Pages

Thursday, August 23, 2018

మానవ వైపరీత్యం

ప్రకృతి వైపరీత్యాల కన్నా మానవ వైపరీత్యాలే భయానకంగా మారాయి..!
ఒక రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంటే, వారు మన మతం, జాతి కాదు అని చంకలు గుద్దుకుంటున్నాం.. 
మనం రూపాయి సాయం చేయం కానీ అవతలి వాడు అంతే ఇచ్చాడు వీడు ఇంతే ఇచ్చాడు అని అపహాస్యం చేస్తున్నాం.. 
మనకి నచ్చిన వాడు విరాళం ఇస్తే పదిరెట్లు ఎక్కువ చెప్పుకుంటున్నాం.. 
అదే నచ్చని వాడు చేస్తే ఏ స్వార్థం తో చేసాడో అని పేర్లు పెడుతున్నాం.. 
ప్రకృతి ప్రళయాలకు బాధ పడుతున్నామా.. లేక మన నీచ మానవ బుద్ధి ని బయటపెడుతున్నామా..!

కుదిరితే ఒక చేత్తో సాయం చేయి, కుదరకపోతే మౌనం గా ప్రార్ధన చేయి అంతే కానీ ప్రతీది రాజకీయం మాత్రం చేయకు...!!