ఒకప్పుడు పురాణాలలో చదువుకున్నాము "దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని చిలికి చిలికి అమృతం కోసం పోటి పడ్డారని". మల్లి ఈ కలికాలం లో చూస్తున్నాము "మద్యం కోసం ప్రబుత్వాలు ప్రజలు కొట్టుకు చస్తున్నారని". ఒకప్పుడు మద్యం వద్దు అని ప్రజలు, మద్యం కావాలని ప్రభుత్వాలు కొట్టుకునే వాళ్ళు కాని ఇప్పుడు ఇద్దరూ కలిసి దానికోసమే కొట్టుకు చస్తున్నారు. ఇక మన పురాణం లోకి వెళ్తే ఆకరికి దేవతలు ఏదో మాయ చేసి అసురులను పిచ్చోల్లని చేసి వాళ్లకి హ్యాండ్ ఇచ్చి దేవతలే అమృతాన్ని కొట్టేసారు. అలానే ఇప్పుడు కూడా ఓపెన్ లాటరీ ద్వారా మద్యం టెండర్స్ అని చెప్పి ప్రజలను ఊరించి ఆకరికి మద్యం నిషేదించాలి అని చెప్పే మన ఆడవారితోనే మద్యం టెండర్స్ వేసేలా చేసారు. ఈ పిచ్చి జనాలను కొట్టుకు చచ్చేలా చేసి లాస్ట్ కి మన నాయకుల బినామీలకే టెండర్లు వచ్చేలా చేసుకున్నారు. సో మద్యం టెండర్స్ దక్కినందుకు నాయకులను దేవతలు అందామా లేక కొట్టుకు చచ్చి ఆబాసు పాలు అయినందుకు ఈ పిచ్చి జనాలను అసురులు అందామా...?
మన వాళ్ళు మందు కోసం ఎంత దిగాజారుతున్నారు అంటే ఇల్లు గుల్లా..వొల్లు గుల్లా అయినా పర్లేదు అన్నట్లు తయారయ్యారు.ఒకప్పుడు తాగి తాగి రోగం వచ్చి చస్తామేమో అనే భయమన్న ఉండేది, కాని ఇప్పుడు పరిస్తితి అలా లేదు..జబ్బు ఉన్న లేకపోయినా లక్షల బిల్లు వేసి(మనకి కాదులెండి మన ప్రభుత్వానికి) ఏదో ఒక ట్రీట్మెంట్(ఆరోగ్య శ్రీ లో) చేసే హాస్పిటల్స్ చాలానే ఉన్నాయ్ గా...సో తాగినా త్వరగా పోములే అన్న ధైర్యం బాగా వచ్చేసింది.(మందు అలవాటు ఉన్నోడికి ఆరోగ్య శ్రీ పథకం వర్తించదు అంటే ఎలా ఉంటుందో...!)
ఉగాండా లాంటి కొన్ని వెనకపడ్డ దేశాలలో తిండి దొరక్క ప్రజలు షాప్స్ మీద పడి లూటీ చేస్తుంటారు అని మనం అప్పుడప్పుడు చదువుతుంటాము..కాని ఈ రోజు మన దేశం లో మన రాష్ట్రం లో నెల్లూరు లో మన వాళ్ళు మద్యం దుకాణాల మీద పడి ఎవరికీ దొరికినన్ని వాళ్ళు మద్యం బాటిల్స్ ని ఎత్తుకెళ్ళారు ఆని టీవీ లలో చూపిస్తుంటే మనం ఎంత దిగాజారిపోతున్నామో అర్ధమవుతుంది. ఒకప్పుడు ఏ రాజకీయ పార్టీ నో ఏ రాజకీయ నాయకుడో సాసిస్తున్నాడు మనల్ని అనుకునే వాళ్ళం కాని ఇప్పుడు మనల్ని మన ప్రభుత్వాలను మద్యం అనే మహమ్మారి శాసించే స్టేజి కి దిగాజారాము.
నా చిన్నప్పుడు ఎవరన్నా మందు తాగుతాను అని చెప్పుకోడానికి సిగ్గుపడే వాళ్ళు, కాని ఇప్పుడు మందు అలవాటు లేదు అని చెప్పాలంటే సిగ్గుపడాల్సిన పరిస్తితికి మన సమాజం వచ్చింది. 18 సంవత్సరాల లోపు వాడికి మందు అమ్మొద్దు అని చెప్తారు గాని.. అస్సలు మందు ఎందుకు అని చెప్పరే...? మందు తాగి డ్రైవ్ చేస్తే నేరం అంటారు గాని..అస్సలు బార్ షాప్స్ కి పార్కింగ్ ఎందుకు పెడుతున్నారో చూడరే...? మందు నిషేదిస్తే మన ప్రభుత్వ ఆర్దిక వ్యవస్థ పడిపోతుంది అని ఆలోచిస్తారు తప్ప...ఈ మందు వల్ల ఎన్ని కుటుంబాల ఆర్దిక వ్యవస్థ చిన్నాబిన్నం అవుతుందో చూడరే...?
ఆర్దిక వ్యవస్థను చక్కపెట్టుకోడం చేతకాక అడ్డ దారుల మీద ఆధారపడుతున్న ఈ చేతకాని ప్రభుత్వాలకు సిగ్గు రాదు....వాళ్ళు చూపే అడ్డ దారుల్లో నడుస్తున్న మనకు అస్సలే బుద్ధి రాదు.
తాగని వాడు గాడిద అనే సామెత పోయే కాలం ఎప్పుడు వస్తున్దో అని వేచి చూస్తూ.....మీ సతీష్.

yes you are right.
ReplyDeleteIs it chilled beer or child beer?
ReplyDeletekastephali gaaru అది chilled beer ఏ అండి....వ్యంగ్యం కోసం అలా పెట్టాను.
ReplyDeleteమంచి పోస్ట్... మొన్నీమధ్య ఇక్కడ కూడా ఈ తాగుడు మీద ఒక సంఘటన జరిగింది .
ReplyDelete16TH birthdy party లో drinks సెర్వ్ చేసారు. ఆ birthday పార్టీ లో ఉన్నదంతా 16-20 వయస్సులో ఉన్న teenagers/young adults ఎక్కువ. ఒక 19 years అమ్మాయి వెళ్ళి drinks ఎందుకు సెర్వె చేసారు ఇంత మంది young adults ఉండగా..అది appropriate కాదు కదా అని అడిగితే, మనమంతా fusion generation, దdrinking సరైన limit లో తాగితే తప్పు కాదు అంటూ lectures వచ్చాయి. ఒక 19 year old కి ఉన్న sense పెద్దవాల్లెవ్వరికి lEdanDi.
పైగా ఎమన్న అంటే, cultural changes, తప్పు లేదు అంటూ lectures!
thanks అండి ,బాగా చెప్పారు జలతారువెన్నెల గారు..కొంత మంది తల్లిదండ్రులే తమ పిల్లలను తాగామని ప్రోత్సహిస్తున్నారు.
ReplyDeleteWell said..
ReplyDeleteThanks Jyoti gaaru...
ReplyDelete