Pages

Saturday, February 22, 2014

ఈ "మత్తు భవిష్యత్తు" కి వదలాలని...




ఒక సమస్యకు పరిష్కారం దొరికిందేమో అని ఆనందించే అవివేకం కన్నా, ముందు రాబోయే ఎన్నో సమస్యలగురించి  ముందే కాస్త జాగర్త పడటం వివేకమేమో...! ఎన్నో పోరాటాలకు, భలి దానాలకు ఒక ఫలితం దక్కింది  అనడం కన్నా... కొంతమంది  కుటిల రాజకీయ నాయకులకు అవకాశం దక్కింది అనడం సమంజసమేమో....!!  
 
ఒక్కొక ఏరియా నాయకుడు తమ తమ ఏరియా లో 10 r 15 yrs నుండి MLA’s గ ఉంటారు,మళ్లీ "మా ఏరియా వెనకబడ్డది"అంటారు అంటే ఈ 10 సంవత్సరాలనుండి మీరు ముందుకి వెళ్తూ(ప్రజల సొమ్ము ని దండుకుంటూ) మీ ఏరియా ని వెనక్కి నెడుతున్నారు,మీ ఏరియా వెనకబడుతుంటే మీ ఆస్తులెలా పెరుగుతున్నాయో ప్రజలకు అర్ధం కావట్లే....చైనా లో ఒక మంచి సామెత ఉంది.“ఒక వ్యక్తికి ఒక్కరోజు కడుపు నింపడానికి చేపల కూర పెడితే సరిపోదు అదే వ్యక్తికి ఒక వల(నెట్) ని ఇస్తే వాడి జీవితాంతం జీవనోపాది కల్పించిన వాడివవుతావ్"అని.కాని మన నాయకుల దగ్గర elections వచ్చినప్పుడు మన జనాలు ఓటు కి 100 తో త్రుప్తి పడే అంత కాలం మనం మన ఏరియా వెనక పడుతూనే ఉంటుంది.

నాకు తెలంగాణా ఆంధ్ర కలిసి ఉండాలా విడిపోతే మంచిదా అని మాట్లాడే అంత knowledge లేదు. కాని ఏది మంచిదో మేధావులు అందరు కలసి కూర్చుని సామరస్యం గ తేల్చుకోవచ్చు కదా ఇంత గొడవలు చేసి సాదిచిన్దేముంది,మన ఆస్తుల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప,పూర్వం ముర్ఖం గ రాజులు యుద్హాలు చేసి సాదించింది ఏముంది,ప్రజాస్వామ్య దేశం మనది.బుర్ర లతో తేల్చుకోవాల్సిన విషయాన్ని పెప్పర్ స్ప్రే ల తో తేల్చుకొన్నారేమో అని నా ఫీలింగ్…ఏ ఏరియా వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ...కొంతమంది స్వార్ధం కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకోవద్దని నా ఉద్దేశం.


ఎందుకు విడిపోవాలో ఎందుకు  కలిసుండాలో  కలిసుంటే వచ్చే సమస్యలేంటో విడిపోతే వచ్చే లాభాలేంటో కలిసి చర్చించి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పే ఒక్కనాయకుడు కూడా లేకుండా పోయే. ఒకడు కలిసుండాలి అని పెప్పేర్ స్ప్రే లు కొడితే ఇంకొకడు విడిపోవాలని మైక్ లు విసురుతాడు తప్ప సమస్యల మీద ఏ ఇద్దరు ఒక గంట సేపు చర్చించుకున్న రోజే లేదు.  వీళ్ళా రేపు మన భవిష్యత్తు కి బంగారు బాట వేసేది....!!
 
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ఎవరికి వారు ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకం గా పోరాడాలి. స్వార్ద ప్రయోజనాలకోసం చేసే బంద్ ల ను దీక్షలను మనమే స్వచ్చందం గా బహిష్కరించాలి మనల్ని పావులుగా చేసే ఈ చదరంగం లో మనమే పోరాడాలి.మనల్ని మన సమాజాన్ని బాగు చేయకపోయినా కనీసం నైతిక విలువలను కోల్పోకుండా చూసే బాద్యత మన మీద ఉంది… మనం చదువుకున్న ఈ చదువులు మనం బ్రతుకుతున్న ఈ స్వేచ్చ ని మన భవిష్యత్తు తరాలకు అందేలా చూడాలి, అంటే మనం ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి.గొర్రెల లా ఈ నాయకుల వెనుక నిలబడకుండా మనిషి లా ఆలోచిద్దామని ఆశిస్తూ…… మీ   SATISH DHANEKULA.