ఒకప్పుడు నలుపు తెలుపు అని మనుషులను విడి విడి గా చూసేవారు... తరువాత అదే మనుషులు నల్ల ధనం తెల్ల ధనం అని దోచుకోడం మొదలు పెట్టారు. ఈ బ్లాక్ అండ్ వైట్ మన జీవితాలలో కొత్తేమి కాదు, వస్తూ పోతూనే ఉంది. కానీ ఈ మధ్య తెర మీదకు ఏ రంగో తెలీని కొత్త రంగు ఒకటొచ్చి పడుతుంది. ఆ రంగే రాజకీయం. ఎండకు ఎండి.. వానకు తడిచి రాజకీయ పార్టీ జెండా రంగు మారే లోపే మన నాయకులు తమ తమ పార్టీ రంగులు మార్చడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఒక ఉద్యోగి గొప్పగా చెప్పుకునే వాడు, నేను అన్ని కంపెనీలలో పని చేసాను నాకు అంత అనుభవం ఉంది మీరెంత ప్యాకేజ్ ఇస్తారు అని డిమాండ్ చేసేవాడు. కాని ఇప్పుడు ప్రజా సేవ అని గొప్పలు చెప్పే మన నాయకులకు కూడా ప్యాకేజ్ ల సంస్కృతి వచ్చిన్ది. నేను అన్ని పార్టీలు మారాను నేను ఇన్ని స్కాములు చేసాను మీ పార్టీ లోకి వస్తే నాకెంత నా కొడుకికి ఎంత ప్యాకేజ్ ఇస్తారు (ప్రజా సేవ చేయడానికి) అని డిమాండ్ చేసే రోజులోచ్చేసాయి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలి అని మన పెద్దలు చెప్పినట్లు. ఎలక్షన్స్ వచ్చే ముందే ఆఫర్స్ వెతుక్కోవాలి అని మన నాయకులు కొత్త నీతులు చెప్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తప్పు అని చెప్పే నాయకులే తము కాస్త మేత్తపడగానే తమ తమ వారసులను తలో దిక్కు అన్నట్లు స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలలో ఒక్కొక్కల్లను సెట్ చేస్తున్నారు. గతం లో ఒక IT జాబ్ రావాలంటే బెంగుళూరు వెళ్ళరా అక్కడికి వెళ్లి ట్రై చెసుకొ.. అక్కడయితే చాలా కంపెనీస్ ఉన్నాయ్ ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అని చెప్పుకునే వాళ్ళు. కాని ఇప్పుడు ఇండియా లో డబ్బున్నోడు ఎవడన్నా పోలిటిషియన్ అవ్వాలంటే AP వెళ్ళరా అక్కడ సందుకో పార్టీ ఉంది ఏదో ఒక పార్టీ లో సీట్ ఇస్తారు వాళ్ళే కర్చు కుడా పెడతారు. అని చెప్పే దుస్థితికి మన రాష్ట్రం వచ్చింది అంటే అతిశయోక్తి కాధెమో..
దానికి తోడు పార్టీ కి ఒక చానెల్ ఉంది ఫ్రీ పబ్లిసిటి. ఇష్టం ఉన్నోడ్ని లేపి బంజారహిల్ల్స్ లో పెడతారు.. ఇష్టం లేనోడ్ని బోరబండలో వేసి తొక్కుతారు, ఇది మన మీడియా కి ఉన్న భలం. మూడ నమ్మకాలను నమ్మొద్దు అని ప్రగల్బాలు పలికే అవే న్యూస్ చానల్స్ మూడు గంటల పాటు అంతరాలు తంత్రాలు అని ఎడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. అది చూసి ఏడవాలో నవ్వాలో అర్ధం కాదు...! ఒక సెలబ్రిటీ మీద ఉన్న ఫోకస్ ఒక సామాన్యుడి మనుగడ మీద ఉండదు. ఒక హీరొయిన్ ఎఫ్ఫైర్ మీద ఉన్న ఆత్రుత మన యువత భవిష్యత్తు మీద ఉండదు మన మీడియా కి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వీళ్ళకు మామూలే గా..
సరే మనమేమన్నా తక్కువ తిన్నామా అంటే అదీ లేదు... మా కుల నాయకుడు, మా ఏరియా నాయకుడు, మా హీరో, మీ హీరో అని సిగ్గు లేకుండా గుడ్డలు చించుకుని రోడ్ల మీద తిరుగుతూ.. వాళ్ళ చేతిలోనే ఆకరికి దెబ్బలు తింటాం. ఏ బందులు లోనయినా.. ఏ ఆడియో ఫంక్షన్స్ లోనయినా.. ఆ నాయకులకు కానీ, ఆ హీరోలకు కానీ షర్టు నలుగుతుందా..? లేదు, కానీ మనకు మాత్రం వీపు పగులుతుంది. నువ్వు కరెక్ట్ గా ఉంటె నీ నాయకుడు రంగులేందుకు మారుస్తాడు.. రంగు నోటు ఎటు ఉంటె నువ్వు కుక్కలా అటు వస్తావని నాయకులు నమ్మినంత కాలం నీకు రంగు పడుతూనే ఉంటుందని అని హెచ్చరిస్తూ.....
మీ....... సతీష్.