Pages

Tuesday, May 19, 2020

రెక్కలు విరిగినా డొక్కలు నిండని బ్రతుకులు...!



ప్రతి రోజు ప్రాణాలాను పనం గా పెట్టి,
కాలీ డొక్కను చేత్తో పట్టి,
ఎండకు కంది పోతున్న పసి కందులను ముందుకు నెట్టి,
బొబ్బలుడుకుతున్న పాదాల బాదలను పక్కకు నెట్టి,
ప్రతి రోజు రోడ్లన్ని వలస కార్మికుల రక్తం తో అట్టలు కట్టి పోతున్నాయి..

అర్దరాత్రి ఆడది ఒంటరి గా రోడ్ల మీద తిరిగిన రోజు మనకి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన నాయకులు చెప్పారు,
ఇప్పుడు ఒక ఆడది రాత్రి పగలు తేడా లేకుండా తనతో పాటు తన కడుపులో బిడ్డను మోస్తూ వందల మైల్లు ఒంటరిగా నడిచినా కనుచూపు మేరలో కూడా స్వాతంత్ర్యం కనిపించేలా లేదు..!

కార్మికుల స్వేదం తో ముందుకు అడుగులు వేసిన ఈ దేశం,
అదే కార్మికుల అడుగుల రక్తం తో తడుస్తూ ఎటువైపుగా నడుస్తుందో...!! 

2 comments:

  1. చావు వార్తలు నన్ను చలింపజేస్తున్నాయి...
    ఆర్థిక ఒత్తిడి కన్నా ముందు మానసిక ఒత్తిడిని అధిగమించలేక అమరులైతున్నారు...😰😭😢

    ReplyDelete