Pages

Sunday, February 7, 2010

సంతోషం.......... ఎక్కడ దొరుకుతుంది???

                              
            సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఒకడు ఒక స్వామి దగ్గరికి వెళ్లి స్వామి "నాకు సంతోషం కావాలి" అని అడిగాడు, వెంటనే స్వామి నాయన నీకు సంతోషం కావాలా, అయితే నువ్వు అడిగింది ఒకసారి మళ్లీ చెప్పు అన్నాడు స్వామి. "నాకు సంతోషం కావాలి" అన్నాడు, వెంటనే స్వామి "నాకు" అంటే స్వార్ధం, "కావాలి" అంటే కోరిక ఈ రెండిటి మద్య "సంతోషాన్ని" బందించావు నాయన దాన్ని బయటికి తీయాలంటే ముందు ఈ స్వార్ధం, కోరిక లను  నీ లోనుండి బయటికి పంపు అని చెప్పాడు స్వామి. నిజం గ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది Correct అనిపిస్తుంది,. మనలో చాలా మంది ఇలానే నేను సంతోషం గ లేము అని అనుకున్తున్టాము కదా, మనలో ఉన్న ఈ స్వార్ధం, కోరికలను పక్కకు నెట్టి చూద్దామా సంతోషం గ ఉండగలమేమో.
ఒక్కసారి ఈ  రోజు పడుకునేముందు ఆలోచించండి నిద్ర లేచిన దగ్గరనుండి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఈ రోజు మనం నవ్వామో(మనసుపూర్తిగా సుమ). గుర్తొచ్చింద ఎన్ని సార్లు నవ్వారో లేక్కపెట్టుకున్నారా మీరు ఎన్ని సార్లు నవ్వారో కరెక్ట్ గ లేక్కపెట్టుకున్నారంటే మీరు నిజం గ HAPPY గ ఉన్నట్లు కాదు, మనం ఏ రోజయితే లెక్కకి అందనన్ని సార్లు నవ్వామంటే ఆ రోజు నిజం గ మనం చాలా హ్యాపీ ఉన్నట్లు.

                                    అస్సలు సంతోషం అంటే ఏంటి నాకు తెలిసినంత వరకు "మనం ఎదుటి వాళ్ళకు కొద్దిగా పంచితే మనకు వాళ్ళ దగ్గరినుండి మనం పంచిన దానికి వందరెట్లు వచ్చేదే సంతోషం". మరి మనం ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము?. పొందలేక కాదు ముందు తెల్సుకోలేక పోతున్నాము, మన చుట్టూ కొంతమంది చుడండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మనం ఎందుకు అలా లేము అని ఆలోచించామా ఎప్పుడన్నా లేదు కదా, అలా ఎందుకున్నారంటే వాళ్ళు వారు చేసే ప్రతి పనిలో సంతోషాన్ని చూస్తున్నారు.Friends లైఫ్ అనేది ఒక ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్ అంటే మన age లిమిట్ 70 yrs మాత్రమే అందులో ఇప్పటికే ఒక quarter  అయిపోయింది కదా ఇంకా ఉన్న ఈ కొద్ది లైఫ్ నీ ఎందుకు బాధ, కోపం, ద్వేషం అనే వాటితో వేస్ట్ చేసుకోవడం చెప్పండి,ఒక్కసారి నవ్వుతు అద్దం లో Face చూసుకోండి మనం ఎంత గ్లామర్ గ కనిపిస్తాం కదా. నాకు తెల్సిన చిన్న చిన్న విషయాల ద్వార సంతోషాన్ని ఎలా ఎలా పొందాలో చెప్తాను మీకు నచ్చితే పాటిచ్చండి లేకపోతె మీకు తెల్సిన విధం గ మీరు సంతోషాన్ని పొందండి నాకు కూడా  చెప్పండి కే నా....

                          ఉదయం నిద్ర లేవగానే మీ పాలబ్బాయి లేక మీ పనిమనిశో కనిపిచ్చింది వాళ్ళతో ఒక రెండు నిముషాలు మాట్లాడండి మనసుపూర్తిగా ఎలా ఉన్నావ్ అని పలకరిచ్చండి అప్పుడు వాళ్ళ కళ్ళలో  సంతోషం చూడండి దాంతోనే ఈ రోజు మీ సంతోషం START అయిన్దనమాట, మీ అమ్మ గారు మికేదన్న చేసిపెడితే ఎప్పుడు ఉప్పు తక్కువుంది కారం తక్కువుంది అంటాం కదా ఈ రోజు వంట ఎలా ఉన్న సరే అమ్మ చట్ని  చాలా బాగుంది అని చిన్న compliment ఇవ్వండి అమ్మ లోపల సంతోషం తో ఎంతో ఫీల్ అయి ఇంకో ఇడ్లీ తింటావ నాన్న అంటుంది,నాన్న ఎక్కడికో బిజీ గ బయటికి వెళ్తున్నారు వెంటనే మీరు ఎదురుగా వెళ్లి ఈ షర్టు లో మీరు చాలా బాగున్నారు అనండి ఎంతో బిజీ గ టెన్షన్ తో ఉన్న అయన పేస్ ఒక్కసారిగా సంతోషం తో వెలిగి పోతుంది ఇది చాలదా మనకు. సరే ఇంకా కాలేజి or ఆఫీసు కి వెళ్ళాము అక్కడ బాస్ వేసే కుళ్ళు జోక్స్ కి కస్టపడి నవ్వేధానికన్న మన ఆఫీసు లో ఉన్న ఆఫీసు BOY  తో అతని కష్టసుఖాల గురించి కాఫీ తాగుతూ మాట్లాడండి, అతన్ని చెప్పనివ్వండి మీరు వినండి ఎంత సంతోషం గ చెప్తునాడో చూడండి, ఎంత మంది మనలో మన తాతయ్య తో గాని అమ్మమ్మ ల తో గాని ఎంత టైం Spend చేస్తున్నాము? రోజు సాయంత్రం ఒక పది నిముషాలు వాళ్ళ పక్కన కుర్చుని మాట్లాడండి వాళ్లకు ఎంత హ్యాపీ గ ఉంటుందో చూడండి. ఇదంతా మన చుట్టూ ఉన్న సంతోషం కాదా ఎందుకు సంతోషం కోసం చాలా మంది చాలా కర్చు పెట్టి లాఫ్ఫింగ్ క్లబ్స్ కి వేల్తుంటారో  నాకర్ధం కాదు, ఫ్రెండ్స్ ఇదంతా కొంతమందికి సిల్లీ గ అనిపిస్తుంది కదూ, కాని ఇది  నిజం మన చుట్టూ ఉండే వాళ్ళని మర్చిపొఇ మనం మన సంతోషానికి దూరం అవుతున్నాం అని నాకు అనిపిస్తుంది.........మరి మీరేమంటారు.....???





Your's.............satish.

2 comments:

  1. yes nuvvu cheppindi nijam sattibabu aksharala nijam nee e praytnaniki na joharlu

    ReplyDelete