భయం....
స్టూడెంట్ కి భయం..........ఎగ్జాం పోస్ట్ పోన్ అయిద్దేమో అని.
షాప్ వాడికి భయం..............బందు ఎక్కడ చేస్తారేమో అని.
వరుణ్ మోటర్స్ కి భయం......బందు లో కార్లు పగలకొడతారని.
RTC కి భయం................బస్సులు తగల పడతాయో అని.
అమాయకుడికి భయం......ఎక్కడ తగలపెడతారేమో అని.
గొడవలో ముందున్న వాడికి భయం................లాటి తో తల ఎప్పుడు పగిలిద్దో అని.
పోలీసు కి భయం.................రాయి ఎక్కడ తగిలిద్దో అని.
జనాలకు భయం..........ట్రాఫిక్ జామ్ అయితదేమో అని.
ప్రభుత్వానికి కి భయం...............ఏ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలో అని.
దేవుడికి భయం................ఇది రాక్షస యుద్ధమని.
మీడియా కి భయం.................గొడవ చల్లారి పోద్దేమో అని.
గొడవ ఇదేదో తెలుగు సినిమా పేరు లా ఉంది కదా............ ఆ సినిమా ఫ్లాప్ అయినా మన రాజకీయ నాయకులు ఆడించే ఈ సినిమా మాత్రం మన రాష్ట్రం లో సూపర్ డుపెర్ హిట్ అవుతుంది మీడియా వారి సహకారం తో. రాత్రి TV ముందు కూర్చుంటే న్యూస్ ఛానల్ లో స్టూడెంట్స్ రోడ్ల మీదకు వచ్చి ఆస్తులు ద్వంసం చేస్తూ గొడవలు చేస్తున్నారు అని వస్తుంది. మా పెద్దమ్మ అప్పుడు నాతొ ఏంట్రా వాళ్ళు స్టూడెంట్స్ యేనా ఎప్పుడూ చూసిన ఈ మద్య రోడ్ల మీద గొడవలు చేస్తూ కనిపిస్తున్నారు, మరి ఎప్పుడు చదువుకుంటారు అని అడిగింది. నిజమే కదా ఈ ప్రశ్నకు జవాబు ఏమి చెప్పాలో అర్ధం కాక ఛానల్ మార్చేసాను.
ఓ... అమాయక విద్యార్ది నువ్వెందుకు రోడ్ ఎక్కుతున్నావో నాకు అర్ధం కావట్లేదు, ఎలెక్షన్ లో వోట్ అనే ఆయుధాన్ని నువ్ తప్పుగా ఉపయోగించినప్పుడే ని భవిష్యత్తును రోడ్ కి ఈడ్చేలా చేసుకున్నావ్, అది చాలదు అన్నట్లు నీ చదువును కూడా వదిలేసి నీ బ్రతుకుని నువ్వే నడి రోడ్ లో బలి చేసుకుంటున్నావ్. ఎందుకు నువ్వు చద్దామనా లేక నీకు లాంటి ఇంకో అమాయక పిచ్చోడ్ని చంపుదామనా.....? . గీత లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు "చంపేది ఎవరు... చచ్చేది ఎవరు" నువ్వే కదా. ఒకసారి నువ్వు ని వోట్ తో ఒక నాయకుడ్ని ఎన్నుకున్నావంటే వాడే నీ తరుపున నీ సమస్యల మీద పోరాడాలి కాని వాడ్ని A/C రూముల్లో పెట్టి నువ్వెందుకురా వాడికోసం రోడ్ ఎక్కుతావు....? నిన్న తెలంగాణా వాళ్ళు ఈ రోజు సీమఆంద్ర వాళ్ళు ఎవరయితే ఏంటి వీళ్ళందరూ మన దేశ భవిఒస్యత్తు ని తీర్చి దిద్దాల్సిన వాళ్ళే కదా . ఏ నాయకుడయినా వీళ్ళకోసం పోరాడుతున్నాడా.. ఏ నాయకుడయిన పోలీసు లాటిలను ఎదుర్కుని నీకోసం పోరాడుతున్నడా... ? మరెందుకు అలాంటి చేత గాని వాళ్ళ కోసం నువ్ గుడ్డలు చిమ్పుకున్టావ్....? వాడు ఎలెక్షన్ లో నిలబడ్డప్పుడు ఏమయింది నీ పిచ్చి ఆవేశం. మన దేశ సంపదను లక్ష ల వేల కొట్లలో దోచుకున్తున్నప్పుడు ఏమయింది నీ కోపం. అప్పుడు రాలేదా నీకు ఆవేశం....లేక అవన్నీ మనకు సంబందించినవి కావు అనుకుని వదిలేసావా లేక మనకి ఒరిగేదేన్టిలె అనుకున్నావా......? ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీకెందుకింత ఆత్రమో. నాయకుల వలలో పడి నీ భవిష్యత్తును తీరని కలగా మార్చుకోకు.
అని ఆసిస్తూ...............................................................
యువర్'స ........................................................................................సతీష్.