Pages

Monday, March 23, 2020

దేశ భక్తి చూపించే సమయం

చదువుకున్న మూర్ఖులం
అభివ్రుద్ది చెందిన అజ్ఞానులం
మనం గుంపులు గా తిరిగినా సమాజం భయం తో పోలిస్ కాపలా కావాలి
అస్సలు తిరగకుండా ఉండటానికి కూడా అదే పోలిస్ కాపలా కావాలి
మన జాగర్త మనం పాటించలేని అంధకారం లో ఉన్నాం.
దేశ భక్తి అంటే పరాయి దేశాన్ని దూషించడం కాదు,
నీ దేశ భవిష్యత్తు కి నీ వంతు క్రుషి చేయడం.
మన కోసం వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను పనం గా పెట్టి పని చేస్తున్నారు,
మన మూర్ఖత్వం తో లక్షలమంది జీవితాలను భయాందోలనకు గురి చేస్తున్నాము.
అన్యాయం జరిగినప్పుడు గడప దాటి రాని మనం ఈ అత్యవసర పరిస్తితిలో బయటకు రావాల్సిన అవసరం అస్సలు లేదు.
ప్రభుత్వం ఈ కుళ్ళుని కడిగే పని మొదలు పెట్టింది,
మనం చేయాల్సింది మన చేతులను కడుక్కోవడం మన కాళ్ళని నాలుగు రోజులు కట్టడి చేసుకోవడం మాత్రమే..
ఇన్ని రోజులు ఫేస్ బుక్ వాట్సాప్ ల లో చూపిచ్చిన మన దేశ భక్తి ఇప్పుడు మన దేశానికి చూపిచ్చే సమయం వచ్చింది...!

4 comments:

  1. వాడెవడో పిల్లలు పాలకూర అడిగాడని బయటకు వచ్చాడట.
    ఇంకోడు ఆశీర్వాద్ ఆటా కావాలని వచ్చాడట.
    పొట్ట భక్తి ముందు దేశభక్తి ఎంత?

    మనం ట్రాఫిక్ రూల్స్ కూడ పాటించలేం కాని,
    మనకోసం సైనికులు పాకిస్తాన్‌తో యుద్ధం చెయ్యాలని రెచ్చిపోయి వాదిస్తాం.
    ఇదీ మన దేశభక్తి.

    ReplyDelete
    Replies
    1. ఒకే బైక్ మీద ముగ్గురు నలుగురు ఎక్కి ఉన్న ఫోటోలు చూసినపుడు అనిపించింది "పోలీసులు వీళ్ళని కుళ్లబొడిచి కాళ్ళు విరగ్గొట్టినా తప్పు లేదని"

      Delete