మూగపోయిన గొంతుకకు ఈ రోజే మాటలెందుకు వచ్చినట్లో...
సినిమా వాల్ పోస్టర్స్ చూసి జబ్బలు చరిచే నాకు, facebook వాల్ మీద కామెంట్ చేసే దైర్యం ఎందుకొచ్చినట్లో..
నాకోసం తప్ప ఆలోచించని నాకు, ఒక్కసారిగా దేశం గురించి బాధ ఎందుకు పుట్టుకొచ్చినట్లో..
నా సమస్య తప్ప ఏదీ పట్టని నేను, సామాన్యుడి సమస్యల గురించి ఆలోచిస్తున్నానెందుకో ..
ఈ రోజు చేసే పనిని పది రోజులు పొడిగించే నాకు, ఒక్కరోజులోనే దేశం మార్చాలి అనే ఆశ ఎందుకో..
దేశాన్ని పట్టించుకోని నాయకుడిని అస్సలు పట్టించుకోని నాకు, ప్రయత్నించే వాడిని ప్రశ్నించాలి అనే ఆత్రుత ఎందుకో..
నా పిచ్చి స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ధైర్యం లేని నాకు, ఒక మంచి ఆశయానికి ఆటంకం కలిగించాలనే కోరిక ఎందుకో..
ప్రశ్నించాలనే ఆతృత ఉన్న నాకు, సమాధానం వినే ఓర్పు కూడా ఉండాలని ఆసిస్తూ...
మీ ....... సతీష్
ప్రేమకు రెండు హృదయాలను దగ్గర చేసే శక్తి మాత్రమే ఉంది..!కలిపే శక్తి లేదు...!!
-------కలిస్తే అవి హృదయాలెందుకు అవుతాయి.
బంధం ఇద్దరివ్యక్తులను మాత్రమే దగ్గర చేయగలుగుతుంది..!వ్యక్తిత్వాలను కాదు...!!
--------ఒక్కటి అయితే అవి వ్యక్తిత్వాలెందుకు అవుతాయి.
నీ యద లోతుల్లో భారాన్ని నింపుకొని ఉంటె....! ఇక ఆనందానికి తావెక్కడిది...!!
నీకు నువ్వు సరిహద్దులను గీచుకు కూర్చుంటే..! ఇక స్వేచ్ఛకు దారెక్కడిది...!!
అప్పుడు, మనసులోని అలలు నీ మాటలలో పోటెత్తుతాయి.. కంటిలోని కలలు కన్నీరుగా కరిగిపోతాయి...
నాకు నువ్వు అర్ధం కావట్లేదు అనడం అవివేకం.. ముందు నీకు నువ్వు అర్థమైతేనే కదా..!
నిన్ను నువ్వు ప్రేమించు.. ఆ తరువాతనే ఏదన్నా ఆశించు.
ప్రేమను పంచితే వచ్చే ఆనందం కొండంత, కానీ దానిని ఆశిస్తే వచ్చేది రవ్వంతే...
నీ మనసు అనే నీ ప్రతిబింబాన్ని నువ్వు చూడకలిగితే..! ఇక నీకేది ప్రతిభంథం కాబోదు...
ఇది నిజం.. ఇది నిజం.. ఇది నిజం.. ఎవరు ఏమన్నా... ఎవరు కాదన్నా... ఇది నిజం. నీకు నువ్వు మాత్రమే నిజం...!
మీ....... సతీష్.
మనిషి.... ఓ పెద్ద మనిషీ....!
రెండున్నర గంటల సినిమా కథ కాదు ఇది.. డెబ్బయి సంవత్సరాల అవినీతి...
అరవై సంవత్సరాల నిరీక్షణ కాదు ఇది.. ఒక అర్ధరాత్రిలో వచ్చిన మార్పు...
గతానికి భలి అయ్యావు, ప్రస్తుతానికి బందీనని భావిస్తున్నావు, భవిష్యత్తుకు సమిధనొక్కటి ఆహుతినివ్వలేవా...!!!
దేశానికి పట్టిన బురద కడుగుతున్నందుకు సంతోషించకుండా, ఆ కడిగిన బురద చినుకులు నీ మీద పడుతున్నందుకు బాధ పడుతున్నావా..!!
ఎవరో రావాలి, ఏదో చేయాలి అన్ని మారాలి అని వేచి చూసావు ఆ రోజు..! కానీ ఆ మార్పు తట్టుకోలేకున్నావు ఈ రోజు..!!
అమ్మ పేగు భంధాన్ని తెంచుకొని రావడానికి తొమ్మిది నెలలు వేచి చూసావు, కానీ అవినీతి దుర్గంధాన్ని తుడిచి పెట్టడానికి కనీసం తొమ్మిది రోజులు వేచి ఉండలేక పోతున్నావా..!!
వెయ్యి మయిళ్ల ప్రయాణమయినా ఒక్క అడుగుతో ప్రారంభం అన్నట్లు.. ఒక్క అడుగు ప్రయాణానికే వెయ్యి సమస్యలా..!!
మన దేశంలో చొరబడ్డ తెల్లవాడిని తరిమి కొట్టడానికే మన వాళ్లకే తొంబై ఏళ్ళు(1857-1947) పట్టిందే ... ఇక మన నర నరాల్లో పాతుకు పోయిన అవినీతిని పారదోలటం అంత సులభమా మిత్రమా..!!
We want free money in elections..!
We expect freebies from government..!
We always looks for the single magic that will totally change everything...!
But,
We don't want to take any risk for our country..!
We post free comments in social network..!
We don't follow any rules..!
We give free statements in front of Tv..!
We don't raise our voice when corruption happened...!!
మంత్ర దండం నుండి రాదు మార్పు... దానికి కావాలి కాస్త ఓర్పు.
అని ఆసిస్తూ మీ......... సతీష్.