పిచ్చోడి చేతిలో రాయి అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు,అదే రాయి ఒక కార్మికుడి చేతిలో పడితే ఒక గొప్ప కట్టడం లా తయారవుతుంది,ఒక శిల్పి చేతిలో పడితే అందమయిన శిల్పం లా మారుతుంది.అదే రాయి మన వేటూరి గారి కలం లో పడితే సుందరమయిన పాటలా మారుతుంది.వేటూరి సుందర రామమూర్తి ఆ మొదటి అక్షరం 'వే' లోనే ఉంది వేణువు.సుందరమయిన వేణువు లాంటి వారు ఆయన.వేణువుని ఎంత సుందరం గా పలికిస్తే అంత అందం గా పలుకుతుంది, దాన్ని వాయించే వాళ్ళని పట్టి ఉంటుంది దాని గానం.అలానే ఎవరికి ఎలాంటి పాట కావాలంటే అలాంటి పాటను అందించకల్గిన ఒకే ఒక వ్యక్తి వేటూరి గారు.రౌద్రం(ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో,మూవీ: "ప్రతిఘటన"),విషాదం(ఆకాశాన సూర్యుడుండడు సందేవేలకే,మూవీ:"సుందరకాండ"),జానపదం(జాణవులే నెర జాణవులే,మూవీ :"ఆదిత్య 369"),మెలోడి (వెన్నెలవే వెన్నెలవే,మూవీ :“మెరుపు కళలు”,మాస్(ఆ అంటే అమలాపురం,మూవీ :“ఆర్య” ),ఇలా నవరసాలను తన పాటలలో చొప్పించి మనకు అందించిన మహానుబావుడు వేటూరి సుందర రామ మూర్తి.
"అందరూ పుడతారు కొంతమంది కోసం కాని కొందరే పుడతారు అందరికోసం".వేటూరి గారు 29th January 1936 లో కొల్లూరు (తెనాలి) లో జన్మించారు,తను కలం పట్టిన దగ్గరినుండి తన పాటల ప్రవాహం తను కన్ను మూసే వరకు ఆగలేదు.తను ఆకరిగా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా మన ప్రభుత్వం(ప్రజా పథం) కోసం ఒక పాట రాసారు,కాని తనకు ఏ ప్రభుత్వం కాని,తను నమ్మిన సినిమా ఫీల్డ్ కాని తనకి ఉండటానికి ఒక సొంత ఇల్లు ని కూడా కల్పించలేకపోయారు.కాని తను చనిపొఇన తరువాత పెద్ద పెద్ద సభలు ఉపన్యాసాలు ఇచ్చారు మన వాళ్ళు."పోఇన వారు పుణ్యాత్ములు ఉన్నవారు వారి తీపి గుర్తులు" కాని వేటూరి గారి విషయం లో "పోయిన వారు పుణ్యాత్ములు మిగిలి ఉన్న ఆయన పాటలు మనకు ఎప్పటికి తీపి గుర్తులు".ఒకప్పుడు హీరో ని చూసో హీరొయిన్ ని చూసో సినిమా కి వెళ్ళే వాళ్ళు కాని కేవలం ఆత్రేయ గారి పాటల వల్లనే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయంటే అది అతిశయోక్తి కాదేమో.మాతృదేవోభవ ఈ సినిమా పాటలు విని కళ్ళు చెమర్చని వారంటూ ఉండరేమో.
ధనం కోసమే కలం పట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్న ఈ కాలం లో కుడా పయిస కూడా ఆశించకుండా ఎంతోమందికి పాటలు రాసిన గొప్ప వ్యక్తి.అలాంటి మహానుభావుడ్ని మన ప్రభుత్వం కాని సిని ఫీల్డ్ కాని ఒకింత తక్కువ చేసి చూసిందనే నా అభిప్రాయం.శారీరకం గా ఆయన మనకుదూరమయినా కాని,పాట బ్రతికి ఉన్నంత కాలం వేటూరి గారు చిరంజీవి గానే ఉంటారు.ఎలాగూ వారు ఉన్నప్పుడు వారి సొంత ఇంటి కలని నెరవెర్చలేకపోయినా కనీసం వారి ఆత్మ శాంతించే లా వారి కుటుంబ సబ్యులకన్నా ఆ అవకాశాన్ని కల్గిస్తారని, ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ఇన్ని రోజులు లేట్ అయినందుకు నన్ను నా బిజీ లైఫ్ ని దూషించుకుంటూ మనస్పూర్తి గా "వేటూరి సుందర రామ మూర్తి" గారికి నివాళులు అర్పిస్తూ………
Your’s……………………………….సతీష్.