Pages

Monday, March 23, 2020

దేశ భక్తి చూపించే సమయం

చదువుకున్న మూర్ఖులం
అభివ్రుద్ది చెందిన అజ్ఞానులం
మనం గుంపులు గా తిరిగినా సమాజం భయం తో పోలిస్ కాపలా కావాలి
అస్సలు తిరగకుండా ఉండటానికి కూడా అదే పోలిస్ కాపలా కావాలి
మన జాగర్త మనం పాటించలేని అంధకారం లో ఉన్నాం.
దేశ భక్తి అంటే పరాయి దేశాన్ని దూషించడం కాదు,
నీ దేశ భవిష్యత్తు కి నీ వంతు క్రుషి చేయడం.
మన కోసం వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను పనం గా పెట్టి పని చేస్తున్నారు,
మన మూర్ఖత్వం తో లక్షలమంది జీవితాలను భయాందోలనకు గురి చేస్తున్నాము.
అన్యాయం జరిగినప్పుడు గడప దాటి రాని మనం ఈ అత్యవసర పరిస్తితిలో బయటకు రావాల్సిన అవసరం అస్సలు లేదు.
ప్రభుత్వం ఈ కుళ్ళుని కడిగే పని మొదలు పెట్టింది,
మనం చేయాల్సింది మన చేతులను కడుక్కోవడం మన కాళ్ళని నాలుగు రోజులు కట్టడి చేసుకోవడం మాత్రమే..
ఇన్ని రోజులు ఫేస్ బుక్ వాట్సాప్ ల లో చూపిచ్చిన మన దేశ భక్తి ఇప్పుడు మన దేశానికి చూపిచ్చే సమయం వచ్చింది...!

Thursday, March 19, 2020

జబ్బు కూడా మంచిదే

ప్రపంచ దేశాల మధ్య రాజకీయ పోరు లేదు,
నేను గొప్పా నువ్వు గొప్పా అనే భేషజం లేదు,
నీ మతం నా మతం అనే పట్టింపు అస్సలే లేదు..
అనవసరపు రాజకీయ ర్యాలీలు నిరసనలు లేవు,
అవసరం లేని తిరుగుడులు లేవు,
అతి కి మించిన కాలుష్యపు జాడలు అస్సలే లేవు..
ఇన్ని రోజులు గా ఎవరు చెప్పినా పాటించని సుభ్రత,
ఏ నాయకుడూ ఏ అగ్ర రాజ్యమో తీసుకు రాని భద్రత,
ఒక కంటికి కనపడని శక్తి తో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. 
ప్రతీ మనిషికి ఇది ఒక గుణపాఠం అవ్వాలి
ఒక కులం ఒక మతం ఒక రంగు అని కొట్టుకు చఛ్ఛే మనకి ఒక భయం మనుష్యులంతా ఒక్కటే అని నిరూపించింది...!

**జబ్బు కూడా మంచిదేనేమో మన కంటికి పట్టిన మబ్బును తొలిగిస్తున్నప్పుడు**