Pages

Wednesday, June 20, 2012

ఊ కొడతారా ఉలిక్కి పడతారా..


ప్రాణం పోయాక పరువు కాపాడుకోవడానికి ఉలిక్కి పడి లేస్తుంది మన ప్రభుత్వం............
నడి రోడ్ మీద మన ప్రాణాలు ఈ రోజే కొత్తగా రక్తమోడుతున్నాయా.........?
హైదరాబాద్ లో వర్షాలు కొత్తగా కురుస్తున్నాయా.......?


ఒక షిర్డీ బస్సు ప్రమాదం మన ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసినట్లుంది. ఈ రోజే కొత్తగా మన అధికారులకు నియమ నిబంధనలు గుర్తుకొచ్చాయి... ఒక్క రోజులో 45 బస్సులు సీజ్ చేసారు అని న్యూస్ లో చూసి మన అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో అని హ్యాపీ గా ఫీల్ అవ్వాలో లేక ఇన్ని రోజులు ఇన్ని బస్సులు నియమ నిబందనలకు విరుద్దం గా మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ఎవరూ పట్టిచ్చుకోలేదని బాధ పడాలో అర్ధం కావట్లే...! ఖమ్మం జిల్లాలో మూడు నెలల క్రితం స్కూల్ బస్సు ప్రమాదానికి గురయినప్పుడు రెండు రోజులు హడావుడి గా స్కూల్ బస్సుల మీద చర్యలు ప్రకటిచ్చింది మన ప్రభుత్వం. ఇక నిన్న జరిగిన షిర్డీ బస్సు ప్రమాదానికి ఉలిక్కి పడి ప్రయివేట్ ట్రావెల్స్ మీద దాడులు మొదలు పెట్టారు. అంటే విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే మన నాయకులకి తెలంగాణా గుర్తోచినట్లు రోడ్ మీద ఆక్సిడెంట్ లో ఎవరో ఒకరు చనిపోయిన రోజే మన ప్రభుత్వానికి మన అధికారులకు చట్టాలు గుర్తోస్తాయేమో......

ఇక మన మీడియా సోదరులకు ఒక వారం రోజులు పండగ..మన లైఫ్ టైం తగ్గుతుంటే వాళ్ళ TRP రేటింగ్ పెరుగుతుంది అన్నట్లు చేస్తున్నారు వీళ్ళు. డేంజర్ జర్నీ, బస్సు ఎక్కితే అంతేనా..? ఇలాంటి టైటిల్స్ పెట్టి కొన్ని రోజులు టైం పాస్ ప్రోగ్రామ్స్ చేసి తరువాత పనికి రాణి చెత్త లా పక్కన పడేస్తారు. పెద్దలు చెప్పినట్లు మన బంగారం మంచిదయితే గోల్డ్ స్మిత్ ని అనడం ఎందుకు...!  మన ప్రబుత్వ  బస్సులను ప్రజలకు అనుకూలంగా నడిపితే ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎందుకు పుట్టుకొస్తాయి...ఆక్సిడెంట్  లు అయ్యే అంత బిజీ ఎందుకు అవుతాయి..


ఇంక మన GHMC వాళ్ళ దగ్గరికి వస్తే... ఈ సంవత్సరమే కొత్తగా హైదరాబాద్ లో వర్షాలు వచ్చాయా...! అన్నట్లు చేస్తున్నారు మన GHMC వాళ్ళు. ఒక్క రోజు వర్షం కురిస్తేనే మన ట్రాఫిక్ అస్తవ్యస్తం గా తయారయితే...అదే ఒక పది రోజులు వరసగా కురిస్తే మన పరిస్తితి ఏంటి...! ఎప్పటికప్పుడు పాక్షిక చర్యలు చేపట్టి వర్షాకాలం అవ్వగానే చేతులు దులుపుకుంటారు మన అధికారులు. లాస్ట్ ఇయర్ మనం ఈ వర్షాల వలన ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నామో మన ప్రభుత్వాలకు గుర్తు లేదా...! మల్లి వర్షాకాలం వచ్చింది కాని ఎటువంటి మార్పులు లేవు ఏ చర్యలు లేవు. వీళ్ళ లాంటి వాడే ఒకడు "వర్షం పడ్డ రోజే ఇల్లు కట్టాలి అంటాడట..తెల్లారితే మళ్ళీ మామూలే"  ఇలా ఉంది మన GHMC పని కూడా..


ప్రబుత్వ పరువు పోతే దాన్ని మల్లి వెనక్కి తీసుకు రావొచ్చు కాని..ప్రజల ప్రాణాలు పోతే మాత్రం తీసుకు రాలేము అని ఈ చేతకాని ప్రబుత్వాన్ని, ఈ చేతకాని అధికారులను హెచ్చరిస్తూ...ఊ కొడతారో లేక ఉలిక్కి పడి లేచి సరయిన చర్యలు తీసుకుంటారని ఆసిస్తూ.......... మీ సతీష్                                                                        

Saturday, June 16, 2012

ఎవడ్రా మల్లీ ఎన్నికలు పెట్టింది...


               
 
 
పబ్లిక్ నమ్మనందుకు చంద్రబాబు నీళ్ళు లేని బావిలో దూకడం మంచిది.....
అలానే జగన్ ని నమ్మినందుకు పబ్లిక్ వెళ్లి అదే బావిలో దూకడం మంచిది.
 
ఎవడు దోచుకోలేదని...వీడు దోచుకుంటే తప్పా....(పిచ్చి జనాల అభిప్రాయం)
మనం మారము మన నాయకులను అస్సలే మారనివ్వము.
 
 
నీ భలం చూపిచ్చుకోడానికి కొండల్ని బండల్ని తవ్వు...అంతే గాని ఎలక్షన్స్ పేరుతో జనాల గుండెలను తవ్వకు.
 
ఒకప్పుడు ఎన్నికలు అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేవి...కాని ఇప్పుడు ప్రతి పండగ కి ఒకసారి వస్తున్నాయి.
 
 
ఎన్నికల ముందు నాయకుడు ప్రతి రోజు నీ ముందే ఉంటాడు. ఎన్నికల తరువాత గూగుల్ సెర్చ్ లో కూడా దొరకడు.
 
 
బిసినెస్ లో లాభం కోసం టెండర్లు వేస్తారు....అలానే ఎన్నికలలో గెలవడానికి డబ్బులు పంచుతారు....
అధికారం = బిసినెస్
 
 
ఎన్నికల ముందు తమ జేబుల్లో నుండి పంచడానికి మన నాయకులకు మనసు వస్తుంది కాని...
గెలిచిన తరువాత మన డబ్బులు(ప్రబుత్వ ఖజానా అంటే ప్రజలదే గా..) మనకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు.
 
 
గొర్రె కసాయోడ్ని నమ్మడం...మనం మన నాయకులను నమ్మడం తప్పదేమో......
 
 
 
బర్రె ఉన్నది పాలు ఇవ్వదానికి........మన బుర్ర ఉన్నది అప్పుడప్పుడు కాస్త ఆలోచించడానికి అని ఆసిస్తూ........మీ సతీష్.