మాస్క్ ఇదేదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా అనుకుంటున్నారేమో కాదండి.
మన ప్రభుత్వం సొంతంగా నిర్మించి ఆడిస్తున్న...ఆడించబోతున్న రియల్ సినిమా ఇది.
మన హైదరాబాద్ మొన్నటివరకు వర్షాలకు తడుస్తూ..వరదలతో మునుగుతూ ఎంత నరకం చుపిచిందో మనకి తెల్సు.
కాని సడన్ గా పది రోజుల్లోనే మయిమరిచిపోఎలా
అయింది. ఈ హైదరాబాద్ ఏనా మొన్నటివరకు చిన్న జల్లు పడినా రోడ్లు అస్తవ్యస్తం గా మారింది అనిపించింది. ఒక్కసారిగా కొత్త ప్రపంచం ల తయారయింది, సారీ తయారవ్వలేదు ఒక మాస్క్
తొడుక్కుని మళ్ళీ సారీ...తొడుక్కోలేదు ఒక మాస్క్ కప్పబడింది అంతే.

నా చిన్నప్పుడు మా ఉరికి ఎవరన్న మంత్రులు వస్తున్నారంటే అప్పటిదాకా
నిద్రపోతున్న పంచాయితీ వాళ్ళు ఒక్కసారిగా లేచి కంపు కొట్టే రోడ్స్ ని
ఊడ్చి తెల్లటి బ్లీచింగ్ పౌడర్ తో నిమ్పేసేవాళ్ళు. మంత్రులు వెళ్ళిపోగానే
ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఎప్పటి రోడ్స్ అప్పట్లానే మళ్ళీ
తయరయ్యేయి. అప్పుడు అనిపిచ్చేది రోజు మంత్రి గారు ఉరికి వస్తే ఎంత
బావుండేది అని. మళ్ళీ ఆ రోజులే గుర్తోస్తు ఉన్నాయ్
ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తుంటే మొన్నటి వరకు చిన్న వర్షం పడిందంటే ఆఫీసు నుండి ఇంటికి చేరడానికి 15
నిముషాలు పట్టే రోడ్ కుడా ట్రాఫిక్ తో నిండిపోయి నాలుగు అయిదు గంటలు
పట్టేది.
అప్పుడు ఇంతమంది పిచ్చి జనాలు ఇబ్బందులు పడ్డా ఎ నాయకులు గాని ఏ ప్రభుత్వాలు గాని పట్టిచ్చుకోలేదు.

అప్పుడు నేను అనుకునే వాడ్ని పాపం గవర్నమెంట్ దగ్గర కుడా డబ్బులు లేవేమో లే ఏమి చేస్తార్లే వాళ్ళయినా మనమే
అడ్జస్ట్ అవ్వాలి అని. కాని ఒక్క వీకెండ్ గ్యాప్
తరువాత ఆఫీసు కి వెళ్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేక,
మా కాబ్ డ్రైవర్ ని అడిగా.. మనం కరెక్ట్ రూట్ లోనే వేల్తున్నామా అని.
ఎందుకంటే అంతలా మారిపోయి మా ఆఫీసు కి వెళ్ళే రోడ్లు, డ్రయినెజ్ లు.
రెండు రోజుల క్రితం లేని రోడ్లు,
చెట్లు ఎక్కడనుండో తీసుకోచి పెట్టినట్లు మారిపోయాయి. మరి ఇప్పుడు
ఇంత సడన్ గ ప్రభుత్వాలకు ఇన్ని రోజులు లేని నిధులు
ఎక్కడనుండి ఊడి పడ్డాయా అనిపిచ్చింది. ఏంటి ఈ వింత అని చూస్తే , జీవ
వైవిధ్య సదస్స్( BIO DIVORSITY CONFERNCE ) హైదరాబాద్ లో
జరగబోతుంది అని తెల్సింది.

అంటే ఏవన్నా మీటింగ్స్ జరిగినప్పుడు లేక గొప్ప గొప్ప వాళ్ళు
వచ్చినప్పుడే మన వాళ్లకు ఈ లేని పోనీ హంగులు గుర్తొస్తాయి, కాని రోజు
చస్తూ బ్రతుకుతూ ఇక్కడే ఉంటున్న జనాల ఇబ్బందులు మాత్రం వీళ్ళకు
కనిపించవు. అయినా "మింగటానికి మెతుకు లేదు గాని...మీసాలకు
సంపెంగ నూనె కావాలి " అన్నట్లు, మనకి ఉన్నదీ మనం చుపిచుకోవాలి
కాని సదస్సులు అయ్యే ఈ నాలుగు రోజులు మన హంగు చుపిచుకోవడానికి
ఈ హడావుడి ప్రయత్నాలు ఎందుకో...? జీవాలను పట్టిచ్చుకోవద్దు , బయటి
దేశాల మధ్య మనల్ని మనం తక్కువ చేసుకోవాలి అని నా ఉద్దేశం కాదు.
జీవాలతో పాటు ఇక్కడ రోజు ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితి ని
కూడా ఆలోచించాలి అని నా ఉద్దేశం. ఇవే పనులు ఇంత హడావుడి గా
నాణ్యత లేకుండా చేయడం కన్నా ఎప్పుడో ప్రజలు ఇబ్బందులు
పడుతున్నప్పుడే చేసి ఉంటె అటు ప్రజలకు ఇటు ప్రపంచ దేశాల
ప్రతినిధులకు ఇద్దరికీ ఉపయోగపడేవి గా...!

ముందు "ఇంట గెలిచి, తరువాత రచ్చ గెలవాలి" అని మన పెద్దలు చెప్పారు
కాని. మన ప్రభుత్వాలు ఇటు ఇంట గెలవలేక, అటు రచ్చ గెలవలేక
హడావుడి గ ఏదో చేస్తున్నాము అనే ఈ ముసుగు వేసుకుని ఎన్నాళ్ళు
పబ్బం గడుపుదాము అనుకుంటున్నాయో అర్ధం కావట్లే. ఇక మన పోలీసు
వ్యవస్థ ని ఖయరతాబాద్ గణేష్ నిమజ్జనానికో లేకపోతే ఇలాంటి
సదస్సులకు వచ్చే VIP ల సెక్యూరిటీ కి తప్ప సామాన్యుడికి
ఉపయోగపడేలా తయారు చేయట్లే మన ప్రభుత్వం. మూగ జీవాలను
కాపాడుకోలేక ఫ్లయిఓవర్స్ గోడలపయిన వాటి బొమ్మలు వేసి
ఆనందపడుతున్న మన ప్రభుత్వాలను చూసి సిగ్గుతో తల
దిన్చుకోవాలనిపిస్తుంది.
"పరువు కోసం పాకులాడకుండా.....ప్రజల అవసరాల కోసం పాటుపడే ప్రభుత్వాలు" కావాలని ఆసిస్తూ......మీ సతీష్.