Pages

Friday, August 16, 2013

"అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా..!!"


ముందుగా ఒకింత నిస్పృహతో  అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగష్టు 15 వచ్చినప్పుడల్లా నిజం గా మూడ నమ్మకాలను నమ్మాలేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం  వచ్చింది అర్దరాత్రి అమావాస్య వలనేమో మన బ్రతుకులు ఇంకా చీకటిలోనే ఉన్నాయి. ఏ రోజు అయితే ఒక ఆడపిల్ల ఒంటరిగా అర్దరాత్రి తిరుగ గల్గుతుందో ఆ నాదే మనకు నిజమయిన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన మహాత్ముడు చెప్పారు. అర్దరాత్రి సంగతి పక్కన పెడితే మన దేశ రాజధాని నది బొడ్డులో మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్ల ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉంది.కార్పొరేట్ మాటల్లో చెప్పాలంటే ఒక ఫిమేల్ ఎంప్లాయ్ ని కాబ్ లో సెక్యూరిటీ గార్డ్ లేకుండా పంపలేని మనకి స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చినట్లా..రానట్లా..!!


"ఏ దేశమేగినా ఎందు కాలెడినా

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,

పొగడరా నీ తల్లి భూమి భారతిని,

నిలపరా నీ జాతి నిండు గౌరవము.

లేదురా ఇటువంటి భూదేవి యెందూ

లేరురా మనవంటి పౌరులింకెందు."
అని రాయప్రోలు గారు ఎలుగెత్తి చాటారు.ఇప్పుడున్న పరిస్థుతులలో మనం ఏ ధైర్యం తో "లేరురా మనవంటి పౌరులింకెందు" అని చెప్పగలమా..!! "నిలుపగాల్గుతున్నామా మన జాతి నిండు గౌరవాన్ని". ఒక్కరోజు త్రివర్నపు పతాకాన్ని ఎగురవేసి, మన విలువలను గాలోకి వదిలేసి, టీవీ ల లో దేశభక్తి సినిమా చూసి మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని గుర్తు చేసుకునే దుస్థితికి వంద సంవత్సరాల పోరాటం అవసరమా..!


"దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి" అన్న గురజాడ గారి మాటలు వింటుంటే బాధ గా ఉంది. ఇప్పుడు ఆ మట్టికి ఇచ్చిన విలువ కూడా తోటి మనిషికి మనం ఇవ్వడం లేదేమో. మన స్వాతంత్ర్య సమరయోధులు ఏ ఆస్తులను, ఏ పదవులను అయితే లెక్క చేయకుండా మన దేశం కోసం నిస్వార్డం గా పోరాడారో, ఇప్పుడు నాయకులు అదే ఆస్తుల కోసం అవే పదవులకోసం అమ్ముడుపోయి మన దేశాన్ని స్వార్ధం కోసం పీడిస్తున్నారు.ఈ 67 సంవత్సరాలలో నేను భారతీయుడ్ని అని గర్వం గా చెప్పుకునే దగ్గరనుండి. నేను పలానా మతం, నేను పలానా కులం, నేను పలానా ప్రాంతం అని చెప్పుకునే అంత ఎదిగిపోయాం మనం.మనిషి సృష్టించుకున్న డబ్బు, పదవుల చేతుల్లో మనిషే కీలుబొమ్మలు గా మారి మనల్ని మనమే నాశనం చేసుకుంటూ, మన దేశాన్ని కూడా నాశనం చేసే అంత డెవలప్ అయ్యాం.

"పోరాటాల ఫలితాలను వృధా చేస్తూ..
ధన దాహాలకు చేతులు చాస్తూ..
కుల మతాలకు చిచ్చులు పెడుతూ..
అధికారానికి ఆరాటపడుతూ..
రోజు రోజు కి మ్రుగాలలా మారుతూ..
బానిస బ్రతుకలకు మళ్ళీ బాటలు వేస్తూ..."



సిరివెన్నెల గారు అన్నట్లు "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా..!!"

మీ...................సతీష్.

Friday, August 9, 2013

రాష్ట్రాలు రావణ కాష్టాలు




తెలంగాణా కి ఒక్క రూపాయి కుడా ఇవ్వను, ఏమి చేసుకుంటావో చేసుకో అని ఒకడంటాడు.మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు మిమ్మల్ని ఉండనివ్వం అని ఒకడంటాడు.స్టేట్ ని విడదీయకపోతే నరుకుతా అని ఒకడంటే, విడదీస్తే నరుకుతా అని ఇంకొకడంటాడు.అస్సలు ఏమనుకుంటున్నారో వీళ్ళు,కుక్కలవలె నక్కలవలె సందులలో పందుల వలె. ఎవడి నోటికి వచ్చినంత వాడు వాగడం, ఎవడికి తోచినట్లు వాడు చేయడం అలవాటుగా మారింది మన నాయకులకు. సామాన్యుడికి రోజు అన్యాయం ఏదో ఒక రూపం లో జరుగుతూనే ఉంది, కాని ఇవేమీ ఏ ఒక్క నాయకుడికి కనపడవు ఏ రోజు వాటికోసం రోడ్ ఎక్కి పోరాడిన నాయకుడు ఒక్కడు లేడు. కాని ఈ రోజులు ఆస్తులు అంతస్తులు, పదవులను కాపాడు కోవడానికి మాత్రం రోడ్ మీదకు వచ్చి కొట్టుకు చస్తున్నారు.

దేశం లో ఎన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా పేద వాడు పేద వాడిగానే ఉన్నాడు తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు.వీళ్ళని ఎన్నుకోవడం వల్ల ప్రజలకి ఒరిగిందేమీ లేదు, అలానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ దొంగ రాజి నామాలు, ధర్నాలు వలన మళ్లీ ఇంకొకసారి ప్రజలకి నామాలు పెట్టడమే తప్ప ఉపయోగమేమీ లేదు. రాజకీయ నాయకుడు గెలుపుకోసం ఆస్తులు మాత్రమె పానం గా పెట్టేవాడు ఒకప్పుడు, కాని ఇప్పుడు తన మనుగడ కోసం ప్రజల ప్రాణాలను పనంగా పెట్టడానికి కుడా వెనకాడట్లేదు.ఇక మన మీడియా విషయానికి వస్తే, అవసరమయిన న్యూస్ తక్కువ ఆవేశాన్ని రగిల్చే న్యూస్ ఎక్కువ. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలముందు ఉన్చాల్సింది పోయి ఈ ఏరియా లో బంధు జరిగినప్పుడు ఇన్ని బస్సులు తగల పెట్టారు, కాని ఇప్పుడు జరుగుతున్న బందులో అన్ని బస్సులు తగలపెట్టారు, అప్పుడు పోలీస్ లు కాల్పులు జరిపారు కాని ఇప్పుడు జరపట్లేదు అనడం లో మన మీడియా అర్ధమెంతో ఎవరికీ అర్ధం కావట్లేదు.

మన నాయకులు ఎలా తయారంటే వాళ్లకి పదవి ఇస్తే అమ్మా అని కాళ్ళ మీద పడతారు, ఇవ్వకపోతే దానేమ్మా అని బొమ్మలు తగల పెడతారు. వాళ్ళ స్వార్ధం వాళ్ళదే తప్ప వాళ్ళని ఎన్నుకున్న, వాళ్ళని నమ్ముకున్న ఒక సామాన్యుడి జీవితం ఎమయిపొఇనా అనవసరం. నోట్ కోసం వోట్, మందు కోసం బంధు చేయడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నన్న్ని రోజులు మన రాష్ట్రాలు రావణ కాష్టాలు గానే మిగిలి పోతాయి. ఒక మంచి నాయకుడికి వేసే నీ వోటు భవిష్యతు కి చూపిస్తుంది ఒక మంచి రూటు, అదే తేడా వోటు అవుతుంది నీ భవిష్యతు కి వెన్నుపోటు.


మీ...............................సతీష్