Pages

Sunday, September 15, 2013

ప్రశ్నిస్తే తప్పా……?


రాజకీయాలలో ప్రతి MLA తన వారసులను ఇంకో MLA చేయాలనుకుంటాడు, ప్రతి CM తన కొడుకిని నెక్స్ట్ CM గా చూడాలని అనుకుంటాడు. కాని ఏ పార్టీ కార్యకర్త కుడా తన కొడుకుని ఇంకో కార్యకర్తగా చూడాలి అనుకోడు. రాజకీయమంటే సేవ అదొక వరంగా చెప్పుకునే మన నాయకుల ఆలోచన ల లో ఇంత తేడా ఎందుకో మరి… MLA అయినా కార్యకర్త అయినా ఇద్దరు రాజకీయ నాయకులే కదా..! కాని ఇద్దరి ఆలోచనలలో ఇంత తేడా ఎందుకు. ఎందుకంటే MLA నో మంత్రిగా నో లేక CM గానో ఉంటె ప్రజల సొమ్ముని అడ్డంగా దోచుకోవచ్చు, ఈ దోచుకునే వారసత్వాన్ని వేరే వాళ్లకి పోనివ్వడం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది చెప్పండి. అదే కార్యకర్త అయితే పార్టీ జెండా మోసి మోసీ బుజాలు కాయలు కాయటం తప్ప ఒరిగేదేమీ లేదు..ఆ బాధని తమ వారసులకు వద్దు అనుకోడంలోనూ తప్పు లేదు గా.

ఒక తల్లి తన బిడ్డని అందలం ఎక్కించడానికి తను ఎన్ని త్యాగాలు చేసినా తప్పు లేదు కాని, కన్న  తల్లి లాంటి దేశాన్నే ముక్కలు చేయాలనుకోవడం చాలా బాధాకరమ్. ఇన్ని రోజులు బుజాలు కాయలు కాసే లాగ మిమ్మల్ని  మోసిన ఈ పిచ్చి జనాల బుజాలనే మీరు నరకాలనుకోవడం మూర్కత్వం కాక ఇంకేమిటి....!! ఒక్కసారిగా ఆ పిచ్చి జనాలు ఎదురు తిరిగేలోపు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితికి వచ్చారు మీరు.  వెనకటికి ఎవడో తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కున్నాడట అలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి. ఒక్కసారిగా ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మిమ్మలను ప్రశ్నిస్తే తప్పా....!! 

ఒక ఇంటిలో ఇద్దరు అన్నా తమ్ముడు ఉన్నారు, వాళ్ళిద్దరికీ కలిపి 10 ఎకరాలు బూమి ఉంది. ఇద్దరు విడిపోదామని ఊరి పెద్ద దగ్గరకు వెళ్తే, 10 ఎకరాలను  పంచడం చాల కష్టం గా ఉంది 8 ఎకరాలును పెద్దమనిషి అయిన నాకు వదిలేసి మిగిలిన రెండు ఎకరాలను సమానం గా చేరికొకటి తీసుకోండి అన్నట్లు ఉంది మన ఢిల్లీ పెద్దల బాగోతం. వాళ్ళ కు రావాల్సిన MP సీట్స్ ని లెక్కలు కట్టి మన మధ్య పంపకాలను మొదలేశారు తప్ప ఏది మంచో ఏది చెడో అని ఏ ఒక్క క్షణం ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుని మనల్ని భళి పశువుల్లా ఆడిస్తుంటే మింగలేక కక్కలేక చస్తున్నారు మన నాయకులు. కుక్కల్లా మనకు కాపలా కాయాల్సిన ఈ నాయకులు ఢిల్లీ లో వేసే బిస్కట్లకోసం సొల్లు కార్చుకుంటూ ఇళ్లు వదిలేసి తిరుగుతున్నారు.... ప్రజలు రోడ్లు ఎక్కారని మీరనుకుంటున్నారు, కాని మీ బ్రతుకులను రోడ్లమీద కు ఈడ్చే రోజులు దగ్గరకి వచ్చాయి అని తెలుసుకోమని హెచ్చరిస్తూ.......... 

మీ.................................................. సతీష్.