు(కొత్తగా డ్రైవర్ అయ్యాడు),తనకి హైదరాబాద్ ఏ రూట్ లో వెళ్ళాలో తెలీదు అప్పుడు రోడ్ పక్కన ఉన్న ఒక వ్యక్తి దగ్గర లారి ఆపి సర్ హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగాడు,అప్పుడు అతను"అలా వెళ్లి రైట్ తిరగు నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుని సాయగా వెళ్ళు"అని చెప్పాడు,అతను చెప్పినట్లు ఆ డ్రైవర్ వెళ్లి తన గమ్యాన్ని చేరుకున్నాడు”.ఇక్కడ లారి డ్రైవర్ రూట్ తెల్సిన వాడ్ని రూట్ అడిగాడే కాని అతన్ని కూడా లారి ఎక్కి తన గమ్యం వరకు రమ్మని అడగలేదు,గమ్యం తెల్సుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.చాలా మంది కొత్తగా స్టడీస్ కంప్లేట్ చేసి ముందు గా ఆలోచించేది ఇదే నాకు వాళ్ళు తెల్సు వీళ్ళు తెల్సు ఆ కంపెనీ లో చేస్తున్నారు వాళ్ళే నాకు ఏదో ఒక జాబ్ చూస్తారు(ఇంటర్వ్యుస్ లేకుండా)అనే బ్రమ లో ఉండి వాళ్లకి ఉన్న టాలెంట్ ని ఉపయోగించ కుండ వేరే వాళ్ళ మీద ఆధారపడటం లేక ఏదో ఒక బ్యాక్ డోర్ దొరుకుతున్దిలే అనే పిచ్చి ఆలోచనలతో తమ కెరీర్ ని వేస్ట్ చేసుకుంటున్నారు.
”ఒక కుర్రాడు తనకి దొరికిన ఒక పాత పేపర్ ని తనకున్నంత తెలివి తో సొంతం గా ఒక చిన్న గాలిపటాన్ని చేసి ఎగరేసుకోవడానికి సముద్రపు ఒడ్డుకి వచ్చాడు,అప్పుడే కార్ లో ఒక గొప్పింటి అబ్బాయి నాలుగు అయిదు రంగుల గాలిపటాలు పట్టుకుని(షాప్ లో వాళ్ళ నాన్న కొనిచ్చిన)వచ్చి వీడితో "చూసావా నాకు ఎగరేసుకోవడానికి ఎన్ని గాలిపటాలున్నాయో అన్నాడు(బడాయి గా),వెంటనే వీడు "చూసావా నా గాలిపటం ఎగరేసుకోవడానికి ఎంత పెద్ద ఆకాశం ఉందో,అని ఆకాశం వయిపు పయి పయికి ఎగురుతున్న తన గాలి పటాన్ని చూపిస్తూ అన్నాడు”.అలా పాజిటివ్ గా ఆలోచిస్తే దొరకిన ప్రతి చిన్న అవకాశం మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది అని ఆసిస్తూ……………………………….





Your’s…………………………..సతీష్. 

Sunday, May 9, 2010

అందని అమ్మ ప్రేమ

అందరు పుట్టిన వెంటనే ఏడుస్తారు నవ్వకుండా ఎందుకో తెల్సా "ఒక అద్బుతమయిన శక్తి నుండి మనల్ని ఎవరో దూరం చేస్తున్నారని భయం తో"ఆ అద్బుత శక్తి పేరే అమ్మ.9 నెలలు ఆ శక్తితో పెనవేసుకుని ఉన్న మన పేగు బందాన్ని ఎవరో దూరం చేస్తున్నారు అనే బాధ మనల్ని ఉగ్గపెట్టుకుని ఏడ్చేలా చేస్తుంది.మన మాటలను,అభిప్రాయాలను తెల్సుకుని మనకు ఫ్రెండ్స్ దగ్గరవుతారు,మన స్టేటస్ చూసి మనకు పార్ట్నేర్స్ ఉంటారు.కాని అస్సలు మనమేమి అవుతామో మనకి ఏ పోసిషన్ వస్తుందో కూడా తెలియని వయసునుండే మన నుంచి ఏమి ఆశించకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అద్బుతమయిన శక్తి అమ్మ.
ఎవరికి తమ దగ్గరగా ఉన్నప్పుడు గొప్ప వాటి విలువ తెలియదు,అవి మనకు దూరం అయినప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది.నేను చిన్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు,స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తున్నప్పుడు అమ్మ కొడుతూ ఉండేది(ఆ దెబ్బలు నా భవిష్యతు ని చూపే మార్గాలు అని అప్పుడు తెలియదు),అప్పుడు నేను అమ్మకు దూరం గా ఉండాలి అనుకునే వాడ్ని కాని ఇప్పుడు తెలుస్తుంది ఒక్కసారి అమ్మకు దూరం అయిన నాకు లైఫ్ లో ఇంకెప్పుడు ఆ ప్రేమకు దగ్గర అవ్వలేను అని.ఎవరు మన మీద ప్రేమ చూపించినా ఏదో ఒకటి ఆశించి మాత్రమె ప్రేమను చూపిస్తారు,అమ్మ ఒక్కతే  మనగురించి మాత్రమె ఆలోచించి ప్రేమను పంచుతుంది.నిజం గా అమ్మ కు దూరం గా బ్రతికే వాళ్ళు ఈ ప్రపంచం లో  కెల్లా పెద్ద దురదృష్టవంతులు.
మనకి ఈ రోజు ఎంతో ఆనందం కల్గినా బాద కల్గినా  ఇంటికి వచ్చి వెంటనే అమ్మ తో చెప్పాలి అనుకుంటాం కాని చెప్పుకోవడానికి అమ్మ లేదు.కొంత మందికి అమ్మ ప్రేమ ఎంత దగ్గర గా ఉన్నా పట్టిచ్చుకోరు,ఎంతోమంది అనాదలు అబాగ్యులు అమ్మ ప్రేమకు దూరమయి అనాధ ఆశ్రమాలలో రోజు అమ్మ ప్రేమ కోసం తపిస్తున్నారో.అమ్మ ప్రేమ కు దూరమయిన వాళ్లకి “మనల్ని మనకంటే ప్రేమ గా బాద్యత గా చూసే ప్రతి ఒక్కరు అమ్మ తో సమానమే” అని నా ఫీలింగ్.అన్నీఉన్నా మనమే ఏదో ఒక సమయం లో ఏదో కోల్పోయాం అని ఫీల్ అవుతాం,అలాంటిది ఏ ప్రేమ లు ఏ బందాలు లేని అనాధలు వాళ్ళ పరిస్తితి ఏంటి.వాళ్ళను వోదార్చే వారెవరు.మనం కొద్ది గా మన ప్రేమను వాళ్లకి పంచితే చాలు వాళ్ళు మనలో అమ్మ ప్రేమ ను చూసుకుంటారు.ఈ ప్రపంచం లో విలువ కట్టలేనిదేదన్న ఉంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే.ఆ ప్రేమను మనం వేరే వాళ్లకు పంచుతున్నాం అంటే అంతకన్నా గొప్ప విషయం మన జీవితం లో ఇంకేముంటుంది.మన ఈ జీవితం లో ప్రతి రోజు అమ్మ పెట్టిన బిక్షే తనని ఏదో ఒక్కరోజు తలచుకొని మిగిలిన రోజులు మర్చిపోవద్దు.

మనకి దొరికినంత సమయం లో తోచినంత ప్రేమను అమ్మ ప్రేమ కు దూరమయి ఎంతో బాదపడుతున్న అభాగ్యులకు పంచుతూ మనం కోల్పోయిన ప్రేమను వాళ్లకు అందిద్దామని ఆసిస్తూ…………………….


Your 's ..........................................సతీష్ .

Saturday, May 8, 2010

అంతం లేని యుద్ధం


17 నెలల  నిరీక్షణ(ఇది మన దేశ ప్రగతికోసం చేపట్టిన ప్రాజెక్ట్ టార్గెట్ కాదు),35 కోట్ల ఖర్చు(ఇదేమి మన దేశ భవిష్యతుకోసం కేటాయించిన బడ్జెట్ అంతకన్నా కాదు).26/11 ఈ డేట్ మన దేశం గురించి కొద్దిగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఎప్పటికి గుర్తుండిపోయే విషాదమయిన రోజు(ముంబైలో జరిగిన మారణకాండ,166 మంది మరణం).సచిన్ టెండూల్కర్ ముంబై నుండి తన పేరుని ప్రపంచం అంత చాటటానికి 17 సంవత్సరాలు పడితే,అజ్మల్ అమీర్ కసాబ్ ఈ పేరు ప్రపంచం అంతా వ్యాపించడానికి పట్టిన సమయం 17 నెలలు మాత్రమె.ముంబై లో మారణకాండ జరిగిన సాయంత్రానికే కసాబ్ ని అందరం TV లో ఫోటోల తో సహా చూసాం T షర్టు&కార్గో ప్యాంటు,వెనక ఒక బాగ్,చేతిలో పెద్ద గన్,కొద్దిలో కొద్దిగా టేరోరిస్ట్ అంటే ఏంటి అని తెల్సిన ప్రతి  వాడికి కసాబ్ ఒక పెద్ద టేరోరిస్ట్ అని ఆ రోజే తెల్సింది,కాని దాన్ని ప్రూవ్ చేయడానికి మన ప్రభుత్వానికి 17 నెలల సమయం,35 కోట్ల ఖర్చు అయిన తరువాత తెల్సింది.
మన రాజ్యాంగం ప్రకారం “వంద మంది దోషులు తప్పిచ్చుకున్నా పర్వాలేదు కాని ఒక నిర్దోషికి సిక్షపదకూడదు” ఇది మంచిపద్దతే,కాని కసాబ్ ఏమి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఖైది కాదు.ఫోటోలు,వీడియోలు,ప్రత్యేక సాక్షులు చూస్తుండగా 52 మంది అమాయకులను దారుణం గా చంపిన మృగం,క్రూర మృగం కూడా తన ఆకలి తీరగానే వేట ని మానేస్తుంది కాని ఒకటి కాదు రెండు కాదు 52 మంది ప్రాణాలను తీసిన అలాంటి మానవ మృగాన్ని శిక్షించడం కోసం ఇంత ఖర్చు ఇంత సమయం  వృధా చేయడం అవసరమా…?కసాబ్ కెమెరాలకు రెడ్ హన్దేడ్ గా చిక్కాడు కాబట్టి ఈ మాత్రం సమయం అన్న తీసుకున్నారు,అదే ఈ సాక్షాలు కూడా లేకపోతె కసాబ్ అమాయకుడు అనే తీర్పు మన మనవళ్ళు వినాల్సి వచ్చేదేమో.నాలాంటి సామాన్యుడు తెలియక “కసాబ్ ని ఎందుకు ఇన్నిరోజులు శిక్షించకుండా ఉంచారు అని అడిగితె”మన మేధావులు(అదేనండి మన ప్రభుత్వం)చెప్పేదేంటంటే“ప్రపంచ దేశాలముందు పాకిస్తాన్ ని దోషిగా నిలపెట్టడానికి ఈ కేస్ ని ఉపయోగిస్తున్నాం అని”.26/11 దాడికి ప్రత్యక్షం గా పరోక్షం గా ఎవరు కారణమో వోటు హక్కు వచ్చిన ప్రతి వాడికి తెల్సు(ప్రపంచ దేశాలకు తెలీదా?).ఈ తీర్పు తరువాత పాకిస్తాన్ కి వచ్చిన నష్టమేంటి ఇండియా కి వచ్చిన  లాబమేంటి…?ఈ 17 నెలల్లో ఉగ్రవాదులు ఇంకో దాడికి ప్లాన్ చేసి ఉంటారు తప్ప,మనం వాళ్ళమీద సాదిన్చిన్దేమి లేదు.సాక్షాల తో ఉగ్రవాది గా నిరుపించబడ్డ అఫ్జల్ గురు ని అయిదు సంవత్సరాలు గా ఊరి తీయలేక పోతున్నాం,మరి కసాబ్ ని ఏమి చేస్తారో అది మన ప్రజా ప్రతినిధులకే తెలియాలి.ఇది ఒక అఫ్జల్ తోనో కసాబ్ తోనో అంతమయ్యే యుద్ధం కాదు.
మానవ సంగాలు అంటే అర్ధం ఏంటో ఇప్పటి వరకు నాకు అర్ధం కాదు.కసాబ్ ని ఊరి తీయొద్దు క్షమాబిక్ష పెట్టండి అని అప్పుడే వాళ్ళ వోవర్ యాక్షన్ స్టార్ట్,అస్సలు వీళ్ళు పబ్లిక్ స్టంట్ కోసం ఇవన్ని చేస్తారో, నిజం గా వీళ్ళకి మనుషుల మీద ప్రేమతో చేస్తారో.ప్రేమనేదే ఉంటె 26/11 రోజు చనిపొఇన 166 మంది మానవులు కాదా.వాళ్ళగురించి ఏ మానవహక్కుల వాళ్ళు మాట్లాడరే?.విజయవాడ మనోహర్(శ్రీ లక్ష్మి హత్య)ని ఊరి  తీయండి,వరంగల్ ఆ ఇద్దర్ని(యాసిడ్ దాడిలో పాల్గొన్న)చంపడం న్యాయమే అని స్పీచ్లు ఇచ్చే ఈ సంగాలకు కసాబ్ కి  మాత్రం క్షమాబిక్ష పెట్టండి,పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ని వదిలేయండి అని అడగటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు.మనల్ని కుట్టడానికి వస్తున్న చిన్న చీమనే వదలకుండా వెంటాడి చంపుతామే అలాంటిది మన భారతమాత గుండెల మీద తన్నడానికి వచ్చిన వాడ్ని ఇన్ని రోజులు మన దేశ బద్రతలమద్య దాయటమే తప్పు.
ఉజ్వల్ నిఖం ఈ కేసు ని ఎంతో ధైర్యం గా దేశం తరుపున వాదించి గెల్చిన లాయెర్,ML.తహిల్వని ధైర్యం గా ఈ తీర్పుని ఇచ్చిన న్యాయమూర్తి.వీళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాం.కసాబ్ కి పడ్డ ఈ శిక్ష ఉగ్రవాదుల గుండెల్లో భయానికి నాంది పలకాలని,ఈ శిక్ష తో ఆ దాడిలో చనిపోయిన 166 మంది ఆత్మ శాంతించాలని  కోరుకుంటూ.దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నివాళులు అర్పిస్తూ…………

"ఈ తీర్పు ఉగ్రవాదం మీద ఆరంబమే కాని అంతం కాకూడదు అని ఆసిస్తూ..........."
Your’s…………………సతీష్

Sunday, April 25, 2010

ప్రేమంటే అర్ధం కాదు...ప్రేమిస్తే వ్యర్దం కాదు


"ప్రేమ అనేది రెండు అక్షరాలు…దానిమీద ఆధారపడ్డాయి కొన్ని జీవితాలు,
ప్రేమంటే అర్ధం కాదు,ప్రేమిస్తే వ్యర్దం కాదు".

ప్రేమ న్యూటన్స్ లా కన్నా గొప్పది,
డక్వర్త్ లూ ఇస్ ప్రాసెస్ కన్నా అర్ధం కానిది.

ఈ టాపిక్ ఆత్రేయ గారి చేతిలో పడితే మధురమయిన కవిత లా వినిపిస్తుంది,
రవి వర్మ చేతిలో పడితే అందమయిన చిత్రం లా కనిపిస్తుంది.

అస్సలు ప్రేమ అంటే ఏంటి అని ఒక బగ్న ప్రేమికుడ్ని అడిగితే  “మాటలకందని మధురమయిన అనుబూతి”అని చెప్తాడు.
అదే ఒక బాధ్యత గల మధ్యతరగతి తండ్రి ని  అడిగితే 
“యవ్వనం లో పెరిగే కొవ్వు లాంటిది”అని చెప్తారు.

ఎందుకింత వ్యత్యాసం ఇద్దరి అభిప్రాయాలలో.
"ఏ దివిలో విరిసిన పారి జాతమో" అని ఒక కవి పాడుకుంటే అలాంటి  మరో కవి "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం "అని పాడుకుంటాడు.

ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే ప్రేమ ఎప్పటికీ  గొప్పదే కాని దాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులే గొప్ప వాళ్ళా కదా అనే దానిమీద ప్రేమ ఆదారపడుతుంది.
ప్రేమలో ఎటువంటి తేడాలుండవు అది స్వచ్చమయిన రంగు,రుచి,వాసన లేనిది.
మన బాషలో చెప్పాలంటే కుల,మత,లింగ బేధాలు లేనిది ప్రేమ.

ఒక వ్యక్తి అవతలి వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరచడం ఎంత కష్టం అంటే దాని కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు,
ఎవరి ప్రేమలో అయిన అదే కీలకం.
కాని మన సినిమాల లో ఒక్క పాట తో హీరో హీరొయిన్ మద్య ప్రేమను  కల్పేస్తారు.అంతేలే సినిమా అనేది 2:30hrs టైం మాత్రమె కదా ఉండేది.

ప్రేమలో పడ్డవాడికి అక్షరాబ్యాసం లేకపోయినా ఆత్రేయలా కవితలు చెప్తాడు,
మొగలి పువ్వు లాంటి వాడు కూడా మల్లెపూవు లా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు.
పొద్దున్నే రోడ్ మీద ఎండలో తన ప్రేయసి కోసం పడి గాపులు కాచి ఆకరికి తను ఎదురుగా రాగానే తలదించుకొని వెర్రి చూపులు చూస్తాడు. ఇదంతా చూసే వాడికి పిచ్చి చేష్టల్లా కనిపిస్తుంది,
కాని అది అనుభవించే వాడికి మాత్రం ప్రపంచాన్నే జయించిన అనుభూతిని మిగులుస్తుంది.

"మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం పట్టించుకోము ,మనం ఇష్టపడే వాళ్ళు  మనల్ని పట్టించుకోక పోయినా వదిలిపెట్టం" 

పెద్ద వాళ్ళ దృష్టిలో ప్రేమంటే ట్యాంక్ బండ్ మీద,సినిమా హాళ్ళలో,పార్కుల్లో చెట్టా పట్టాలు వేసుకుని హద్దులు దాటటమే ప్రేమంటే అనే అభిప్రాయాన్ని కల్పిచ్చింది మనమే.
స్వచ్చమయిన గాలి ప్రాణ వాయువు లాంటిది,అదే గాలిలో విష వాయువులు కలిస్తే ఆ గాలి ప్రాణాంతకంగా మారుతుంది.

స్వచ్చమయిన గాలి లాంటిదే ప్రేమ కుడా,అదే ప్రేమలో  స్వార్ధం,కుళ్ళు,కుతంత్రాలు కలిస్తే మధురమయిన ప్రేమ కాస్త విషాదం గ మారిపోతుంది.
అందుకే ఈ యాసిడ్ దాడులు ఇవ్వన్ని,యాసిడ్ పోసిన వాడల్లా చెప్పే కారణం ఒక్కటే 
"నన్ను నా ప్రేమను ఆ అమ్మాయి లేక అబ్బాయి మోసం చేసారు" అని.
మోసం చేస్తే యాసిడ్ పోస్తారా? నిన్ను మోసం చేసారు అంటే అస్సలు ఆ అమ్మాయి లేక అబ్బాయి నిన్ను  ప్రేమించలేదని అర్ధం.ప్రేమలో మోసం స్వార్ధం ఉండవు.అలా అంటే మనం మన తల్లిదండ్రుల మరియు వాళ్ళ ప్రేమను ఎన్నిసార్లు మోసం చెయ్యట్లేదు,ఇలా మోసం చేసిన ప్రతి వాళ్ళ మీద యాసిడ్ పోయాలంటే మన పేరెంట్స్ కి కెమికల్ లాబ్స్ లో ఉన్న యాసిడ్ మొత్తం ఇచ్చినా సరిపోదు మన మీద పోయటానికి.
ప్రేమను పంచాలి కాని ప్రేమను ఆసించొద్దు,అలా ఆశిస్తే అది స్వార్ధం అవుతుంది తప్ప ప్రేమ కాదు. 

ఎంతో గొప్ప వ్యక్తి మదర్ తెరీసా ఆమెకు ప్రేమను పంచడమే కాని ప్రేమను ఆశించడం తెలీదు.”ఒకసారి మదర్ తెరీసా పని చేసే ఆశ్రమం కు ఒక బ్రిటిష్ రాణి వెళ్ళినప్పుడు అక్కడ మదర్ తెరీసా ఒక కుష్టు రోగి వంటిని తుడుస్తూ కనిపిచ్చిందట,అప్పుడు ఆ రాణి నాకు 100 కోట్లు ఇచ్చినా కూడా నేను ఆ పని చేయను అందట,అప్పుడు మదర్ తెరీసా నేను కుడా అంతే అన్నారట".ఆఆ మాటల్లో ఎంత నిస్వార్దమయిన ప్రేమ ఉంది.అందుకే ఎదుటి వాళ్ళని ప్రేమించే వాడు ఎప్పుడు సంతోషం గా ఉంటాడు,ఎదుటి వాళ్ళ ప్రేమను ఆశించే వాడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు.



"ప్రేమంటే అర్ధం కాదు" అనే లానే ప్రేమను ఉంచుదాం...
"ప్రేమంటే వ్యర్దం"అనేలా మాత్రం నడుచుకోవద్దు. అని ఆసిస్తూ........






ప్రేమతో……………………………..సతీష్.


Wednesday, March 31, 2010

అల్లారామ్

 "కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం,రెప్ప పాటు ప్రయాణమే ఈ జీవితం"
అన్నాడొక మహా కవి.మరి ఈ రెప్ప పాటు ప్రయాణం ఎందుకింత నరకం అనుకున్నాడు ఒక పాతబస్తీ అమాయక జీవి.
హైదరాబాద్ లో అల్లర్లు అని పేపర్ లో హెడ్డింగ్ చూసాడు ఒక పొలిటికల్ లీడర్,వెంటనే వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్స్ అందరికి కాల్ చేసి ఇంటికి రప్పించాడు,ఎందుకంటె అల్లర్లను ఆపటానికి మాత్రం కాదు,ఆ అల్లర్లను తమ పార్టీ కి ఉపయోగపడే లా ఎలా మలుచుకోవాలి,సామాన్యులను ఎలా రెచ్చ కొట్టాలి అని ఆలోచించడానికి.
ఇదే హెడ్డింగ్ చుసిన ఒక  సామాన్యుడికి మాత్రం గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయ్,ఎందుకంటె "ఉరుము ఉరిమి ఎక్కడో పడ్డట్టు",ఎప్పుడు మత గర్షణలు వచ్చినా బలి అయ్యేది సామాన్యులే కదా.
మనుషుల్లో హిందూ ముస్లిం అని మనం పెట్టుకుని మన ఈ రెప్ప పాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం.పాపం మూగ జీవులకి కులాలు మతాలూ లేవు కదా,ఎవరో కొంత మంది స్వార్ధపరులు గోశాల మీద పడి మూగ జీవులను తగలపెట్టారు.ఇలాంటి విషయం లో మాత్రం బ్లూ క్రాస్ వారు కాని రెడ్ క్రాస్ వాళ్ళు కాని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు,ఎందుకంటె అవి హిందువులవి అని ముస్లిమ్స్,తగుల పెట్టింది ముస్లిమ్స్ అని హిందువులు కొట్టుకు చస్తుంటే ఆ గొడవల్లోకి వెళ్తే మనమెక్కడ నలిగిపోతామేమో అని ఈ  బ్లూ క్రాస్ వాళ్లకి భయం పాపం.
ఎందుకు మన రాష్ట్రం లో హైదరాబాద్ లోనే మత గర్షణలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడా అన్ని మతాల వాళ్ళు కలిసి లేరా మరెందుకు ఇక్కడ మాత్రమె మత గర్షణలు జరుగుతున్నాయి.ఎందుకంటె దేశం లో ఎక్కడ లేని కుళ్ళు రాజకీయాలకు కేంద్రం మన హైదరాబాద్ కాబట్టే.హిందువుల వోట్లు పడకుండా ముస్లిం MLA గెలుస్తున్నాడా,ముస్లిమ్స్ వోట్లు పడకుండా హిందూ MLA గెలుస్తున్నాడా.ఒక్కసారి ఎందుకు ఈ పిచ్చి ఆవేసపరులు అర్ధం చేసుకోరు,ఎవరో స్వార్ధపరులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం చేసే పనులకు మతం అనే మహమ్మారిని తగిలిస్తుంటే అందులో ఆవేశం తప్ప ఆలోచన లేని పిచ్చి వాళ్ళ చేష్టలకు ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు.అంతెందుకు గోకుల్ చాట్ లో బాంబు పెట్టి వెళ్ళిన వాడికి అక్కడికి హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు అని  తెలియదా,కాని వాడు ఎవరి గురించి ఆలోచించలేదు,అంటే మారణ కాండ కి మతం తో సంబంధం లేదు,ఈ రాజకీయ నాయకులందరూ మన మంచి కోరే వారే అయ్యుంటే వీళ్ళకి ఎటువంటి స్వార్ధపూరిత ఆలోచనలు లేకుంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు నాయకులు A /C రూం లను  వదిలి బయటికి వచ్చి కలిసి కట్టుగా ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ పిచ్చి ఆవేసపరులు కంట్రోల్ అవ్వరా,పైకి అర్మి,పోలీసు అంటూ బలగాలను దించి సామాన్యుడ్ని చితక కొట్టడం,నాయకులు మాత్రం A/C రూం లలో కూర్చుని ఎవరి మతాల వాళ్ళను వారు రెచ్చ కొట్టడం  ఎందుకు.
ప్రపంచం లో ఎక్కడ లేని అటువంటి అన్ని మతాలూ కలిసి కట్టుగా ఉన్న గొప్ప గణతంత్ర దేశం మనది అని గొప్పగా చెప్పుకునే రోజులు ఎప్పుడో పోయాయి,రాష్ట్రం లో ఒక ప్రబుత్వం ఇంకొకళ్ళకి నచ్చలేదంటే ఆ ప్రబుత్వాన్ని కూల్చడానికి కూడా మత గర్షణలు లేపుతారని చరిత్ర సాక్షాల్లో ఉంది.నిన్నటి వరకు ప్రాంతీయ అభిమానం అని  కొట్టుకు చచ్చాము,అది సర్డుమనిగింది కదా అని సామాన్యుడు అనుకునే లోపు మత గర్షణలు స్టార్ట్ అయ్యాయి, ఇవి సర్డుమనిగితే ఇంకోటి.ఇదేనా రెప్పపాటు జీవితం కనీసం సామాన్యుడు ప్రశాంతం గ రెప్ప కూడా ముయాలన్న బయం గ ఉంది.మనం ముస్లిం హిందూ అని ఆలోచించే ముందు మనం మనుషుల్లా ఆలోచించం ఎందుకని,మతాలూ కులాలు అనేవి మనకి మనం కల్పించుకున్నవి,మనం సృష్టించిన వాటిని మనం  శాసించాలి కాని అవి మనల్ని శాసించ కూడదు,ఏ మతం చెప్పిన అవతలి వారికి మంచి చేయమనే చెప్తుంది కాని అన్యాయం చేయమని ఏ మతం లోను లేదు.
మనకీ మన దేశానికి ఆదర్శ వ్యక్తి అబ్దుల్ కలాం గారు,జన్మించింది ఒక ముస్లిం ఫ్యామిలీ లో,ఆయన పుట్టింది రామేశ్వరం లోని శివాలయం వీధి లో,వారి నాన్న గారు జైనులబ్దీన్ ఆ వీధిలో హిందు ముస్లిం అనే తేడా లేకుండా  అభిమానించే వాళ్ళు ఆయన్ను,అదే వీధిలో శివాలయం ప్రధాన అర్చకులు పేరు లక్ష్మణ శాస్త్రి గారు,వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు,వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కూర్చుని(వారి వారి సాంప్రదాయ దుస్తుల్లో)ఇద్దరి మతాలలోని మంచిని పంచుకునే వాళ్ళు.కలాం గారు ముస్లిం వారు అని కాని,మిగిలిన వాళ్ళు హిందువులని కాని  ఎప్పుడు కనీసం మాట కూడా జారిన రోజులు లేవు,కలాం గారికి భారత రత్న అవార్డు వచ్చిందంటే ముస్లిం క హిందూ క అని  ఎవరు ఫీల్ అవ్వలే ఒక భారత మాత ముద్దు బిడ్డ కి వచ్చిందని గర్వపడ్డాము.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప వాళ్లకు దేశానికి ఎంతో మంచి చేసిన వాళ్లకి ఎటువంటి దురుద్దేశం,మతం అనే పిచ్చి లేనప్పుడు ఏమి సాదించని మనం  కనీసం ఇంట్లో వాళ్లకి కూడా ఉపయోగ పడని మనకెందుకు ఇంత మత పిచ్చి.
రాజుల పరిపాలనలో కూడా ఏ ముస్లిం రాజు తన ప్రజలను తన మతం లోకి మారమని,ఏ హిందు రాజు ముస్లింలను హిందువుల గ మారమని గొడవలు లేపలేదు,శాసించ లేదు.మరెందుకు గొప్ప గొప్ప వాళ్ళు రచించిన రాజ్యాంగం,ప్రజా స్వామ్యం లో ఇలా జరుగుతుంది మనం ప్రజా పరిపాలనలో ఉన్నామా,పూటకి ఒక మాట మార్చే పాపాత్ముల పరిపాలనలో ఉన్నామా.....మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ మీద తిరగపడ్డ మన వాళ్ళు ఏ మతం ఏ కులం అని ఆలోచించ లేదు కలిసి కట్టుగా పోరాడారు,వాళ్ళు కష్టపడి మనకు సంపాదించి పెట్టిన దాన్ని తినేటప్పుడు మాత్రం మనం మతం కులం అని కుక్కల్లా కొట్టుకు చస్తున్నాం.

అల్లా ఎదుటి వాడ్ని నరక మన్నాడా....? రాముడు నీ పక్క వాడ్ని పొడవామన్నాడా....? "ఆలోచన ఆయుధం లాంటిది,ఆయుధాన్ని సాన పెట్టాలి,ఆలోచనని ఆచరణలో పెట్టాలి".ఒక్క సారి ఆలోచించండి,మనమేమి అన్యాయం  మీద పోరాడట్లేదు,అన్నాదమ్ముల లా కలిసి మెలిసి ఉండాల్సిన మనం స్వార్ధపరుల మాటలు విని మనల్ని మనం సర్వ నాశనం చేసుకుంటూ మన దేశాన్ని నాశనం చేస్తున్నామేమో అని నా అభిప్రాయం......

Your 's....................................సతీష్

Saturday, March 27, 2010

లోపం ఎవరిలో ఉంది

రాష్ట్రం లో యాక్షన్ సినిమా రిలీస్ అయింది,ఇందులో హీరో లేడు 294 ఆర్టిస్ట్స్ మాత్రమె.యాక్షన్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు నచ్చే వాళ్లకి ఈ సినిమా చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు(ఇది A సెర్ట్టిఫఎడ్ సినిమా).దీనికి ప్రొడ్యూసర్ ఒక్కరు ఇద్దరు కాదు 7 కోట్ల ఆంధ్రప్రదేశ్ అమాయక ప్రజలు మాత్రమె.ఈ సినిమాకి బడ్జెట్ సామాన్యుడి అంచనాలకు అందనంత.ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా ఆడేది హైదరాబాద్ లో ఒక్క దియటర్ లో మాత్రమె.ఇందులో నటించే ప్రతి పాత్ర కి ఒక గనమయన చరిత్ర ఉంటుంది.ఈ
 సినిమాని మనం బుల్లి తెర లో మాత్రమె చూడగలం..ఇంతకీ అంత గొప్ప సినిమా పేరు చెప్పలేదు కదా... అదే “అసెంబ్లీ సమావేశాలు”.
మొట్ట మొదటి సారి నేను హైదరాబాద్ మహానగరం లో అడుగు పెట్టినప్పుడు,బస్స్ లో విండో పక్కన కూర్చొని సిటీ ని చూస్తున్నాను.బస్స్ కోటి దాటింది నాకు విండో లో నుండి ఒక పెద్ద అందమయిన భవనం దాని ముందు గాంది గారి మౌనం కనిపిచ్చాయి.అదే అసెంబ్లీ అని ఎవరో పక్కనున్న వ్యక్తి చెప్తే కనుచూపు మేర దాన్నే తొంగి చూస్తూ ఉన్నాను.ఎంత ప్రశాంతం గ అందం గ  ఉంది(లోపల ఎంత బయంకరం గ ఉంటుందో తెలీదు కదా అప్పటికి),అక్కడికి మన రాష్ట్ర నాయకులందరూ వస్తారు మన భవిష్యత్తు కు బంగారు బాట వేసేందుకు అక్కడే చర్చిస్తారు అనుకున్నాను.కాని తరువాత తెల్సింది మన భవిష్యత్తు లో ఉన్న  బంగారు అవకాశాలను ఎలా దోచుకోవాలి,దోచుకున్న వాటిని కాపాడుకోవడానికి ఎలా గొడవలు పెట్టుకోవాలి అని  ఆలోచించడానికి వస్తారు అని.
మా ఊరి MLA గారు ఊరి నుండి అసెంబ్లీ సమావేశాలని 10 రోజుల ముందు హైదరాబాద్ కి వచ్చారు(మా నియోజక వర్గ ప్రజలు  మన సమస్యల మీద ఏదో చర్చిస్తారు అనే చిన్న ఆశ తో ఉన్నారనుకోండి),PA తో ఈ రోజు షెడ్యూల్ ఏంటి అనగానే PA“సర్ ఈ  రోజు మీరు అసెంబ్లీ కి వెళ్ళాలి”అన్నాడు,వెంటనే  MLA గారు అవసరమంటావా అన్నారు.PA "చాలా రోజులయింది సర్ మీరు వెళ్లి బాగోదు ఒక్కసారి వెళ్ళండి అన్నాడు.సరే వెళ్దాం అని బయల్దేరాడు.తనకి హైదరాబాద్ లో ఒక క్వార్టర్స్,తిరగడానికి 2 r 3 A/C కార్ లు రోజుకి ఎకష్త్ర కర్చులకి డబ్బులు అండ్ సెక్యురిటి ఇన్ని ఇస్తే అసెంబ్లీ కి వెళ్ళడానికి బద్ధకం.ఇక మన MLA గారు  లోపటికి ఎంటర్ అయ్యారు మొదటి గంట టీ లు,మిగిలిన MLAs తో జోక్స్ సరిపోయాయి,సభ లోకి వెళ్లారు వెనక బెంచ్ లో  గోడకి ఆనుకునే ఒక సీట్ లో కూర్చున్నారు(ఒక కునుకు తీయాలి గ మరి).ఈ లోపు మన MLA గారి వంతు వచ్చింది మాట్లాడమని,వెంటనే లేచి “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్నాను,నేను సభ ను బయికాట్ చేస్తున్నాను అని” పనికి రాణి 2 ఫైల్స్ మడిచి పట్టుకుని బయటకు వచ్చేసారు మన MLA గారు.బయట 10 మైకులు 4 కెమరా లు పట్టుకుని ఉన్న  మీడియా దగ్గరకు వెళ్లి మళ్లీ “నేను దీన్ని తీవ్రం గ కండిస్తున్న”(దేన్నీ కండిస్తున్నారో తనకి తెలీదు,అడిగిన మీడియా కి తెలీదు, చూస్తున్న మనకి తెలీదు)అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి A/C కార్ లో తన క్వార్టర్స్ కి వెళ్ళిపోయారు.మనం సిగ్గుతో తలవంచు కోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు 5yrs లో ఒక్క సారి కూడా మైక్ పట్టుకుని మాట్లాడని MLA లు,అసెంబ్లీ కి  వెళ్ళకుండా ఎగ్గొట్టే MLA లు ఉన్నారంటే మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్న మనం ఎలా  ఉన్నామో.
ఏ ఒక్క MLA అన్న తన నియోజక వర్గం గురించి కాని తన నియోజక వర్గ సమస్యలను కాని అసెంబ్లీ లో లేవనేత్తుతున్నాడా …?ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని మీరెందుకు సరిగా పని చేయలేదు అంటే,మీరు అధికారం లో ఉన్నప్పుడు చేసారా అని అడుగుతారు,అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేయరా.ప్రభుత్వం ప్రతిపక్షం మీ ఇద్దరేనా ఉంది,బయట అమాయకులయిన మా లాంటి వాళ్ళు కూడా ఉన్నాం.మా గురించి ఆలోచించ ర..?అస్సలు అసెంబ్లీ సమావేశాలు అయిపొఇన తరువాత రిసల్ట్ ఏంటి ఏమి సాదిన్చారో మన నాయకులకే తెలియాలి వాళ్ళని ఫాల్లో అవుతున్న మీడియా కే తెలియాలి కాని ఏ సామాన్యుడికి ఇప్పటి వరకు తెలీదు.
ఇలాంటి వాళ్ళ కోసమా సమావేశాలని లక్షల్లో ప్రజా ధనాన్ని కర్చు పెట్టడం అవసరమా,రాష్ట్రం లో ఎన్ని జిల్లాలలో కనీసం తినడానికి తిండి దొరక్క ఆకలి చావులు జరుగుతున్నాయి,ఏ దిక్కు లేని దీవులలో నో ఇలా జరుగుతుంది.ప్రభుత్వం నాయకులు ఉండి కూడా ఇంకా ఆకలి చావులు ఉన్నాయంటే అది సిగ్గు చేటు కాదా.లక్షల కోట్ల బడ్జెట్ లు ఎందుకు వేస్తున్నారు మీరు మీరు పంచుకోవడానిక ఆ డబ్బంతా ఎటు పోతుంది మళ్లీ దానిమీద చర్చలు ఏమి సాదిన్చారని.విదేశాల లో వాళ్ళ బడ్జెట్ లో మినిముం 9% ఆరోగ్యానికి స్పెండ్ చేస్తే మనం కనీసం 0.9% కూడా కేటాయిన్చాట్లేదు.CM పోస్ట్ అంటే ప్రజలకు సేవ చేసే ఒక అధికారం,మన నాయకులు పాపం ఎంతో సేవ  చేయటానికన్నట్లు ఆ సీట్ కోసం కొట్టుకు చస్తున్నారు,మన మినిస్టర్ ల లో ఒక్క రోజు CM అయిన చాలు అని గుంట దగ్గరి నక్క ల లా కాచుకునే వాళ్ళు ఎంతమంది లేరు,అదంతా ప్రజలికి సేవ చెయడానిక,కాదు ఒక్క రోజు CM పోస్ట్ లో  సంపాదించే డబ్బు ఒక తరానికి సరిపోతుంది అని వాళ్ళ ఆశ.
మరెందుకు మనం తెల్సి కూడా ఇలాంటి వాళ్ళను అలాంటి పవిత్రమయిన ప్లేస్ కి వెళ్ళేలా మనం అవకాశం ఇస్తున్నాం.నా ఉద్దేస ప్రకారం “మోసం చేసే వాడికన్నా మోసపోయే వాడిదే తప్పు”.ప్రతీ సారి మనం మన నాయకుల పనితీరు చూస్తూనే ఉంటాం,తిరిగి మళ్లీ వాళ్ళనే ఎన్నుకుంటాం.మన లో చాలా మంది అనుకుంటారు పోలిటిక్స్ మనకెందుకు ఎవడికో ఒకడికి ఓటు వేస్తె అయిపోద్దిలే అని ఆలోచిస్తాం.మనం మన కెరీర్ కోసం ఏ కోర్సు అయితే మంచిదో అని వంద సార్లు అలోచించి ఎనుకున్టామో,అంతకన్నా ముక్యంయింది మనం మన నాయకుడ్ని ఎన్నుకోవడం.ఈ విషయం మనకు అర్ధమయిన రోజు అసెంబ్లీ లో మైక్స్ విరగడం కాని మనం బూతులు వినడం కాని జరగదు.సజీవం గ ఉన్న మనమే ఏమి చేయలేనప్పుడు అసెంబ్లీ ముందు మౌనం గ కూర్చున్న గాంధీ గారు మాత్రం ఏమి చేయగలరు.
వేరే రాష్ట్రాల నాయకులు వాళ్ళ అసెంబ్లీ లో చెప్పులు,మైక్స్ లతో కొట్టుకుంటున్నారు,ఇంకా మన నాయకులు బూతుల తోనే సరిపెడుతున్నారు అని సంతోశిద్దామా లేక మన భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారని బాధపడదామా…?



”నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని….అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని…మారదు లోకం….(సిరివెన్నెల…గాయం)”

ఒక్కసారి ఆలోచిద్దాం లోపం ఎవరిలో ఉందొ............ 



మీ.................................సతీష్