
ఒంటరి.. అవును, నేను ఒంటరి నే...
నువ్వు నా చెంత ఉండి కూడా ఒంటరినే అనే భావన కలిగినందుకు అవును నేను ఒంటరినే...
అవసరానికి మనం, ఆహ్లాదానికి మాత్రమే మన బంధం అని భావిస్తే.. అవును నేను ఒంటరినే...
దేహం దగ్గరగా.. మనసు దూరంగా..! అవును నేను ఒంటరినే...
ఎడారిలా నా మనసు, ఎండమావిలా నీ ప్రేమ.. అవును నేను ఒంటరినే...!
ఒక చిన్ని ఆశ నీ శ్వాసగా నేను మారాలని, నీ ఊపిరయి జీవించాలని. అది దురాశ అని తెలియగానే అవును నేను ఒంటరినే...!
అవును నీతో నేను ఒంటరినే, కానీ కాదు నాతో నేను...!