Pages

Tuesday, May 19, 2020

రెక్కలు విరిగినా డొక్కలు నిండని బ్రతుకులు...!



ప్రతి రోజు ప్రాణాలాను పనం గా పెట్టి,
కాలీ డొక్కను చేత్తో పట్టి,
ఎండకు కంది పోతున్న పసి కందులను ముందుకు నెట్టి,
బొబ్బలుడుకుతున్న పాదాల బాదలను పక్కకు నెట్టి,
ప్రతి రోజు రోడ్లన్ని వలస కార్మికుల రక్తం తో అట్టలు కట్టి పోతున్నాయి..

అర్దరాత్రి ఆడది ఒంటరి గా రోడ్ల మీద తిరిగిన రోజు మనకి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన నాయకులు చెప్పారు,
ఇప్పుడు ఒక ఆడది రాత్రి పగలు తేడా లేకుండా తనతో పాటు తన కడుపులో బిడ్డను మోస్తూ వందల మైల్లు ఒంటరిగా నడిచినా కనుచూపు మేరలో కూడా స్వాతంత్ర్యం కనిపించేలా లేదు..!

కార్మికుల స్వేదం తో ముందుకు అడుగులు వేసిన ఈ దేశం,
అదే కార్మికుల అడుగుల రక్తం తో తడుస్తూ ఎటువైపుగా నడుస్తుందో...!! 

Monday, May 4, 2020

బార్ల ముందు బీర్ల కోసం బారులు తీస్తూనే ఉంటాం..!

ఇప్పుడున్న పరిస్తితిలో మందు దుకాణం పెట్టి,
అధిక ధరలతో సామాన్యుడి జేబు కొట్టి,
ఖాళీ  అయిన ఖజానాని మధ్యం డబ్బుతో నింపి పెట్టి,
ఇన్ని రోజులు చేసిన సామాజిక దూరాన్ని గాలికి నెట్టి,
వీటితో వచ్చే కొత్త రోగులను లెక్క కట్టి,
మళ్ళీ ఖజానాని ఖాలీ చేసి పెట్టి,
ఆర్ధిక మాంధ్యం అని అమాయకుడి నోరు కొట్టి,
ప్రజలపైన పన్నుల భారం నెట్టి,
మళ్ళీ అధికారం కోసం పిచ్చి జనాల నోట్లో పచ్చ నోటు పెట్టి,
భవిష్యత్తు తరాలను అంధకారం లోకి నెట్టి నా..... బారు షాప్ ముందు బారులు తీరి ఒక బాటిల్ బీర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం...!!

మద్యం తాగినవాడు డ్రైవింగ్ కి దూరం గా ఉండాలి అని చట్టం చెసినోళ్ళు మేధావులు,
మద్యం కొనే వాడు లైన్ లో సామాజిక దూరం పాటిస్తాడు అనుకున్న మన నాయకులు మేథావులు..!