పరువు కోసం నీతి లేని పంచాయితి
తొలకరి వానలు మొదలయ్యాయి... ఏటా ఈ టైం కి పచ్చని పొలాలతో, రైతులు రైతు కూలీలతో హడావుడి గ ఎంతో ఆనందం గా ఉండే పల్లెటూర్లు... ఈ సంవత్సరం మాత్రం పార్టీ జండాలతో, పనికి రాని పౌరషాలతో రణరంగం గా తయారయ్యాయి. దీనికి కారణం పంచాయతి ఎన్నికలు కావడం, నిన్న మొన్నటి దాకా అన్నదమ్ముల లా ఉన్న , కలిసి కాలక్షేపం చేసే ఇరుగు పొరుగు ఈ ఎన్నికల పుణ్యమా అని బద్ధ శత్రువలలా మారారు. ఆకరికి వరదలు వచ్చి పంటపొలాలు మునిగిపోయినా పట్టిచుకోకుండా తమ పార్టీలను గెలిపిచ్చుకోవడానికి పిచ్చోల్లలా తిరుగుతున్నారంటే పౌరశం ఏ పీక్స్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పదిమందికి పట్టెడన్నం పెట్టేవాడు నాయకుడు ఒకప్పుడు....
పదిమందికి పచ్చనోట్లు పంచేవాడే నాయకుడు ఇప్పుడు.
నాయకుడు జనాలకు నోట్ లు బాగా అలవాటు చేసాక, జనం వాడికన్నా నోట్ కి విలువేక్కువ ఇవ్వడం మొదలయింది. ఒకప్పుడు నాయకుడు జనాలను మోసం చేసేవాడు ఎలక్షన్ టైం లో, కాని ఇప్పుడు జనం నాయకుడ్ని మోసం చేయడం మొదలు పెట్టారు...!
ఇప్పటి వోటర్ ఫార్ములా ఏంటో తెల్సా...!!
ఆ పార్టీ దగ్గర తాగు, ఈ పార్టీ దగ్గర తాగు...
వాడి దగ్గర మనీ తీసుకో, వీడి దగ్గర మనీ తీసుకొ....
వోట్ మాత్రం వేస్తే వేసుకో.... లేకపోతే మూసుకొని పడుకో.
ఇలా ఉంది వోటర్ పరిస్థితి. గతం లో పలానా వర్గం పలానా పార్టీ కె వోట్ వేస్తారు అనే నమ్మకం ఉండేది, కానిఇప్పుడు ఎవడు మందు/మనీ ఇస్తే వాడికే వోట్. అలా అని తక్కువ మందు/మనీ ఇచ్చే వాడ్ని వదలరు వాడి దగ్గర తింటారు తాగుతారు. ఒక్క వ్యక్తి అన్నా గుండె మీద చేయి వేసుకొని తన ఇంటి ముందుకి వచ్చే నాయకుడితో " నేను మీరిచ్చే మందు/మనీ ముట్టుకోను" అని చెప్పగలవాడు కరువయ్యాడు అంటే అతిశయోక్తి కాదేమో.
ఈ రోజు నీ క్యారక్టర్ ని ఒక క్వార్టర్ కి,
నీ వోట్ ని ఒక నోట్ కి అమ్ముకుంటే,
రేపు నీ మాట కి చోటు ఉండదని తెల్సుకో.....
సరే ఊర్లో ఉండే వాళ్ళు చదువుకోలేదు, లోక జ్ఞానం లేదు అనుకుందాం, కాని ఆ ఉరి నుండి కస్టపడి చదువుకుని పెద్ద పెద్ద పొసిషన్స్ లో ఉన్న వాళ్ళ గురించి ఏమనుకోవాలి...!! ఇప్పుడు ప్రతి ఉరి నుండి ఒకల్లో ఇద్దరో విదేశాలలోనో, మహా నగరాల లోనో వెళ్లి అక్కడ ఒక మంచి ఉన్నత స్థాయి లో ఉన్నారు. అలాంటి వాళ్ళు తమ ఉరిలో ఏదన్నా సమస్య వస్తే తిరిగి చూసే వాళ్ళ సంక్య చాల తక్కువ, కాని ఈ నీతిలేని పంచాయతి ఎన్నికలకు మాత్రం తమ కుల/వర్గ పార్టీలకు అక్కడి నుండి ధన బలాన్ని అందించడానికి మాత్రం వెనకాడటం లేదు. అస్సలు మన జనాలు ఏ మార్గం లో నడుస్తున్నారు.....వాళ్ళతో పాటు మన సమాజాన్ని ఎటు తీసుకు పోతున్నారో అర్ధం కావట్లేదు....!!
మన నాయకులు ఎలాగూ మారరు, కాని ప్రజలకు పట్టెడు అన్నం పెట్టె రైతుఅన్న కూడా ఈ నీతి లేని పంచాయతి ఎన్నికలలో పౌరశాలకు పోయి పాడవ్వద్దు అని ఆశిస్తూ......