Pages

Saturday, June 5, 2010

రేపటి పౌరులు


ఈ రోజు ఆఫీసు లో చాలా లేట్ అయింది(సమయం 12PM 03/JUNE/2010 Johannesburg (SA)),క్యాబ్ కోసం కాల్ చేసాను 15mins లో క్యాబ్ వచ్చింది,అప్పటికే చాలా అలసటగా నా కళ్ళు మూసుకుపోతున్నై.క్యాబ్లో ఎక్కి కూర్చోగానే నా కళ్ళు మత్తుగా వాలిపోయాయి సడెన్గా బ్రేక్,మెలుకువ వచ్చి చూడగానే కార్ ఆగి ఉంది.చూస్తె ట్రాఫ్ఫిక్ సిగ్నల్ రెడ్.రాత్రి 12 అవుతుంది రోడ్ మీద ఒక్క వెహికిల్ కూడా లేదు ఇక్కడ మాములుగానే 8PM దాటితే రోడ్ మీద ట్రాఫ్ఫిక్ ఉండదు,కాని క్యాబ్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ పడగానే కార్ ఆపి మళ్లీ గ్రీన్ లైట్ ఆన్ అవగానే మూవ్ అయ్యాడు.చూస్తే ఆ క్యాబ్ డ్రైవర్ అంత పెద్దగా చదువుకున్న వాడిలా కూడా లేడు,కాని ట్రాఫ్ఫిక్ రూల్స్ ఎంత చక్కగా పాటిస్తున్నాడు.నాకు వెంటనే మన హైదరాబాద్ JNTU సర్కిల్ అక్కడి ట్రాఫ్ఫిక్ మన వాళ్ళ నిబద్దత గుర్తొచ్చి నవ్వుకున్నాను.JNTU ట్రాఫ్ఫిక్ సిగ్నల్ చూస్తే అర్ధమవుతుంది అక్కడ నివసించే వాళ్ళు ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళు అందరు 90% చదువుకున్నవాళ్ళు అన్ని రూల్స్ తెల్సిన వాళ్ళే  ఎందుకంటె అక్కడ JNTU యునివెర్సిటీ దగ్గరిలో హైటెక్ సిటీ ఉన్నాయ్.సిగ్నల్ కి 10 అడుగుల దూరం లో JNTU పోలిస్ స్టేషన్ ఉన్నా కాని అక్కడ ఏ వ్యక్తి సిగ్నల్ రూల్స్ పాటించరు అక్కడ రోడ్ కూడా సరిపోదన్నట్లు పక్కన బండలు కొండల మీదనుండి కూడా వాహనాలను పోనిస్తారు(కొంత కాలం కిందట ఆ వ్యక్తుల్లో నేను ఒకడ్ని). ఇది ఒక JNTU లోనే కాదు మన దేశం లో ప్రతి సిటీ లో ఇలానే ఉంది.
ఇక్కడ ప్రజలకు(సౌత్ ఆఫ్రికా)స్వాతంత్ర్యం వచ్చి 10 సంవత్సరాలు మాత్రమె అయింది.మనకు స్వాతంత్ర్యమొచ్చి 60 ఏళ్ళు దాటింది.ఇక్కడ మనం ఈ దేశం కన్నా వెనక పడి ఉన్నాం అని నేను చెప్పదల్చుకోలేదు.ప్రపంచ పటం లో మనం సౌత్ ఆఫ్రికా కంటే  ఎన్నో అడుగుల ఎత్తులో (అభివృద్ధి లో)ఉన్నాం,కాని మన వ్యవహార శైలిలో మాత్రం వెనకబడే ఉన్నాం అని నా వ్యక్తిగత అభిప్రాయం.ఈ దేశం లో ఒక వ్యక్తి ఆదాయం నెలకు సగటుగా 3 వేలు కూడా లేదు,అక్షరాస్యత లో చాలా వెనకబడి ఉన్న దేశం కాని వ్యవహార శైలి లో ఎంతో ఉన్నత దేశం.మరి మనమెందుకు మన  వ్యక్తిగత అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నాం మన వ్యవస్థ గురించెందుకు ఆలోచించడం లేదు.
ఇలా ఆలోచించే లోపు నా అపార్ట్మెంట్ వచ్చింది క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇచ్చి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లోకి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి తన ముక్కు మొహం నాకు తెలీదు చాలా మర్యాదపూర్వకం గా విష్ చేసాడు,మనం కనీసం ముఖ పరిచయం ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చినా ముందు వాడు నవ్వి పలకరించే దాకా మనం పలకరించం(మనకి ఈగో కొంచెం ఎక్కువ కదా).ఇక్కడి వ్యక్తులు అందరు మంచి వాళ్ళు మన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కాదు.ప్రతీ దేశం లో ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి.మన దేశం అన్నా,మన ప్రజలు అన్నా,మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మన నాయకులు అన్నా బయటి ప్రపంచానికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది,ఆ అభిప్రాయాన్ని మనం పాడుచేస్తున్నామేమో అని నా అభిప్రాయం.ఇక్కడి(సౌత్ ఆఫ్రికా) ప్రజలకు స్వేచ్చ పోరాటం అంటే ఏంటో నేర్పిందే మన గాంధీ గారు,ఆ గాంధీ గారి భావాలను మనలో చాలా మంది ఎప్పుడో మర్చిపోయారు కాని ఇక్కడ వ్యక్తుల్లో చాలా  మంది ఇప్పటికి వాటిని పాటిస్తున్నారు.మన పోలిస్ లు కేసుల కి బయపడి తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు.ఒక్కసారి హైదరాబాద్ సిగ్నల్స్ లో ఒక్క ట్రాఫ్ఫిక్ పోలిస్ లేకుండా ఒక గంట చూడండి మన వాళ్ళ నిబద్దత ఎంతుందో అప్పుడే అర్ధమవుతుంది.ఎందుకు బయటి కంట్రీస్ లో ట్రాఫ్ఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక పోలిస్ కూడా కనిపిచ్చడు,మరి మనదగ్గరెందుకు సిగ్నల్స్ సరిగా పని చేస్తున్నా కాని ఇద్దరు ముగ్గురు పోలిస్ లు ఉంటారు.
"అవకాశం లేనప్పుడు తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు అవకాశం ఉండి కూడా తప్పు చేయని వాడు గొప్ప వాడు".నేను ఈ దేశం(సౌత్ ఆఫ్రికా)వచ్చే ముందు అందరు బయపెట్టారు అక్కడ Indians మీద ఎటాక్స్ బాగా జరుగుతాయి జాగర్త అని,నిజమే ఇక్కడ ఎటాక్స్ జరుగుతాయి కాని అది ఈ దేశ ప్రజలు చేస్తున్నవి కావు వేరే దేశం నుండి వలస వచ్చి ఏ పని లేక కాలీగా ఉండే వాళ్ళు చేస్తున్న పని ఇది అని ఇక్కడికి వచ్చాక తెల్సింది,వాళ్ళు చేసే ఈ పని వలన ఈ దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది.అలానే మనం చేసే తప్పుల వలన మన దేశానికి చెడ్డ పేరు రావోద్దనే నా అభిప్రాయం.జూన్ 5th ఈ రోజు నాకు ఈ దేశం లో చివరి రోజు మళ్లీ నేను ఈ దేశానికి వస్తానో లేదో తెలీదు,కాని జీవితాంతం నాతొ మిగిలి ఉండే ఎన్నో తీపి గుర్తులను మాత్రం తీసుకు వెళ్తున్నాను,కాని శాంతికి మారు రూపమయిన నెల్సన్ మండేలా గార్ని ప్రత్యక్షం గా చూడాలి అన్న నా చిన్ని కోరిక తీరకుండానే నా దేశానికి తిరిగి వెళ్తున్న అనే చిన్న బాద తో ఉన్నాను.
చిన్నప్పటి నుండి వింటున్నా మన నాయకులు చెప్తుంటారు "నేటి బాలలే రేపటి పౌరులు వారే మన దేశ భవిష్యత్తు కి బంగారు బాటలు" అని,ఆ బాలలు పెరుగుతూనే ఉన్నారు వారు కూడా మన రాజకీయ నాయకుల బాటలోనే నడుస్తున్నారు తప్ప ఎటువంటి మార్పు లేదు.నేటి బాలలు రేపటి పౌరులవుతారు నిజమే కాని వారు మన దేశ భవిష్యత్తు కి బంగారు బాట కావాలంటే ముందు మనం సరయిన బాటలో నడవాలి వాళ్ళని సరయిన బాట లో ప్రయాణించేలా చేయాలి అని ఆసిస్తూ………………………………


ఎప్పుడు మనదేశం లో అడుగుపెడతానా అనే ఆనందంతో ఊగుతూ……..






Your’s……………………………………సతీష్.


1 comment:

  1. Neti Balale Repati Kharmikulu ..ila kooda nadusthondi mana Desam lo..

    ReplyDelete