ముందుగా ఒకింత నిస్పృహతో అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగష్టు 15 వచ్చినప్పుడల్లా నిజం గా మూడ నమ్మకాలను నమ్మాలేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది అర్దరాత్రి అమావాస్య వలనేమో మన బ్రతుకులు ఇంకా చీకటిలోనే ఉన్నాయి. ఏ రోజు అయితే ఒక ఆడపిల్ల ఒంటరిగా అర్దరాత్రి తిరుగ గల్గుతుందో ఆ నాదే మనకు నిజమయిన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన మహాత్ముడు చెప్పారు. అర్దరాత్రి సంగతి పక్కన పెడితే మన దేశ రాజధాని నది బొడ్డులో మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్ల ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉంది.కార్పొరేట్ మాటల్లో చెప్పాలంటే ఒక ఫిమేల్ ఎంప్లాయ్ ని కాబ్ లో సెక్యూరిటీ గార్డ్ లేకుండా పంపలేని మనకి స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చినట్లా..రానట్లా..!!
"ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు."
"దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి" అన్న గురజాడ గారి మాటలు వింటుంటే బాధ గా ఉంది. ఇప్పుడు ఆ మట్టికి ఇచ్చిన విలువ కూడా తోటి మనిషికి మనం ఇవ్వడం లేదేమో. మన స్వాతంత్ర్య సమరయోధులు ఏ ఆస్తులను, ఏ పదవులను అయితే లెక్క చేయకుండా మన దేశం కోసం నిస్వార్డం గా పోరాడారో, ఇప్పుడు నాయకులు అదే ఆస్తుల కోసం అవే పదవులకోసం అమ్ముడుపోయి మన దేశాన్ని స్వార్ధం కోసం పీడిస్తున్నారు.ఈ 67 సంవత్సరాలలో నేను భారతీయుడ్ని అని గర్వం గా చెప్పుకునే దగ్గరనుండి. నేను పలానా మతం, నేను పలానా కులం, నేను పలానా ప్రాంతం అని చెప్పుకునే అంత ఎదిగిపోయాం మనం.మనిషి సృష్టించుకున్న డబ్బు, పదవుల చేతుల్లో మనిషే కీలుబొమ్మలు గా మారి మనల్ని మనమే నాశనం చేసుకుంటూ, మన దేశాన్ని కూడా నాశనం చేసే అంత డెవలప్ అయ్యాం.
"పోరాటాల ఫలితాలను వృధా చేస్తూ..
ధన దాహాలకు చేతులు చాస్తూ..
కుల మతాలకు చిచ్చులు పెడుతూ..
అధికారానికి ఆరాటపడుతూ..
రోజు రోజు కి మ్రుగాలలా మారుతూ..
బానిస బ్రతుకలకు మళ్ళీ బాటలు వేస్తూ..."
సిరివెన్నెల గారు అన్నట్లు "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా..!!"
మీ...................సతీష్.
No comments:
Post a Comment