Pages

Sunday, April 21, 2019

అధికారం అంగట్లో సరుకు

నూట ముప్పయి కోట్ల ప్రజలకు ప్రధాని అయ్యి, నేను బీసీ ని అందుకే నన్ను తక్కువగా చూస్తున్నారు అంటాడు.. 
తొమ్మిది కోట్ల ప్రజలకు ముఖ్య మంత్రి గా ఉండి, అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు.. 
తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేత గా చేస్తూ, నా మీద కేసులు పెట్టారు అంటాడు.. 
దేశాన్ని రాష్ట్రాన్ని శాశించే స్థాయిలో ఉన్న మీకే ఇన్ని ఇబ్బందులు ఉంటే , ఇక సామాన్యుడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఏ రోజు అయినా ఆలోచించారా..!
మీకు ఈ ఇబ్బందులు ఎలక్షన్స్ ఉన్న నాలుగు రోజులే వస్తాయేమో.. ఈ నాలుగు రోజులే మీరు భరించలేకపోతే ప్రతి రోజు ఇవన్నీ భరిస్తున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి..?
రోడ్ మీద తను పండించిన సరుకుని అమ్మడానికి రైతు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక అర్ధం ఉంది, కానీ అధికారాన్ని అంగట్లో సరుకు ని చేసిన మీకు ఇంత ఇబ్బంది ఎందుకో మాకు అర్ధం కావట్లే...!!😡😡😡

 మీ.......సతీష్ ధనేకుల!! 

10 comments:

  1. ఇంతకీ నువ్వు ఎవరికి ఓటు వేశావు చెప్పు.

    ReplyDelete
    Replies
    1. మీ పెరే మీరు చెప్పుకోలేక పోతున్నారు, ఇక నా ఓటు గురించి ఎందుకులే మిత్రమా..!

      Delete
  2. రాజకీయ రాజాగార్లను ఇంతగా నిగ్గదీసి ప్రశ్నించిన మీ తెగువ
    ప్రశంసనీయం . ఐనా , నిష్ప్రయోజనం . వాళ్ళకు చెవు
    లుండవు , నోళ్ళే ఉండును .

    ReplyDelete
  3. నూట ముప్పయి కోట్ల ప్రజలకు ప్రధాని అయ్యి, నేను బీసీ ని అందుకే నన్ను తక్కువగా చూస్తున్నారు అంటాడు..
    Incorrigible Souls !

    ReplyDelete
  4. ఎందరో బ్రాహ్మణులు మోదీని నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారు. ఈ మాట అనడానికి సిగ్గైనా అనిపించలేదెందుకో ?

    ReplyDelete
  5. మీ ప్రశ్న బాగుంది కాని, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి గోల వారిది.

    ReplyDelete
    Replies
    1. Adhikaaram undi kadhaa ani vaari gola mana meedha ruddhatam correct kaadhu kadha andi!!

      Delete