Pages

Sunday, April 25, 2010

ప్రేమంటే అర్ధం కాదు...ప్రేమిస్తే వ్యర్దం కాదు


"ప్రేమ అనేది రెండు అక్షరాలు…దానిమీద ఆధారపడ్డాయి కొన్ని జీవితాలు,
ప్రేమంటే అర్ధం కాదు,ప్రేమిస్తే వ్యర్దం కాదు".

ప్రేమ న్యూటన్స్ లా కన్నా గొప్పది,
డక్వర్త్ లూ ఇస్ ప్రాసెస్ కన్నా అర్ధం కానిది.

ఈ టాపిక్ ఆత్రేయ గారి చేతిలో పడితే మధురమయిన కవిత లా వినిపిస్తుంది,
రవి వర్మ చేతిలో పడితే అందమయిన చిత్రం లా కనిపిస్తుంది.

అస్సలు ప్రేమ అంటే ఏంటి అని ఒక బగ్న ప్రేమికుడ్ని అడిగితే  “మాటలకందని మధురమయిన అనుబూతి”అని చెప్తాడు.
అదే ఒక బాధ్యత గల మధ్యతరగతి తండ్రి ని  అడిగితే 
“యవ్వనం లో పెరిగే కొవ్వు లాంటిది”అని చెప్తారు.

ఎందుకింత వ్యత్యాసం ఇద్దరి అభిప్రాయాలలో.
"ఏ దివిలో విరిసిన పారి జాతమో" అని ఒక కవి పాడుకుంటే అలాంటి  మరో కవి "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం "అని పాడుకుంటాడు.

ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే ప్రేమ ఎప్పటికీ  గొప్పదే కాని దాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులే గొప్ప వాళ్ళా కదా అనే దానిమీద ప్రేమ ఆదారపడుతుంది.
ప్రేమలో ఎటువంటి తేడాలుండవు అది స్వచ్చమయిన రంగు,రుచి,వాసన లేనిది.
మన బాషలో చెప్పాలంటే కుల,మత,లింగ బేధాలు లేనిది ప్రేమ.

ఒక వ్యక్తి అవతలి వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరచడం ఎంత కష్టం అంటే దాని కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు,
ఎవరి ప్రేమలో అయిన అదే కీలకం.
కాని మన సినిమాల లో ఒక్క పాట తో హీరో హీరొయిన్ మద్య ప్రేమను  కల్పేస్తారు.అంతేలే సినిమా అనేది 2:30hrs టైం మాత్రమె కదా ఉండేది.

ప్రేమలో పడ్డవాడికి అక్షరాబ్యాసం లేకపోయినా ఆత్రేయలా కవితలు చెప్తాడు,
మొగలి పువ్వు లాంటి వాడు కూడా మల్లెపూవు లా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు.
పొద్దున్నే రోడ్ మీద ఎండలో తన ప్రేయసి కోసం పడి గాపులు కాచి ఆకరికి తను ఎదురుగా రాగానే తలదించుకొని వెర్రి చూపులు చూస్తాడు. ఇదంతా చూసే వాడికి పిచ్చి చేష్టల్లా కనిపిస్తుంది,
కాని అది అనుభవించే వాడికి మాత్రం ప్రపంచాన్నే జయించిన అనుభూతిని మిగులుస్తుంది.

"మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం పట్టించుకోము ,మనం ఇష్టపడే వాళ్ళు  మనల్ని పట్టించుకోక పోయినా వదిలిపెట్టం" 

పెద్ద వాళ్ళ దృష్టిలో ప్రేమంటే ట్యాంక్ బండ్ మీద,సినిమా హాళ్ళలో,పార్కుల్లో చెట్టా పట్టాలు వేసుకుని హద్దులు దాటటమే ప్రేమంటే అనే అభిప్రాయాన్ని కల్పిచ్చింది మనమే.
స్వచ్చమయిన గాలి ప్రాణ వాయువు లాంటిది,అదే గాలిలో విష వాయువులు కలిస్తే ఆ గాలి ప్రాణాంతకంగా మారుతుంది.

స్వచ్చమయిన గాలి లాంటిదే ప్రేమ కుడా,అదే ప్రేమలో  స్వార్ధం,కుళ్ళు,కుతంత్రాలు కలిస్తే మధురమయిన ప్రేమ కాస్త విషాదం గ మారిపోతుంది.
అందుకే ఈ యాసిడ్ దాడులు ఇవ్వన్ని,యాసిడ్ పోసిన వాడల్లా చెప్పే కారణం ఒక్కటే 
"నన్ను నా ప్రేమను ఆ అమ్మాయి లేక అబ్బాయి మోసం చేసారు" అని.
మోసం చేస్తే యాసిడ్ పోస్తారా? నిన్ను మోసం చేసారు అంటే అస్సలు ఆ అమ్మాయి లేక అబ్బాయి నిన్ను  ప్రేమించలేదని అర్ధం.ప్రేమలో మోసం స్వార్ధం ఉండవు.అలా అంటే మనం మన తల్లిదండ్రుల మరియు వాళ్ళ ప్రేమను ఎన్నిసార్లు మోసం చెయ్యట్లేదు,ఇలా మోసం చేసిన ప్రతి వాళ్ళ మీద యాసిడ్ పోయాలంటే మన పేరెంట్స్ కి కెమికల్ లాబ్స్ లో ఉన్న యాసిడ్ మొత్తం ఇచ్చినా సరిపోదు మన మీద పోయటానికి.
ప్రేమను పంచాలి కాని ప్రేమను ఆసించొద్దు,అలా ఆశిస్తే అది స్వార్ధం అవుతుంది తప్ప ప్రేమ కాదు. 

ఎంతో గొప్ప వ్యక్తి మదర్ తెరీసా ఆమెకు ప్రేమను పంచడమే కాని ప్రేమను ఆశించడం తెలీదు.”ఒకసారి మదర్ తెరీసా పని చేసే ఆశ్రమం కు ఒక బ్రిటిష్ రాణి వెళ్ళినప్పుడు అక్కడ మదర్ తెరీసా ఒక కుష్టు రోగి వంటిని తుడుస్తూ కనిపిచ్చిందట,అప్పుడు ఆ రాణి నాకు 100 కోట్లు ఇచ్చినా కూడా నేను ఆ పని చేయను అందట,అప్పుడు మదర్ తెరీసా నేను కుడా అంతే అన్నారట".ఆఆ మాటల్లో ఎంత నిస్వార్దమయిన ప్రేమ ఉంది.అందుకే ఎదుటి వాళ్ళని ప్రేమించే వాడు ఎప్పుడు సంతోషం గా ఉంటాడు,ఎదుటి వాళ్ళ ప్రేమను ఆశించే వాడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు.



"ప్రేమంటే అర్ధం కాదు" అనే లానే ప్రేమను ఉంచుదాం...
"ప్రేమంటే వ్యర్దం"అనేలా మాత్రం నడుచుకోవద్దు. అని ఆసిస్తూ........






ప్రేమతో……………………………..సతీష్.